నేడు హనుమాన్ జయంతి
”గోష్పదీకృత వారాశిం, మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందేనిలాత్మజం”
అపారమైన సముద్రాన్ని ఆవుపాదమంతటి పరిమాణంలో ఉన్న ప్రదేశాన్ని దాటినంత తేలికగా దాటినవాడు, భయంకరులైన రాక్షస వీరులను దోమలను చంపినంత సులభంగా వధించినవాడు, రామాయణమనే రత్నమాలికలో మణిపూస వంటివాడు అయిన వాయునందనుడు అగు హనుమకు నమస్కరిస్తున్నాను.
చాలా గొప్ప వైవిధ్యభరిత పాత్రలనే రత్నాలతో కూర్చబడిన హారం శ్రీ మద్రామాయణం. అన్నిటి మధ్యనా తళుకులీనే మేటి మణిపూసలా హనుమంతుడు మనకు దర్శనమిస్తాడు. మహా జ్ఞాన సంపన్నుడు, బలశాలి, వినయశీలి, మహా భక్తుడు, ధీరాగ్రేసరుడు,
జయ హనుమంత! అమిత బలవంత!
శివాంశతో, వాయుదేవుని అనుగ్రహంతో కేసరి, అంజనా దేవి దంపతులకు జన్మించిన ఆంజనేయుడు బాల్యం నుండే తన అద్భుత శక్తి సామర్థ్యాలను చూపించాడు. సూర్యబింబాన్ని చూచి అది ఒక ఎర్రని పండని భావించి దాన్ని తినడానికి ఆకాశమార్గాన దూసుకెళ్తున్న బాలాంజనేయుడు దేవతలనే దిగ్భ్రాంతులను చేశా డు. సూర్యుడు లేని ప్రపంచం నిశ్చైతన్యం అయిపోతుందనే భయం తో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని ముఖంపై ప్ర యోగించగా ఆయన దవడ సొట్టపోయింది. దవడ ఎముకను సం స్కృతంలో ‘హనువు’ అంటారు. సొట్టపోయిన ‘హనువు’ కలవాడు కనుక హనుమంతునిగా పిలువబడ్డాడు. తన అంశజునిపై వజ్రా యుధ ప్రయోగం జరిగిందని కోపించి స్తంభించిపోయిన వాయు దేవుని ప్రభావంతో ప్రపంచానికి ఊపిరాడలేదు. ఆయనను శాంతిం ప చేయడానికి సకల దేవతలూ హనుమంతునికి అనేక వరాలనిచ్చా రు. సూర్యుడు తేజస్సును, యముడు అమరత్వాన్ని, కుబేరుడు అజే యత్వాన్ని, బ్రహ్మ చిరంజీవిత్వాన్ని, బ్రహ్మాస్త్రం నుండి విముక్తిని, తన తరువాత కాలంలో బ్రహ్మత్వాన్ని… ఇలా దేవతలు ఎన్నో వరాల ను హనుమకు ప్రసాదించి అతడిని మరింత బలశాలిగా చేశారు. బాల్యంనుండే తన దేహ బలాన్ని ఇటువంటి దుందుడుకు పనులకు ఉపయోగిస్తున్న బాలాంజనేయునికి ఆయన హతైషులు ఒక శాపం వంటి వరాన్ని ఇచ్చారు. అదేమంటే తన శక్తి తనకు తెలియకపోవ డం. ఇతరులెవరైనా తెలిపితే తప్ప మారుతికి తన శక్తి సామ ర్థ్యాలు తెలియకూడదని హితైషుల ఆంతర్యం.
విద్యావినయ సంపన్నుడు
ఆంజనేయుడు సూర్యభగవా నుని తన గురువుగా ఎంచుకొని తనకు విద్యలు నేర్పమని అర్థించాడు. నిరంతర చలనశీలినైన తన వద్ద విద్యనేర్వడం కష్ట సాధ్యమని సూర్యుడు చెప్పినా విద్యార్జనలో మక్కువ
ఎక్కువగాగల హనుమ సూర్యుని గమనవేగంతో సమానమైన వేగంతో ఆయనను అనుసరిస్తూ ఏకాగ్ర తతో విద్యలను అభ్యసించా డు. కొన్ని పురాణాలు మారుతి ఒక కాలు ఉదయాద్రిపై, మరొక కాలు అస్తాద్రిపై నిలిపి సూర్యుని వద్ద విద్య నేర్చుకొన్నాడని చెబుతున్నా యి. ఇలా పట్టుదల, బుద్ధికుశలత, సూక్ష్మగ్రాహత్వము, విద్యా పారీ ణతలకు ఆంజనేయుడు ప్రతీక. ఆయన విద్యాదాత కూడా. ఆయన ను సేవిస్తే విద్యలలో కౌశల్యం, సూక్ష్మ బుద్ధి తప్పక లభిస్తాయని పరాశర సంహత చెబుతుంది. అం తటి విద్య, ఘనమైన దేహబల మున్నా, మూర్తీభవించిన వినయ స్వరూపుడు హనుమ. తన ప్రభు వైన సుగ్రీవుని పట్ల, తనకు దైవమైన శ్రీరాముని పట్ల ఆయన ప్రదర్శిం చిన వినయం అద్వితీయమైనది. తాను వారికి సేవకునిగా, బంటుగా ఎప్పుడూ భావించేవాడు. ఇది లోకులందరకూ స్ఫూర్తిదాయకం.
సమయస్ఫూర్తికి నిలువెత్తు మూర్తి
ఎక్కడ పెరగాలో ఎక్కడ ఒదగాలో తెలిసినవాడు హనుమ. మైనాకుని వద్ద వినయం; సురస, సింహకలను వధించే సమయాల లో సూక్ష్మ రూపాన్ని ధరించడం, లంకిణితో సంభాషించే సమయం లో తన రాకలోని ఆంతర్యాన్ని మరుగుపరచడం, బ్రహ్మ వరం వల న బ్రహ్మాస్త్రం తనను బంధించదని తెలిసినా రావణుని సభలో ప్రవే శించడానికిగాను దానికి కట్టుబడినట్లు నటించడం.. వంటి సన్నివేశాలు ఆయన సమయ స్ఫూర్తికి మచ్చుతునకలు.
హనుమ గొప్ప రాజనీతిజ్ఞుడు. వాలి వలన ముప్పువాటిల్ల
కుండా, అతను ప్రవేశించ వీలులేని ఋష్యమూక పర్వత నివాసాన్ని తన ప్రభువైన సుగ్రీవునికి సూచించుట, శ్రీరామునితో సుగ్రీవునికి మైత్రి కలిగించి, సుగ్రీవుడు తన రాజ్యాన్ని, భార్యను తిరిగిపొందడా నికి మార్గం ఏర్పరచడం, రావణునితో శ్రీరాముని రాయబారిగా మా ట్లాడిన విధానము మారుతిని గొప్పరాజ నీతివేత్తగా చూపుతాయి.
కార్యదీక్షాతత్పరుడు
”ధీరుల్ విఘ్ననిహన్య మానులగు చున్ ధృత్యున్నతోత్సాహు లై ప్రారబ్ధార్థ ములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్” అని భర్తృహరి హనుమంతుని దృష్టిలో ఉంచుకొని చెప్పాడేమో అనిపి స్తుంది. ఒక కార్యాన్ని తలపెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వెన క్కు తగ్గే ప్రసక్తే లేకుండా, ఆ కార్యం నెరవేర్చే దాకా విశ్రమించని లక్ష ణం హనుమది. సామాన్యులకు సరేసరి… అంగద, జాంబవంతాది వీరులకు కూడా దాటడానికి సాధ్యంకాని సముద్రాన్ని దాటి, లంక చేరి, సీతమ్మ జాడ కనుగొని, తమ శక్తిని శత్రువులకు తెలియజేసి, తిరి గి ఆ విషయాన్ని శ్రీరామునికి నివేదించే వరకూ హనుమ విశ్రమించ లేదు. అంతటి కార్యనిబద్ధుడు హనుమ. శివాంశతో జన్మించిన వాడు, సర్వదా శ్రీమన్నారాయణుని స్వరూపుడైన శ్రీరాముని హృద య మునందు నిలుపుకొన్నవాడు, భవిష్యత్ బ్రహ్మ పదమునకు అర్హ త సాధించినవాడూ అయిన ఆంజనేయుడు, బ్రహ్మ విష్ణు శివా త్మ కుడు అని, త్రిమూర్త్యాత్మకుడు అని పిలువబడ్డాడు. సర్వ దేవత లూ తమతమ అంశలను అతనికి ధారపోయడం వలన హనుమ సర్వదే వాత్మకుడనీ పొగడబడినాడు. ఆయనను ఆరాధించడమంటే సకల దేవతలనూ ఆరాధించడమే. ప్రతి రోజూ, ప్రతి క్షణం ఆ మహాత్ము ని స్మరిస్తూ, అనుసరిస్తూ పునీతులమవుదాం.
– గొల్లాపిన్ని సీతారామశాస్త్రి
94407 81236
————————