Thursday, September 12, 2024

జయ జయోస్తు.. దుర్గమ్మ సన్నిధిలో గ్రంథావిష్కరణ

మనసుకు, మాటకు అందని దివ్య వైభవంగా అమ్మవారి వరాలపోతల్లాంటి అద్భుత గ్రంధాలను అమోఘరీతిలో అందిస్తున్న ప్రముఖ రచయిత, పురాణపండ శ్రీనివాస్ కి మహాసరస్వతీకటాక్షం ఉండటం వల్లనే … మనకి కాంతిపుంజాల్లాంటి ఇన్ని గ్రంధాలు అందుతున్నాయని ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు నాలుగో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం చేయడానికి కొద్దిగంటల ముందే … బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో ఆయన విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ‘ జ్ఞానమహాయజ్ఞకేంద్రం ‘ మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘ నారసింహో … ఉగ్రసింహో ‘ దివ్య గ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘ జయ జయోస్తు ‘ గ్రంధాన్ని ఆవిష్కరించారు.

చంద్రబాబు సమర్ధతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్షేమంకరమైన ప్రజారంజకపాలన అందించాలని కోరుతూ … ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ , మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు. తొలి ప్రతులను స్వీకరించిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానముల జాయింట్ కమీషనర్ కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ఈ గ్రంధాల్లో ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క అగ్నిమండలంలా , పురాణపండ శ్రీనివాస్ ఒక్కొక్క గ్రంధమూ ఒక్కొక్క సూర్య మండలంలా తేజరిల్లుతున్నాయని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement