Sunday, September 22, 2024

అనుల్లంఘనీయం…కలియుగ ధర్మ ఆచరణం!


దైనందిన జీవితాల్లో ఎన్నో నియమ నిబంధనలు ఆచరిస్తూంటాం. ఉదాహ రణకు రహదారుల్లో రాకపోకలను నియంత్రించే నియమాలు, విద్యార్థులకు విధించు క్రమశిక్షణ నిబంధనలు, పనిచేసే కార్యాలయాలలో అధికారు లు సూచించిన నియమాలు, దేశ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని లిఖింపబడిన రాజ్యాంగం కావొచ్చు ఇలా ఎన్నెన్నో తూచ తప్పకుండా అనుసరిస్తూ ఉంటాం.
పై వాటిలో ఏవైనా ఉల్లంఘనలు అతిక్రమ ణలు జరిగితే అలా ఉల్లంఘించినవారు శిక్షా ర్హులు. ఆ నియమ నిబంధనలను ప్రజలు సక్ర మంగా పాటిస్తున్నారా లేదా అని పర్యవేక్షిం చ డానికి అధికారులుంటారు. వారు అ లా ఉల్లంఘించిన వారిపై అపరాధ ము దండనలను విధిస్తారు.
ఇలా మనం ప్రతిరోజు ఏదో ఉల్లంఘనలకు పాల్పడుతూ తగిన అపరాధాలకు శిక్షలకు గురౌతున్నాము కదా కాని మనకు వేదాలు ధర్మ శాస్త్రాలు సూచించిన విధులను సక్రమం గా నిర్వర్తించకపోతే వాటిని ఎవరు పర్యవేక్షిస్తు న్నారు, ఎవరు శిక్షలు విధిస్తున్నారు. ఆలోచించ దగ్గ విషయమే. అసలు మన ప్రాచీన ఋషులు మనం వైదిక కర్మలను ఎలా ఆచరించాలో ఎప్పుడో సూచించారు. శాస్త్రాల ద్వారా నియమావళిని రూపొం దించి మనకు అందించారు. కాని వాటిని మనం పెడ చెవి న పెడితే ఎవరు పర్యవేక్షించాలని, ఎవరు శిక్షించాలని. సా ధారణంగా మానవులు తమపై పర్యవేక్షించేవారు ఎవరూ లేకపోతే శాసనాలను అతిక్రమించడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మనం శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించకుండా చాలా హనంగా చూస్తున్న స్థితికి దిగజారిపోతున్నాం. అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనం చేసే ప్రతి కర్మ, ఉల్లంఘనలు పర్యవేక్షించడానికి పదునాలుగు దైవత్వ సాక్షులు ఓ కంట కనిపెడుతూ ఉంటారు. వారు మానవ నేత్రాలకు కనపడరు. వారు ప్రతి సెకను గమనిస్తూనే ఉంటారు. మనం చేసే కార్యక్రమాలు వారి దగ్గర ఉన్న మన చిట్టాలో నమోదవుతూనే ఉంటాయి.
మన పాప పుణ్యాల చిట్టా ఎప్పటికప్పుడు లిఖించబడి మన పాపాలు ఎక్కువ ఉన్నాయా లేదా పుణ్యాలు ఎక్కువ ఉన్నాయా అని బేరీజు వేయబడుతుంది. ఒకవేళ పుణ్యాలే ఎక్కువ ఉంటే మనం ఎటువంటి కర్మలు చేయకపోయినా ఫర్వాలేదు మన జీవితం సాఫీగా కొనసాగగలదు. కాని యిలాంటి పరిస్థితి ఉండిపోతుందని ఆలోచించడం పొరపాటు. ఎప్పుడు పుణ్యాలు మొత్తం తరిగిపోయి పాపాలే మిగుల్తాయో అప్పుడు సముద్రంలో తెరచాప లేని ఓడలా ఓలలాడు తుంది జీవితం.
కలియుగంలో ప్రజలు మందబుద్ధులని, ఏ కర్మను ఆచరించాలన్నా వంద ప్రశ్నలు లేవదీసి వాటి అనాచరణకే పూనుకొంటారని మన ప్రాచీన ఋషులకు ముందే తెలుసు. అందువల్లనే వారు ధర్మశాస్త్రాలను మిగిలిన యుగాల వలే విస్తృతపరచకుండా కలియుగపు ప్రజల పోకడకు తగ్గట్టు క్లుప్తీకరించి కలియుగ ధర్మాన్ని రూపొందించారు.
దీన్నిబట్టి మన ప్రస్తుత విద్యుక్త ధర్మాలు వెనుకటి యుగాల కంటే భిన్నమైనది అవలం బ నకు హతువైనది. ఉదా#హరణకు అశ్వమేధయాగం అనే యాగం వుంది. ఇది ప్రాచీన యుగా లలో ఉండేది కాని కలియుగంలో లేదు. మనం ప్రస్తుతం చేయు సంధ్యా వందన తతంగాలన్ని వెనుకటి యుగాలలో ఇంకా విపులంగా ఉండేవి. వాటిని చాలావరకు కుదించారు. ఋషులు మరొక్క అంశాన్ని కూడా తెలియబరిచారు. అది ఏంటంటే గడిచిన యుగాలవలే కలియుగ ప్రజలు ధర్మశాస్త్రాలను అనుకరించడంలో ఎక్కువ ప్రయాస పడక్కర్లేదు. కేవలం ఎంతో కొం త భక్తి శ్రద్ధ చూపితే వెనువెంటనే సాఫల్యత తథ్యం అన్నట్టు. వారు కూర్చిన శ్లోకం ఇది-
యత్కృతే దశభిర్వ్షం: త్రేయయాం హయనేన తత్‌
ద్వాపరే తచ్ఛ మాసేన అహోరాత్రేన తత్‌ కలౌ
ఏ కర్మయైనా కృతయుగంలో ఆచరిస్తే వాటి ఫలితాలు పొందడానికి 10 సంవత్సరాలు పట్టగా, త్రేతాయుగంలో 6 నెలల్లో పొందవచ్చని, ద్వాపరంలో ఒక్క నెలేనని కలియుగంలో 24 గంటలలోపే అనుభవించగలమని ఋషుల ఉవాచ.
మీరు ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా ఆచరిస్తూ ఉండొచ్చు, కాని ఫలితాలు శూన్యం. సత్ఫలి తాలు పొందడానికి రెండే మార్గాలు. ఒకటి, ఆ అనుష్ఠానం గాని, వాటి మంత్రాలను గాని లేదా వాటి స్వరాలను గాని మీరు ఓ క్రమబద్ధమైన రీతిలో నేర్చుకొని పాటించకపోవచ్చు. రెండు, మీ పాపపుణ్యాల ఖాతాలో పాపాలు ఎక్కువగా ఉండడం కూడా కావొచ్చు.
ఏదిఏమైనా మనం నిత్యం ఆచరించాల్సిన కర్మలను త్యజించిన యెడల వాటి పర్యవసా నం మనశ్శాంతి లేమి, అనారోగ్యం, జీవిత ఒడిదుడుకులు లాంటివి తప్ప వు. కేవలం డబ్బు మాత్రమే వీటిని కొనలేవు. జీవితంలో విజయం సాధించడానికి కేవలం ధర్మశాస్త్రాలను ఆచ రించడం ఒక్కటే మార్గం. అందువల్ల వెంటనే ఓ గురువును ఆశ్రయించి నిత్యజీవితంలో ఆచ రించాల్సిన ధర్మశాస్త్రాలు నిర్వచించిన అనుష్టాలను నేర్చుకొని ఆచరించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement