Saturday, November 23, 2024

దర్శన టికెట్ల కోటా పెంపు

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా వెంకన్న దర్శ నం కోసం వేచివున్న భక్తులకు టీటీడీ శుభవార్త ప్రకటించింది. బుధవారం నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో నిత్యం 10 వేలు ఉన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 25 వేలకు పెంచింది. సర్వ దర్శనం టోకెన్లను 15 వేల నుంచి 20 వేలు చేసింది. బుధవారం నుం చి అదనపు కోటాను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.
దాదాపు రెండేళ్ల తర్వాత
23 నెలల తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్యను పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ తగ్గుముఖం పడుతుండడంతో పాటు కేంద్రం ఆంక్షలను సడలిస్తుండడంతో శ్రీవారి దర్శనాల పై టీటీడీ విధించిన ఆంక్షలను దశలవారీగా సడలిస్తోంది. కొవి డ్‌ ఆంక్షల దృష్ట్యా రెండేళ్లుగా టీటీడీ ముందుగానే భక్తులకు దర్శన టికెట్లను జారీ చేస్తూ కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించింది. గతం లోలా భక్తులను తిరుమలకు అనుమతించ కుండా కేవలం దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తుండడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. ప్రతినెలా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వదర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుండగా నిమిషాల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేస్తుండడం చూస్తే ఏ మేరకు డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉన్నప్పటికీ కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం 23 నెలలుగా టీటీడీ శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తూ వచ్చింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గి దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో క్రమక్రమంగా స్వామివారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇప్పటికే నిత్యం 12 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయగా ఈ నెల 24 వ తేదీ నుంచి 28 వరకు నిత్యం 13 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల అదనపు కోటాను బుధవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇప్పటికే 15 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25 వ తేదీ వరకు టిటిడి జారీ చేసి ఉండడంతో 26 నుంచి నిత్యం 20 వేల టోకెన్లను టిటిడి భక్తులకు జారీ చేసింది. ఇక మార్చి నెలకు సంబంధించి కూడా శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచి విడదల చేసింది.
ఆఫ్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లు
ఇక సర్వదర్శనం టోకెన్లకు సంబంధించి నిత్యం 20 వేల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది . ఈ టోకెన్లను మా త్రం ఆఫ్‌లైన్‌లో ఇప్పటికే తిరుపతిలో ఉన్న శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌, గోవిందరాజస్వామి సత్రాల వద్ద భక్తుల కు జారీ చేస్తున్నారు. ఇక వర్చువల్‌ అర్జిత సేవలకు సంబం ధించి నిత్యం 5,500 టికెట్లను టీటీడీ ఇప్పటికే భక్తులకు జారీ చేయగా వీఐపీ బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, సుపథం ప్రవేశ మార్గం టికెట్లను సిఫారసులపై జారీ చేయనుంది. దీంతో మార్చి నుంచి ప్రతినిత్యం 55 వేల నుంచి 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కనపడుతోంది. కొన్ని నెలలుగా శ్రీవారి దర్శన టికె ట్లు దొరక్క స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు టీటీడీ తీసుకున్న తాజా నిర్ణ యంతో ఉపశమనం కలిగింది. సులభంగా స్వామివారి దర్శన టికెట్లను పొంది శ్రీవా రిని ద ర్శించుకునే భాగ్యం భక్తులకు లభించనుంది. టీటీడీ దర్శన టికెట్ల కోటాను పెంచ డంతో సులభతరంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో శ్రీవారి దర్శనాల సంఖ్యను టీటీడీ మరింత పెంచనుంది. తద్వారా శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి నెలకొని ఉన్న డిమాండ్‌ తగ్గనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement