పరమాత్మ అవతారాలలో ప్రధానమైనది కూర్మావతారము. దేవత లు రాక్షసులు మమ్ములను చంపుతున్నారు. చావు లేకుండా చూడు అన్నారు. స్వామి నవ్వుకున్నారు. చావు లేకపోవటమే అసలైన బాధ. శరీరముంటే కదా బాధలు, ఆనందాలు. అసలు శరీరమే లేకుంటే బాధలెక్కడివి? చావు లేకుంటే రాక్షసులు కొడుతున్న దెబ్బలను మౌ నంగా భరించాలి. అంటే దేవతలు బాధలనే కోరుతున్నారు. అందుకే స్వామి నవ్వి శరీరంతోపాటు రాజ్యము, చావు లేకుండా భోగాలు, ఐశ్వర్యాల, లక్ష్మీదేవి కటాక్షం కలిగేలా క్షీరసాగర మధనం చేయించాడు. క్షీరసాగరమధనం లక్ష్మి కోసమే స్వామి చేయించాడు. అమృతం తరువాతి ప్రయోజనం అని ప్రసిద్ధిలో ఉం ది. అది పూర్తిగా అసంగతమేమీ కాదు. కాని లక్ష్మి తన కోసం కాదు. లక్ష్మీ స్వయం వరం జరిగినా, లక్ష్మి ఆవిర్భవించినా లక్ష్మీ కటాక్షం మూడు లోకాలపై పడటానికే అ లా చేశాడు. దుర్వాస శాపం వల్ల మూడు లోకాలపై ఆమె కటాక్షం ఉండదు. అంతే కాని లక్ష్మి పూర్తిగా అదృశ్యం కమ్మని కా దు. నారాయణునికి కూడా లక్ష్మి అదృశ్యం కాదు. లక్ష్మీదేవికి అనేక పురాణాలలో ‘నిత్యానపాయినీ’ అని పేరు. అనగా శ్రీమన్నారాయణుని ఎపుడూ అనగా ఒక క్షణం కూడా విడిచి ఉండదు. స్వామి వక్షస్థలంలో మూడు లోకాలకు కనపడకుండా అదృశ్యురాలిగా ఉంది. లక్ష్మీకటాక్షాన్ని కోల్పోయిన దేవతలు రాజ్య భ్రష్టులయ్యారు. రాక్షసులతో పరాజయం పాలయ్యారు. మరణం లేకుండా ఉండాలని స్వామిని ప్రార్థించారు. కాని అడిగినదే ఇస్తే స్వా మి ఉదారుడు ఎలా అవుతాడు? రాజ్యం లేక, సంపద లేక ఒక ఆయు ష్యం మాత్రమే ఇస్తే దుర్భర దారిద్య్రంతో దీర్ఘాయుష్యం ఎంత అనర్థ మో స్వామికి తెలుసు కదా! అందుకే వారిపై దూర్వాస శాపం వలన కోల్పోయిన లక్ష్మీకటాక్షం పడటానికి లక్ష్మి దృశ్యం కావటానికి క్షీర సాగర మధనం చేయించాడు. నిస్వార్థంగా చేసి కూడా తన కోసమే తన భార్య తనకు దక్కటానికే క్షీరసాగరమధనం చేయించాడని ప్రచారం చేసి మూడు లోకా లకు లక్ష్మీకటాక్షాన్ని కలిగించా డు. అందరికీ కనప డేలా తన వక్ష స్థలంలో చూపాడు. తా ను స్వార్థ పరుడను అనిపించుకుంటూ మూడు లోకాలకు, ముక్కోటి దేవతల కు కష్టాలు తొలగించి, రాజ్యము, అమృతం ప్రసాదించాడు. ఇంతక న్నా ఔదార్యం ఎక్కడ ఉంటుంది. వారికోసం స్వామి ఎంత శ్రమప డ్డాడు. మందర పర్వతం దేవతలు, రాక్షసులు కలిపి లేపలేకపోతే గరుడునితో మోయించి సముద్రంలో పడవేయించాడు. శంకరునికి చెప్పి వాసుకిని ఇచ్చాడు. పర్వతం మునుగుతుంటే కూర్మమై ఆ పర్వ తాన్ని వీపు మీద ధరించాడు. పర్వతం ఒరుగుతుంటే పైన కూర్చొని ఒరగకుండా ఆపాడు. దేవతలు ప్రార్థిస్తే దేవతల లో తాను చేరాడు. రాక్షసులు అశక్తులైతే వారిలో నూ తాను చేరాడు. పర్వతంతో రాపిడికి తట్టు కోలేకుంటే వాసుకిలో తాను అయ్యాడు. ప ర్వతం తట్టుకోకుంటే పర్వతంలో తాన యా డు. ఇలా అన్ని రూపాలు తానై మధ న భారమంతా మోశాడు. విషమొస్తే తా ను త్రాగలేడా? అన్నీ తానైెతే ఎలా శంక రునికి భాగం ఈయాలి కదా! అగ్రపూజ అని పేరుపెట్టి సముద్రంలో మొదటి పం ట అనగా మొదట పుట్టినదానిని ఆయన కు అర్పించి తన ఔదార్యాన్ని చాటుకున్నా డు. ఇలా కూర్మావతారమంతా ఔదార్యానికి పరాకాష్ఠ. అంతేకాదు… తానే ధన్వంతరిగా అవతరించి అమృత భాండాన్ని తీసుకొనివచ్చా డు. రాక్షసులు అప#హరిస్తుంటే వారు కూడా కష్టపడ్డారు కదా! వారికీ ఫలితం అందినదన్న తృప్తి కలిగించాలని ఊరుకు న్నాడు. ఇదీ ఔదార్యమే. మో#హనీరూపంలో రాక్ష సుల మనస్సును రంజింపచేసి అమృతం తీసుకొని దేవతలకిచ్చాడు. ఇదంతా ఔదార్యం కాదా! అమృ తం అడిగితే స్వర్గరాజ్యాన్నీ ఇచ్చిన స్వామి ఔదార్యం ఏ శ్రుతులు వర్ణించ గలవు? అందుకే శ్రుతి ‘యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా స#హ’ అంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement