Tuesday, September 24, 2024

వరలక్ష్మీ నవెూస్తుతే!

శ్రీ మహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు అధి దేవత లక్ష్మీదేవి పట్టుచీర… అభరణాలు ధరించి చిరునవ్వు వెూముతో అత్యంత సుందరంగా, ఆకర్షణీయంగా కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి నాలుగు చేతులతో వుంటుంది. రెండు చేతులతో తామర పుష్పాలను పట్టుకొని రెండు చేతులతో బంగారు నాణేలను కురిపిస్తూ… తామరపుష్పంపై ఆసీనురాలై భక్తులను అనుగ్రహించే చల్లని తల్లి వరలక్ష్మీ నవెూస్తుతే!

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే:
ప్రేమత్రపా ప్రణిహతాని గతాగతాని
మాలాదృశో ర్మధుకరీవ మహూత్సలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయా:||
నల్లకలువ మీద ఆడు తుమ్మెద ప్రీతితో వ్రాలినట్లు శ్రీ మహాలక్ష్మి సుందరమైన చూపులు ప్రణయంచేత తన నాథు డైన నారాయణుని చూచుటకు ముందుకు సాగుతున్నాయి. ఆయన తన్ను చూచినప్పుడు సిగ్గుతో ఆమె చూపులు వెనుకకు మరలుతున్నాయి. ఈ రీతిగా ప్రణయం చేత, ఆయన తన వైపు చూడనప్పుడు ప్రియుణ్ణి వీక్షిస్తూ, ఆయన చూపులు తన మీదికి వ్రాలినప్పుడు లజ్జతో వెనుకకు మరలుతున్న ఆ కలు ములు చెలి కంటి చూపులు నా మీద ప్రసరించి నాకు సిరిసం పదలు అనుగ్రహంచు గాక!

శ్రావణ మాసాన్ని హిందువులు పవిత్ర మాసంగా భావి స్తారు. విష్ణు భగవానుని జన్మతిథి శ్రవణా నక్షత్రమని అంటా రు. ఈ మాసంలోనే శివకేశవుల ఆరాధన జరుగుతుంది. ఇం కా శ్రావణ మాసం విశేషమేమిటంటే ఈ మాసంలోనే హిం దూ మహిళలు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం ఈ నెలలోనే.
ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలన్నీ లక్ష్మీ ఆరాధ నకు అత్యంత శ్రేష్ఠం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్ర వారం శ్రీ మహాలక్ష్మిని వరాలిచ్చే వరలక్ష్మీదేవిగా పూజించడం మన సంప్రదాయం. లక్ష్మీదేవి అనుగ్రహానికి, కుటుంబ సౌ ఖ్యానికి మహిళలు అష్టైశ్వర ప్రదాయిని, అష్ట సంపదల్ని ప్రసాదించే మంగళ ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని వరలక్ష్మీ దేవిగా ఆరాధిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకో వడం ప్రత్యేకత. స్కాంద పురాణంలో పరమేశ్వరుడిని జగ న్మాత పార్వతీదేవి, మహిళలు జరుపుకునే వ్రతమేదైనా ఉం టే చెప్పవల్సిందిగా వేడుకుంటుందని ప్రవచనకారులు చెబు తారు. అందుకు ఆ దేవదేవుడు, ”ప్రియసఖి, నేను చెప్పే కథ ను శ్రద్ధగా విను” అంటూ వ్రత మహత్మ్యాన్ని తెలిపే కథ ఈవి ధంగా చెప్పాడట.
పూర్వం మగధ రాజ్యంలో కుండిన నగరం అనే సుంద ర పట్టణంలో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది. ఆమె సద్గు ణ సంపన్నురాలు. ఆమె సద్గుణాలకు సంతసించిన ఆదిలక్ష్మి ఆమె కలలో ప్రత్యక్షమై ”చారుమతి, నీ గుణసంపదలు, నీ ప్రాతివత్య ధర్మాచరణ నన్ను ఎంతగానో సంతసింపజేసా యి. నువ్వు కోరే వరాలు నీకు ప్రసాదించ దలిచాను. అందు కు నీవు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని నిష్ఠగా ఇ తర మహిళలతో పాటు చేసిన చో, అనేక సంపదలు, వంశాభివృద్ధి జరు గునట్లు వరాలు ఇచ్చెదను” అని
చెప్పి మాయమవుతుంది. తన స్వప్న వృత్తాం తాన్ని భర్తకు వినిపిస్తుంది. ఆయన ఎంతగానో సంతోషించి ఆ రోజుకు కావలసిన పూజా సా మాగ్రి, ఇతర ఏర్పాట్లు చేస్తాడు. చారుమతితో పాటు ఆ పట్టణ మహిళలు కూడా ఆ నిర్ణీత దినంనాడు ఆవు పేడతో అలికి, బియ్యంతో మంటపం యేర్పరచి మర్రి చిగు ళ్ళు మొదలగు వాటిని వేసి కలశం ఏర్పరచి వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఆ తరువాత మహిళలందరు ప్రదక్షిణం చేయుచుం డగా ఘల్లుఘల్లుమని ధ్వని వినిపించుటచే వారందరు కిందికి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మొదలగు ఆభరణ ములు కనిపించాయి. రెండోసారి ప్రదక్షిణ చేయగా వారి చేతు లకు నవరత్నాలతో కూడిన కంకణాలు కనిపించాయి. మూడ వ ప్రదక్షిణతో వారి ఇండ్లలో సకల సంపదలు రాసులుగా పడి ఉన్నాయని వారివారి కుటుంబ సభ్యులు వచ్చి చెబుతారు. వ్రతాన్ని ఆచరించిన మహిళలందరు చారుమతిని పొగడ్తల తో ముంచెత్తుతారు. అప్పటి నుండి వరలక్ష్మీ వ్రతం మొదల వుతుందని శంకరుడు చెబుతుండగా పార్వతీదేవి సంభ్రమా శ్చర్యాలకు గురవుతుంది.
ఈ వరలక్ష్మి వ్రతంలో ఇంకో విషయం అంతర్గతంగా ఉన్నదని చెబుతూ దానికి సంబంధించిన అంశాన్ని ఈ విధం గా ప్రస్తావిస్తారు.
పూర్వం ఒక రాజ్యంలోని రాజుకు ఇద్దరు భార్యలు. ఇద్ద

రు కూడా పు ణ్యాత్మురాండ్లు, పతివ్రతలు. పతియే దైవంగా భావించేవారు. వారు వర లక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం జరుపుకుం టారు. వయస్సు మీరిన తర్వాత ఇద్దరు మరణిస్తారు. ఆ ఇద్ద రిలో పెద్ద భార్యకు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. అది గమనించిన చిన్న భార్య యమధర్మరాజుతో ”అదేంటి మా అక్కను స్వర్గా నికి పంపించారు. నన్ను ఈ నరకానికి తెచ్చారేమిటి” అని అడుగుతుంది. అందుకు యమధర్మరాజు ”మీ అక్క వరల క్ష్మీ వ్రతం చేయడానికి ముందు భర్త కాళ్ళకు దండం పెట్టి వ్ర తం ఆచరించడానికి అనుమతి ఇవ్వండి” అని తలపై అక్షం తలు వేయించుకుంటుంది. కాని నువ్వు, వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్ని ఆయనే చేయించాడు కాబట్టి నేనెందుకు తిరిగి ఆయన్ని అనుమతి కోరాలనుకొని నేరుగా వరలక్ష్మీ వ్రతం ఆరంభిస్తావు. అన్నీ భర్తకు తెలిసినా చివరకు ఆయన అనుమ తి కోరడం అనేది భార్య ప్రాతివత్య ధర్మం. ఈ ఆలోచన నీలో లోపించడం వల్ల నువ్వు నరకానికి, ఆమెను స్వర్గానికి తీసుకె ళ్ళడం జరిగింది అని సమాధానమిస్తాడు.
కేవలం పతిని దైవంగా భావించడం కాదు, పత్ని ఏ పని చేసినా ముందుగా ఆయన అంగీకారాన్ని తీసుకోవడం ము ఖ్యం అనే భావన వరలక్ష్మీ వ్రతంలో దాగిఉన్న ధర్మం అంటా రు. అప్పుడే వరలక్ష్మి వ్రత ఫలితం మహిళలకు లభిస్తుందం టారు దైవసంబంధిత ప్రవచనకారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement