Sunday, November 3, 2024

జగతి భావి బ్రహ్మ ఆంజనేయుడు

సీతమ్మ జాడను కనుగొనడానికి సముద్ర మార్గంలో బయలుదేరిన ఆంజనేయుడి కి ఎన్నో అవరోధాలు, అగ చాట్లు, ఆటంకాలు ఎదురయ్యాయి. అంతకు మించి రాక్షసుల నుం చి పరిణమించిన ముప్పు, ప్రాణగండాలను ఎం తో శక్తితో, బల, పరాక్రమాలతో ప్రతిఘటించి ముందుకు సాగాడు. ఒకే లక్ష్యం. ఒకే పట్టుదల, ఒకే దృఢదీక్ష అతన్ని సీతమ్మ జాడ కోసం ద్విగి ణీకృతోత్సాహంతో ముందుకు నడిపించింది. అందుకే శ్రీరామ కార్యంలో విజయుడైనాడు…. శ్రీరాముడు రావణ, కుంభకర్ణాది మహారాక్షస వీరులెందరినో హతమార్చడం, ఇంద్రజిత్తు శరా ఘాతం నుండి లక్ష్మణుడిని బతికించడం, సీత మ్మను శ్రీరాముని దరిజేర్చడం లంకకు విభీషణు న్ని రాజును చేయడం, రావణ సంహారం అనంత రం అయోధ్యకు సకాలంలో తిరిగివచ్చి భరతు ని ప్రాయోపవేశాన్ని (ఆత్మాహుతిని) నివారించి శ్రీరామ పట్టాభిషేకం చేయడం వంటి శ్రీరామ కా ర్యాలన్నింటి విజయాలకు కీలకంగా వ్యవహ రించిన వ్యక్తి ఆంజనే యుడని శ్రీరాముడు ప్రకటించాడు. ఇన్ని మహోపకారాలు చేసి తన కీర్తిని యావత్‌ ప్రపంచానికి చాటిన హనుమ తన ఆత్మ, తన బహర్‌ ప్రా ణం అంటూ కొనియాడాడు. తనకు భరతునితో సమానమంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు ఆచంద్రతారార్కం చిరంజీవిగా వర్ధిల్లుతావని #హనుమ కు శ్రీరాముడు వరమిచ్చాడు. అలాగే నవబ్ర#హ్మల్లో ఒక బ్రహ్మగా…. భావిబ్రహ్మ గా జగాన ఆరాధించబడతావని కూడా వరమిచ్చాడు.

అలసట… ఆయాసం ఎరుగని హనుమ

ఆంజనేయుడు వాయుదేవుడి వర ప్రసాదంతో జన్మించినందున ఆయన ఎంత కఠినంగా శ్రమించినా…. యుద్ధం చేసినా అలసట, ఆ యానం, నీరసం, నిర్వీర్యం, విసుగు, విరామం అనేవి ఆయన దరిచేరవు. ఆయన చేపట్టిన కార్యసాధన చేయడానికి ఇంకా అత్యంత నూ తనోత్సాహం వస్తుంది, ప్రత్యర్థుల తో తలపడుతున్నపుడు ఆ లక్షణాల వల్లనే ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడి స్తాడు. ఎందుకంటే ఎదుటి వారిలో ఆ శక్తి ఉండక కాసేపటికే అలసట, ఆయానం, నీర సం, నిర్వీర్యం కలిగి నీరసపడిపోతాడు. అదే హనుమంతుడికి ఇతరులకు ఉన్న తేడా.

రామనామం వినబడ్డ చోట
#హనుమ

శ్రీరాముని గుణస్థుతి, శ్రీరామ భజన ఎక్కడ జరుగు తుందో అక్కడ హనుమంతుడు ఉ టాడనీ తులసీదాసు ఇలా చెప్పాడు. ”యత్రయత్ర రఘునాథ కీర్తనం…. తత్రత త్ర అంజనా నందనమ్‌” అని చెప్పాడు. దీంతో హనుమంతు నికి శ్రీరా ముని మించిన దైవం మరొకటి లేదు. ఆయన నిశ్చల భక్తికి ఇదే తార్కాణం, గంధమాదన పర్వతంపై…. శ్రీరాముని వరంతో అంజనేయస్వామి చిరంజీవి అయిన నేపథ్యంలో శ్రీరాముని నిర్యాణం అనంతరం అహర్నిశలు శ్రీరామ ధ్యానంతో తపస్సు చేసుకుంటూ గాలి, నీరు, ఆహారం అన్నీ శ్రీరామగా నామృతంగా గ్రోలుతూ గంధమాధన పర్వతంపై త్రేతాయుగం నుండి ఇప్పటి కలియుగం వరకు అలాగే సూర్యచంద్రులు న్నంత వరకు ఆంజనేయుడు చిరంజీ విగా ఉం టాడనీ, మరణం లేదని, పౌరాణికు లు చెబుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement