Tuesday, November 26, 2024

బాధ్యతల పూర్తే… ఆధ్యాత్మికోన్నతి!

”ఎదురీత మానవద్దు! పట్టు విడవవద్దు!! గుండె నిబ్బరం కోల్పోవద్దు!!! అవతలి ఒడ్డుకు చేరి విజయాన్ని సాధించు” అని చెప్పిన ఋషుల సందేశాన్ని ఒక వృద్ధమాత అక్షరాల పాటిస్తూ సంపూర్ణ జీవితాన్ని గడిపినా మమతానుబంధా ల్లో పడిపోని ఆమె కథను రామకృష్ణ పరమహంస తన శిష్యు లకు చెప్పి మనం మన బాధ్యతలను తు.చ తప్పకుండా పా టిస్తూ ఉంటే చాలు! అదే గొప్పనైన ఆధ్యాత్మికత అంటూ చెబుతూ అంటారు-
”మనం ఎక్కడెక్కడికో వెళ్ళి భగవంతున్ని దర్శించు కోవాలని తాపత్రయ పడతాం. ఆ వృద్ధ మాత నిత్యం తన ఇంట్లోనే ఉంటూ తను చేయవలసిన పనులపై శ్రద్ధ వహి స్తుండేది. ఆ వృద్ధమాత నిరక్షరాస్యురాలు కాని, ఆమె చిన్న నాడు ఎందరెందరో తన ఊరి వాళ్ళు వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో ఒంటరిగా వదిలి భార్యాభర్తలు తమ పిల్లలతో తీర్థ యాత్రలకు బయలుదేరి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు ఇంటి, వంటపనులు చేయడానికి అష్టకష్టాలు పడుతూండడం కం డ్లారా చూసింది. ఎన్నోసార్లు తన భర్త తీర్థయాత్రలకు వెళ్ళే కోసం ఆమెను బలవంతం చేసినా ఆమాత వెళ్ళేది కాదు.
ప్రతిరోజు ఆమె ఏ పని చేసినా మొదట తన నోటికి వచ్చే భగవంతుని పేరు తల్చుకుంటూ పని ప్రారంభించేది. ప్రతి పనిని క్రమ పద్ధతిలో చేస్తూ అందులో పరిశుభ్రత పాటిస్తుం డేది. ఆమె ఎన్నడు భర్తను భౌతిక వస్తువులను తెమ్మని పక్క వాళ్ళ కంటే మెరుగైన జీవితం గడపాలనే ఆలోచన లేకుం డా ఉన్నదాంట్లో సంతృప్తికరంగా ఉండడం అలవాటు చేసు కుంది. ఎప్పుడూ ఆమె భగవంతుణ్ని ”స్వామి, నేనెప్పు డూ భౌతిక సుఖాల వైపు ఆకర్షితురాలను కాకుండా, నీ నామ స్మరణ మరిచిపోకుండా నా ఇరుగు పొరుగు వారికి ఎప్పు డూ కష్టాలు కలుగకుండా చూస్తుండు. నాకు వచ్చే కష్టాలు నీవు పెట్టే పరీక్షలుగా భావించేటట్టు చూడు తండ్రీ” అంటూ ప్రార్థిస్తుండేది.
ఆ వృద్ధమాత తన యవ్వనంలో తన భర్త పట్ల, పిల్లల పట్ల తన బాధ్యతలను మరిచిపోకుండా సహనంతో వారిని సంతోషపరిచే విధంగా చేయడం అలవాటైపోయింది.
పిల్లలు పెద్దవారయ్యారు. అందరికి పెండ్లిల్లు అయ్యా యి. కోడండ్లు వచ్చారు. ఒక కోడలు ఆమె అత్త చేసే ప్రతి పని ని విమర్శిస్తూ, ఆ ఇంటిలో ఆచరించే పద్ధతుల్లో ఇమడలేక ఎప్పుడు అత్తను, మామను, భర్తను సూటిపోటి మాటలతో భరించలేని విధంగా ఎత్తిపొడుస్తూండేది. భర్త, ఆమె కొడు కు పవిత్రమైన వాతావరణంలో జీవించే అలవాటు పడడం వల్ల ఎన్నడూ ఆ కోడలు మాటలకు స్పందించేవారు కాదు. వారికి తెలుసు మాటామాటా పెరిగితే పెద్ద అల్లరి జరుగు తుందని! అందుకే వారు కోడలు మాటలు సహించడం వా రికి అలవాటైపోయింది. ఆ ఇంటి మాత మాత్రం ”ఇది మా లలాట లిఖితం. ఇది మా ఓరిమికి ఆ జగన్నాటక సూత్రధారి
పెట్టే పరీక్ష”ని భావించడం ఆమె నిత్యకృత్యంగా మారింది.
ఆ ఇంటి వాతావరణాన్ని నిశితంగా పరిశీలించే ఆ ఊరి గ్రామ పెద్ద కుటుంబంలోని వారందరిని గౌరవంగా చూడడ మే గాక ఆ ఊర్లో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆ కుటుంబం గురించి పొగుడుతూ ఉండేవాడు.
ఒకరోజు ఆ గ్రామంలో ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఆ గ్రామ పెద్ద నాయకత్వంలో వైభవోపేతంగా జరుగుతుంది. ఆ తరువాత జరిగిన సభలో పాల్గొనడానికి ఎంతో మంది మహానుభావులు హాజరవుతారు. అందరు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన తరువాత ఆ గ్రామపెద్ద ఆద ర్శమాతగా ఆమెను పరిచయం చేసి ప్రసంగించవలసింది గా ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆ వృద్ధమాత చెప్పిన మాటల ను గొప్ప సందేశాత్మకంగా భావిస్తారు.
”నాకు భగవంతుని నుండి వచ్చిన సందేశంగా భావిం చి నన్ను నేను సరిదిద్దుకుంటుంటాను. ఒకరోజు నేను మా ఇంటి పరిస్థితులను తలచుకుంటూ భగవంతుణ్ని ప్రార్థిం చాను. అప్పుడు ఎవరో నా చెవిలో చెబుతున్నట్టు తలంచా ను.”బిడ్డా! నీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా జరిగితే నీ వు నన్ను మరిచిపోతావేమోనని నీకు పరీక్షగా కష్టాలు కలి గిస్తూ నీ ఓపిక పెంచే ప్రయత్నం చేస్తున్నాను. నీకు పరీక్షలా నీవంటే గిట్టని కోడల్ని పంపాను. నీకు వచ్చిన కోడల్ని నువ్వు నిందించకుండా విధి లిఖితంగా భావించావు. అందుకు నేను కంసాలి బంగారాన్ని కొలిమిలో కరిగించి పరిశుద్ధం చేసినట్లు నీ ఆధ్యాత్మిక శక్తిని రెండింతలు చేయ ప్రయత్నిం చాను. అందుకు నువ్వు అన్ని పరీక్షలో నెగ్గావు కాబట్టి అంద రు నిన్ను ఆదర్శ మాతగా చెప్పుకుంటారు. నువ్వు మరణా నంతరం నా లోకానికి వస్తావ్‌!” అని చెప్పినట్లు వినిపించిం ది” అంటూ ముగించింది.
ఇలా తన ప్రసంగంలో కథను వినిపించిన రామకృష్ణ పరమహంస ”అందరూ కూడా ఆ వృద్ధ మాతను అనుస రించ ప్రయత్నించండి అప్పుడు ప్రతి కుటుంబం ఆదర్శప్రా యమవుతుంది” అ ని ముగించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement