Tuesday, November 26, 2024

జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర.. ఘ‌నంగా ప‌హండి ఉత్స‌వాలు

ఒడిశాలోని పూరిలో ఇవాళ జ‌గ‌న్నాథ యాత్రలో భాగంగా ప‌హండి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. రెండేళ్ల త‌ర్వాత ర‌థ‌యాత్ర కోసం భ‌క్తుల‌కు అనుమ‌తి ఇచ్చారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల గ‌డిచిన రెండేళ్లు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌ని విష‌యం తెలిసిందే. మూడు ర‌థాల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా అల‌క‌రించారు. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు పూరి చేరుకున్నారు. జ‌గ‌న్నాథుడు, బ‌ల‌బ‌ద్రుడు, సుభ‌ద్రా ర‌థాలు యాత్ర కోసం సిద్దం అయ్యాయి. పహండిలో భాగంగా బ‌ల‌భ‌ద్రుడు చెక్క విగ్ర‌హాన్ని త‌ల‌ద్వాజ ర‌థం వ‌ద్ద‌కు తీసుకువెళ్లారు. బ‌ల‌భ‌ద్రుడి త‌ర్వాత దేవి సుభ‌ద్ర విగ్ర‌హాన్ని దేబ‌ద‌ల‌న ర‌థం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. పూరి శ్రీమందిరం నుంచి భ‌గ‌వాన్ జ‌గన్నాథుడి విగ్ర‌హాన్ని అత్యంత శోభాయ‌మానంగా అల‌క‌రించిన నందిఘోష ర‌థం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు మ‌రికాసేప‌ట్లో మూడు ర‌థాల‌ను హ‌రినామ స్మ‌ర‌ణ‌ల మ‌ధ్య లాగ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement