”వాల్మీకి గిరి సంభూతా, రామ సాగర గామినీ
పునాతి భువనం పుణ్యా, రామాయణ మహానదీ”
వాల్మీకి అనెడి పర్వతము నుండి జన్మించి, శ్రీరాముడనెడి సాగరము వైపు ప్రయాణిస్తూ రామాయణమనెడి మహానది లోకాలను పావ నము చేస్తూన్నది. ఇది శ్రీమద్రామయణ విశిష్టతను చాటి చెబుతున్న సుప్రసిద్ధ శ్లోకము. రామాయణ కావ్యాన్ని ఒక పవిత్రమైన నదిగా పై శ్లోకం అభివర్ణిస్తోంది. నదు లు సాధారణంగా పర్వతాలలో ప్రభవిస్తాయి. సముద్రంలో కలుస్తాయి. తమలో స్నానం చేసేవారి శారీరక మలినాలను పరిశుభ్రం చేస్తాయి. ఆ నదుల లక్షణాలను రామాయణానికి ఆపాదించాడు కవి ఈ శ్లోకంలో. రామాయణం అనే నది వాల్మీకి అనే గిరి నుండి పుట్టి శ్రీరాముడు అనే సముద్రం లో కలుస్తుంది. ఇలా రామాయణం అనే ఉపమే యం (పోల్చబడిన వస్తువు)- నది అనే ఉపమా నము (పోలిక)లకు; అలాగే వాల్మీకి అనే ఉపమే యము- గిరి అనే ఉపమానాలకు అభేదం చెప్ప డాన్ని అలంకారికులు రూపకాలంకారము అం టారు. దీనిని ఆంగ్లంలో ‘అలగొరి’ (ఆ|గు సా) అంటారు. చెప్పదలచుకొన్న భావాలను, ఆలోచనల ను, మరొక రూపంలో పాఠకుల దృష్టికి తీసుక రావడం అన్నమాట! ఆధ్యాత్మిక రామాయణంలోని ఒక మహత్తర సన్నివేశాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకొందాము.
విశ్వామిత్ర మహర్షి తాను చేస్తున్న యజ్ఞాని కి మారీచ సుబాహులు అనే రాక్షసులు పదేపదే విఘ్నం కలిగిస్తుండటంతో, వారిని శిక్షించి తన యజ్ఞాన్ని రక్షించగల సమర్థులైన రామలక్ష్మణు లను తనతోబాటు తన ఆశ్రమానికి తీసుకువెడుతున్న సందర్భమిది. మార్గ మధ్యంలో వారికి విశ్వామిత్రుడు బల, అతిబల వంటి అనేక శస్త్రాస్త్రవిద్యల ను బోధించి ఆ రాక్షసులను ఎదుర్కోగలిగిన శక్తివంతులుగా చేశాడు. తీరా వాళ్ళు ఆశ్రమ సమీపంలోకి వచ్చే సరికి వారికి మారీచుని తల్లి తాటక ఎదురు పడింది. ముగ్ధ మనోహరాకారులైన రామలక్ష్మణులను చూచి ఆమె ”బాల కులారా, మీరెవరు? ఎక్కడికి, ఎందుకోసం వెళుతున్నారు? మిమ్మల్ని తీసు కువెళుతున్న ఈ మహర్షి ఎవరు?” అని ప్రశ్నించింది. ”అయోధ్యా పాలకుడై న దశరథ మహారాజు కుమారులము మేము. నా పేరు శ్రీరాముడు. ఇతను నా సోదరుడైన లక్ష్మణుడు. వారు మా గురువు విశ్వామిత్రుల వారు. వారి యాగ సంరక్షణ కోసం వెళుతున్నాము” అని శ్రీరాముడు బదులిచ్చాడు. తాటక పకపకమని నవ్వి ”తన యజ్ఞాన్ని తాను కాపాడుకోలేని ఈ అసమర్థు డు మీకు గురువా? బలేగా ఉందే!” అని వికటంగా ఆక్షేపించింది. ”ఈ మహ నీయుని వద్ద ఉన్నది ఆధ్యాత్మిక శక్తి. రాక్షస సంహారం కోసం దానిని విని యోగిస్తే పిచ్చుకపై బ్రహ్మాస్త్ర ప్రయోగంలాగా ఆ దివ్యశక్తిని దుర్వినియోగం చేసినట్లు అవుతుంది. ఈ అల్ప రాక్షస సంహారానికి మావద్ద ఉన్న క్షాత్రశక్తి చాలు” అని శ్రీరాముడు సమాధానం చెప్పాడు. అప్పుడు తాటక ”ఓ రామా! నీకు అసలు విషయం చెబుతాను విను. మారీచ సుబాహువులను ఎవరను కున్నావు? వారు కామ క్రోధాది అరిషడ్వర్గ సమూహం. వారి తల్లిని నేను. నేనెవరో తెలుసా? తాటక ను. తాటక అంటే భ్రాంతి. అసలు భ్రాంతి తొలగ నిదే అరిషడ్వర్గాలు నశింపవు. వాటిని నశింపచేయాలంటే మొదట భ్రాంతి ని, అంటే నన్ను మీరు నిర్మూ లించాలి. అప్పుడు మారీచ సుబాహువు లు అనే అరిషడ్వర్గాలు సులభంగా అరికట్టబడతాయి. ఇదీ అసలు ర#హస్యం” అని చెప్పింది. పురుషోత్తముడు, ఆత్మస్వరూపుడు అయిన శ్రీరాముడు వెంటనే తాటకను (భ్రాంతిని) నిశ్శేషంగా నిర్మూలిస్తాడు. ఈ సన్నివేశంలో ఎంతో గొప్పగా ఆధ్యాత్మిక విశేషాలు ‘రూపించ’బడినాయి. జ్ఞానమనే అగ్నిలో అజ్ఞా నమనే సీతను పరీక్షకు గురిచేస్తే పుటం పెట్టిన బంగారంలాగా జ్ఞానస్వరూ పిణి సీతాదేవి శోభించడం కూడా ఇలాంటిదే.
ఆంగ్ల సా#హత్యంలో ఎడ్మండ్ స్పెన్జర్ అనే బ్రిటీష్ దేశకవి వ్రాసిన ”ఫెయిరీ క్వీన్” అనే పద్య కావ్యం ఆసాంతం ‘అలగొరి’ ప్రక్రియకు గొప్ప ఉదా#హరణగా నిలుస్తుంది. క్రీ.శ.16వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో రాజుకు, రోమన్ క్యాథలిక్ చర్చ్‌కు మధ్య సయోధ్య కొరవడింది. పరిపాలనాధికారి రాజే/రాణే అయినా ప్రజల మత విశ్వాసాలను శాసించేది చర్చ్ ఉన్నతాధి కారి (పోప్). రాజు స్వతంత్రించి పాలనా నిర్ణయాలు తీసుకోరాదని, చర్చ్ నిర్ణ యాన్నే శిరసావహించాలని, రాజు కంటే మతాధికా రి అధికారమే గొప్పదని భావింపబడే రోజులు అవి. రాచరికానికి, మతాధిపత్యానికి మధ్య సయోధ్య సా ధించి, రాజు, మతాధికారులు పరస్పర సహకారాల తో సమాజ క్షేమం కోసం పనిచేస్తూ, ప్రజలను సన్మా ర్గంలో నడపాలని ఈ కావ్యం ఉద్దేశం. ఇందులో కథానాయకుడు ‘రెడ్‌క్రాస్ నైట్ (యోధుడు)’. ఇత డు పవిత్రతకు, దైవభక్తికి ప్రతీక. కథానాయిక ‘అన’. ఈమె సత్యజ్ఞానాలకు ప్రతీక. పవిత్రతకు సత్యం తోడుగా ఉన్నంతవరకు జీవనం సాఫీగా సాగుతుం ది. అవి విడిపోతే అనేక సమస్యలు, సందేహాలు, కష్టా లు చుట్టుముడతాయి. నాయికానాయకులను విడ గొట్టడానికి ‘తప్పు’ లేదా ‘పొర బాటు’ అనే రాక్షసు డు, సాన్స్‌ఫాయ్ (అవిశ్వాసం), ‘డ్యూయెస్సా’ (భ్రమ), ‘అబెసా'(మూఢనమ్మకం), ‘సాన్స్ జాయ్’ (నిస్సంతోషి), ‘సాన్స్‌లాయ్’ (చట్టవ్యతిరేకి), ‘#హ పోక్రసి’ (వంచన), ‘అర్ గాగ్లియోస (అహంకారం), టిరాని (నిరంకుశత్వం), మొదలైన దుష్ట పాత్రలు ప్రయత్నిస్తాయి. కానీ, ‘రీజన్'(కారణము/సహతుకత), ‘కోర్సికా'(ఆరాధన), ప్రిన్స్ ఆర్థర్ (గాంభీ ర్యం) మొదలైన మంచి పాత్రల సహాయంతో కథానాయకుడు తిరిగి కథా నాయికను కలుసుకొని ‘ఫెయిరీ క్వీన్’ (దేవరాణి) అయిన ఎలిజబెత్ రాణి కొలువుకు చేరుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. అంటే భ్రమలకు లోనై కష్టాలను అనుభవించి, తుదకు దైవమనే ఎరుకను పొంది, ప్రశాంతం గా జీవించడం ప్రజల కర్తవ్యమనే సందేశం ఈ కావ్యం ఇస్తుంది.
నంది తిమ్మన కవి వ్రాసిన ”పారిజాతాపహరణం” కావ్యం కూడా శ్రీకృ ష్ణ దేవరాయల వారికీ, వారి పట్టపురాణి తిరుమల దేవికీ మధ్య చోటుచేసు కొన్న చిన్న గొడవను రూపుమాపడం కోసం రాయలను శ్రీకృష్ణునిగా, తిరు మలదేవిని సత్యభామగా రూపించి రచింపబడిన గ్రంథం అంటారు. ప్రణ య కలహాన్ని పరమాత్ముడే సహించినప్పుడు, సామాన్యులు స#హంచక పోవడం సరికాదనే పరోక్ష సందేశం ఇచ్చి ఈ కావ్యం ఆలు మగలను తిరిగి కలిపిందని అంటారు. ఇలా ఎన్నో మహాకావ్యాలు సద్య: పరనిర్వతిని కలిగించే గొప్ప సాధనాలుగా కవుల చేతులలో రూపుదిద్దుకొన్నాయి.
”కావ్యంయశసే, అర్థకతే,వ్యవహార విదే, శివేతరక్షతయే/ సద్య: పర నిర్వతయే, కాంతాసమ్మిత తయోపదేశ యుజే”. కావ్యం కీర్తి కొరకు, ధనం లేదా అర్థంకొరకు, ప్రవర్తనా విధిని తెలుసుకోడానికి, చెడును తొలగించు కోడానికి, ఆనందలోకాన్ని చేర్చడానికి, స్త్రీల మాటల్లా ఆసక్తిని కలిగించడాని కి, ఆధ్యాత్మిక ధర్మాలను బోధించడానికి-ప్రియురాలి మాటల్లాగా సున్ని తంగా మనసుకు నచ్చేలాగా చేయడంలో ఎన్నో పురాణాలు, ప్రబంధాలు, కావ్యాలు- అన్ని భాషలలోను కృతకృత్యమైనాయని చెప్ప వచ్చును.
- డా.గొల్లాపిన్ని సీ తారామశాస్త్రి 9440781236