Tuesday, November 26, 2024

అహం వదిలితే

మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మన వాడు అవుతాడు. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గరకావాలి. ‘సత్య నిష్ఠే ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు అన్నారు. సత్యం అన్నది సత్తుకు సంబంధించినటువంటిది. సత్‌ పరబ్రహ్మ వస్తువు. సత్‌ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం. ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలిబాటలో మరొక గ్రామా నికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్ట మో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు కనపడ్డాయి. వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈపాటికి చచ్చిపోయేవాడిని’అనుకొని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాడు.
ఆపద నుండి బయటపడడానికి సహాయానికి ఎంత అరిచినా ఎవరూ రాలే దు. అరిచిఅరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళ నూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణ పిలుస్తాను అని అను కొని భగవంతుణ్ణి పిలిచాడు.
భగవంతుడు ‘నీవు పిలిచావు కాబట్టి వచ్చాను’ అన్నాడు.
‘అవునా! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని వేడుకున్నాడు. ‘నిన్ను కాపాడడా నికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు. ‘అడగవల సింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.
‘నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’
‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.
‘నిన్ను కాపాడడం నావల్ల సాధ్యమవుతుందని
నీవు నిజంగా నమ్ముతున్నావా?”
‘నమ్ముతున్నాను’ అన్నాడు.
‘నేను ఏది చెప్పినా చేస్తావా?”
‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.
‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడ తాను’ అన్నాడు భగవంతుడు. బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చెన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముం దు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అను కున్నాడు.
‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.
‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు. సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అ#హంకా రమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అ#హంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్ప కుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి, మనమందరం అ#హంకార శూన్యులుగా మారాలి.

  • డా. చదలవాడ హరబాబు 9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement