Monday, November 25, 2024

సందేహాలను తీర్చేది ధర్మసూక్ష్మమే!

తెలిసి తెలిసి మరొక ప్రాణి సౌఖ్యానికి హాని కలిగించకుండా వుండడం అహంస. ధర్మా లలోకెల్లా పరమ ధర్మంగా భావించబడు తుంది అహంస. అయితే ధర్మం అన్నమాట ఎక్కడైతే వినబడుతుందో, ఆ మాటను అం టి పెట్టుకునే ధర్మసూక్ష్మం అనే మాట కూడా ఉంటుంది. ఒక ధర్మానికి సంబంధించిన సం దేహాలను తీర్చడానికి ప్రయత్నించి సఫలీకృ తమయ్యేది ధర్మసూక్ష్మమే కనుక దానితో పని పడుతూనే ఉంటుంది.
ఆంధ్ర మహాభారతం, ఎఱ్ఱన రచించిన అరణ్యపర్వంలో అహంస గురించి ఆసక్తిక రమైన చర్చ ఉంది. ఒక ఊరిలో ధర్మవ్యాధు డనే వ్యక్తి ఉండేవాడు. మాంసాన్ని అమ్ముకు ని జీవనం సాగిస్తూ ఉంటాడు. అలాంటి అత డి దగ్గరికి కౌశికుడనే బ్రాహ్మణుడు వస్తాడు. ఇతడు తనంత తానుగా వచ్చినవాడు కాడు. ఒక ఇంటికి భిక్ష కోసం వెళ్ళగా, ఆ ఇంటి ఇల్లా లు తన భర్తకు సేవ చేసే పనిలో వుండి ఇతనికి భిక్ష వేయడంలో ఆలస్యం చేసిందని ఆమెపై కోపగించుకోగా,ఆమె నాలుగు చివాట్లు పెట్టి, ‘సద్బ్రాహ్మణుడవైన నీకు భిక్ష వేయడంలో జరిగిన ఆలస్యం గర్హనీయమైనదిగా, అధర్మ మైనదిగా నీకు అనిపించవచ్చునేమోగాని, నాకు మాత్రం నీకంటే ముందు, అలసి పోయి అప్పుడే ఇంటికి చేరుకున్న నాభర్తకు సేవచేసి, అతనికి సేదతీర్చేంత వరకూ అసలు నీ భిక్షకు సంబంధించిన స్ఫురణ లేకపోవడం ధర్మం గానే అనిపిస్తుంది సుమా! అయినా ఈ విష యాలలో ఇంకా నువ్వు తెలుకోవాల్సింది చా లా ఉందని నాకు ఇప్పుడు అనిపిస్తూ వుంది కాబట్టి, నీకు నా సలహా ఏమిటంటే, నీవు ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, పొరుగూరి లోనే ధర్మవ్యాధుడనే ఒక ఉత్తముడు ఉన్నా డు, అతడు నీకు ఇటువంటి ఎన్నో ధర్మ సూ క్ష్మాల గురించి చెప్పే జ్ఞానం కలిగినవాడు, వెంటనే అతని దగ్గరికి వెళ్ళమని’ చెప్పగా వచ్చినవాడు. ఎంతో ఆశతో పరుగెత్తుకుని వచ్చిన కౌశికునికి అక్కడ దృశ్యం రోత పుట్టిం చగా ”ఏమీటీహంస? దీనితోనా బతుకు గడుపుతున్నావు నువ్వు?” అంటాడు.
‘నీవు గడు ధర్మ విదుఁడవు జీవహంస
జీవనంబుగ నడుచుట శిష్ట పథమె?
యకట! యీ ఘోరకర్మంబునకు మదీయ
బుద్ధి దద్దయు దు:ఖము వొందె నిపుడు.’
(అరణ్య పర్వం,పంచమాశ్వాసం, 31వ ప ద్యం)
‘చాలా ధర్మం తెలిసినవాడవని చెప్పింది ఆ ఇల్లాలు, నీవు చూడబోతే ఇలాగున్నావు. ఇది సరైనదేనా? నీ వ్యవహారం నా మనసుకు చా లా బాధను కలిగిస్తూ వుంది’ అంటాడు. ‘అం దులో తప్పేమీ లేదు స్వామీ, ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించడమే ధర్మం. నేనేజీ వినీ చం పను. ఎవరో చంపి తెచ్చిచ్చిన దానిని అమ్ము కుని బ్రతుకుతుంటాను. వచ్చిన డబ్బులోం చి చేతనైనంత దానధర్మం కూడా చేస్తూంటా ను’ చెప్పాడు ధర్మవ్యాధుడు.
‘జీవహంస యెన్నండును జేయ ననఘ!
యొరులు సంపి తెచ్చిన మాంస మొనర నిలిచి
తగిలి వెల కమ్మి బ్రతుకుదుఁ; దద్ధనమున
నమల మానస శాంతి నాయర్థ మెందు.’
(అరణ్యపర్వం, పంచమాశ్వాసం, 33వ ప ద్యం)
‘అట్లా సంపాయించుకున్న ధనంతో బ్ర తకడంలో నాకు మనశ్శాంతి కూడా ఉంది’ అంటాడు. ‘హంస, అహంస అనేవాటి గు రించి నీ మనస్సులో ఇంకా బోలెడు సందేహా లు ఉన్నట్లుగా ఇప్పుడు నాకు అర్ధమైంది కాబట్టి, ఆ సందేహాలు అన్నీ తీరేట్లుగా కొన్ని సంగతులను చెబుతాను విను’ అని –
‘విను మహంస ధర్మవితతి కెల్లను మేటి;
యదియ సత్యయుక్తమైన వెలయు
ననఘ! శిష్టచరితులందు సత్యమ కడు
నధిక మనిరి శ్రుతుల నరసి బుధులు.’
(అరణ్యపర్వం, పంచమాశ్వాసం, 48వ ప ద్యం)
‘అహంస అనేది అన్నిటిలోకీ ఉత్కృష్ట మైన ధర్మం. సత్యంతో కూడుకున్న అహంస కు మరి తిరుగేలేదు. అయితే ఇందులో ఆలో చించాల్సిన సంగతులు కూడా చాలా ఉన్నా యి.’ అని అసలు విషయం చెబుతాడిలా-
‘భూమి, నీరు, ఆకాశం అన్నీ ప్రాణి సమూహాలతో నిండి వుండడం వలన నిత్యం జరిగే పనులలో ఏదోరకమైన జీవహంస జరుగుతూనే వుంటుంది. హంసలేని దేహ యాత్ర సాగించడం మానవులకు సాధ్యమే కాదు. ఈ విషయాన్ని గ్రహంచలేని కొందరు మాత్రం మేము అహంసతోనే బ్రతుకుతున్నా మని భ్రమపడుతూ ఉంటారు’ అని పైపద్యం భావం. ఆ మాత్రమే కాదు ఆ మాటలకు ముక్తాయింపుగా ఇలా చెబుతాడు.
హంస సేయనివాఁడు లేఁడిజ్జగమున
నొక్కడైనను, దమతమ యోపినట్లు

హంసతెరువున కెడఁగల్గి యేఁగవలయు

నదియ చూవె యహంసనా నతిశయిల్లు.’
(అరణ్యపర్వం, పంచమాశ్వాసం, 60వ ప.)
‘హంస చేయనివాడు ఈ భూప్రపంచం లో ఒక్కడూ లేడు. హంస అనే మార్గానికి దూరంగా నడుస్తూ, ఎవరికీ హాని కలిగించ కుండా జీవనం సాగించాలి. అహంసాయు త జీవనం అనేమాటకు అంతకు మించి నిర్వచనం ఉండదు’ అని పైపద్యం భావం.

Advertisement

తాజా వార్తలు

Advertisement