Tuesday, November 26, 2024

అవతారం అంటే…

అవతారం అనే మాటను ప్రతీరోజు ఏదో ఒక సందర్భంలో వాడుతుంటారు. అసలు అవతారం అంటే ఏమిటి? తార అంటే నక్షత్రం. అవ అంటే దిగి రావడం. జీవరాశుల అభ్యు న్నతి కోసం నిర్హేతుక కృపతో భగవంతుడు స్వీకరిం చేదే అవతారం.
విష్ణువు రామునిగా భూమిపై అవతరించా డని అంటారు. మరి రామునిగా భూమిపై ఉన్న ఆ కాలంలో వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేన ట్లా? అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమానికై భూలోకం వచ్చెనని అర్ధం.
ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షిం చటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతా లవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని #హందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధు లు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపములో అవతరించెనని క్రైస్తవులు భావిస్తారు. ఈ కల్పనలన్నింటికీ దేవుడు మాన వులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజ లు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతు డు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరిం చుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టు లచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరై న సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమి పై అవతరించి దుష్టశిక్షణ చేయటం అవతార కథల ప్రధాన ఇతివృత్తం. అవ తారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలే దు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మాన వులు కూడా అవతారమెత్తవచ్చు. విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా, విడివిడిగా ఎత్తినా తన అస్తిత్వం కోల్పోడు. తన అసలు రూపంతో వైకుంఠంలో దర్శనమిస్తూనే ఉంటాడు.
విష్ణువు నుండి ఉద్భవించిన అవతారాలు తమ అవతార పరి సమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారా యణుడిలో (విష్ణువు)లో ఐక్యమందుతాయి. ఒకసారి ఐక్య మం దినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి. అలాగే శివపార్వ తులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకం పై అవత రిస్తూ ఉంటారు. ఇక దత్తాత్రేయుల వారు నేటికి అనేక అవతరా లలో ఆయా ప్రాంతాలలో నేటికి దర్శనమిస్తారని ప్రతీతి. హనుమ, కుమారస్వామి ఇలా పలు దేవతాస్వరూపులు ఆయా రూపా లలో భూమిమీద జన్మించి మనలను ఉద్దరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement