విజయవాడ, (ప్రభ న్యూస్) : దుర్గాష్టమి పర్వదిన సాయంకాల వేళలో విజయవాడ ఇంద్రకీలాద్రి వేదఘోషతో మారుమోగింది. ఈ ప్రపంచాన్ని సమృద్ధంచేసే అక్షయ ధైర్యాల వేదఘోష వంద మందికి పైగా వేదపండితుల ఉదాత్త అనుదాత్త స్వరాలతో అమ్మవారికి నీరాజనంగా సమర్పించటం వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది.
ఈ అద్భుత వైదిక కార్యానికి భారతదేశ నలుమూలల నుంచి హాజరైన పండితులకు ఆలయ సిబ్బంది, ఆలయ ఉత్సవ కమిటీ వేదపండితులకు నగదు సత్కారంతో పాటు ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప లావణ్యాల పవిత్ర దేవీం స్మరామి గ్రంథాన్ని వందకు పైగా హాజరైన ఘనాపాఠీలకు, వేద పండిత బృందాలకు బహూకరించడం అందరినీ తన్మయింప చేసింది. వేద పఠనం సమయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ జే.సత్యనారాయణ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్.రామారావు తదితరులు హాజరయ్యారు.
వేద ప్రామాణ్యంతో, శృతిగౌరవంగా.. పరమాద్భుతమైన కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, లలిత పరాభట్టారికాదేవి అంశాలతో అనేక శాక్తేయ స్తోత్ర మంత్ర నిధులతో భక్తకోటికి పరమ సంతోషాన్ని కలిగించేలా పురాణపండ శ్రీనివాస్ రమణీయంగా, ఒక మహా సౌందర్యంగా ఈ దేవీం స్మరామి గ్రంథాన్ని అందించడం, ఈ అపురూప మంత్ర పేటికను మాకు అమ్మ దుర్గమ్మ అనుగ్రహంగా దేవస్థానంలో ఈ వేదఘోషలమధ్య మంత్ర ప్రసాదంగా ఆనం రామనారాయణరెడ్డి ప్రోత్సాహంతో ఈవొ రామారావు బహూకరింపచేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వేదపండిత బృందం ప్రశంసించారు.
తెలుగు రాష్ట్రాల్ర చరిత్రలో ఇంతటి అపూర్వగ్రంథాన్ని ఇంత మందికి అందజేయడంలో కీలకపాత్ర వహించిన శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థాన అధికార, ఉత్సవకమిటీని భక్త సమాజం వేనోళ్ళ ప్రశంసిస్తోంది. తెలుగు రాష్ట్రాల్ల్రో అనేక ఆలయాలు, మఠాల్లో, పీఠాల్లో మాత్రమే కాకుండా తిరుమల బ్రహ్మోత్సవాల్లో సైతం అద్భుతమైన వైష్ణవ సమ్మోహనంగా హరే హరే గ్రంథాన్ని రచించి అందించిన పురాణపండను రసజ్ఞ సమాజం మనోజ్ఞంగా ఈ శ్రీకార్యాల నిస్వార్ధ సేవను దైవబలంగా అభినందిస్తోంది.