Tuesday, November 26, 2024

మానవత్వమే సాయితత్వం!

మహిమలతోకాదు మానవత్వంతో బతకాలన్నదే సాయితత్వం. బాబా ఎప్పు డూ తన గొప్పతనాన్ని మహిమాన్విత శక్తిని ప్రద ర్శించలేదు. భక్తుల చెవిలో మంత్రాలు ఊదలేదు. చేతులకు తాయత్తులు కట్టలేదు. చివరకు జ్యోతిష్యం, గ్రహదోషాలు వంటి వాటిని కూడా బాబా మూఢ నమ్మకాలు గానే భావించారు. తన భక్తులను వాటి జోలికి పోనివ్వలేదు. అందుకే యోగీశ్వరు ల పరంపరలో సాయిబాబా విశిష్టమైనవారు. మహిమల కంటే మానవత్వాన్ని ప్రదర్శించడం ఉత్తమమని బాబా బోధించే వారు.
బాబా భక్తజన బాంధవుడు. భక్త సులభుడు. పిలిస్తే పలికే దైవం. బాబాకు దేహాభిమానం లేదు. భక్తులను మనసారా ప్రేమించారు. గురువులు రెండు రకా లు ఒకరు నియత గురువులు. అంటే నియమింపబడినవారని అర్థం. రెండు అని యత గురువులు. సమయానుకూలంగా తమంతట తామే వచ్చి మన అంతరం గాలను శుద్ధిచేసి సద్గుణాలను పెంపొందించి మోక్షమార్గాన నడిపించేవారిని అనియత గురువులు అంటారు. సర్వవిధాలా ప్రపంచ జ్ఞానాన్ని బోధించే గురువులు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. మనల్ని ప్రపంచపు అంచులకు అతీతంగా తీసుకుపోయేవారే నిజమైన గురువులు. వారే సద్గురువులు. శ్రీ సాయి అటువంటి సద్గురువు. బాబా మహిమ వర్ణనాతీతం. చూపు మాత్రంగానే బాబా భక్తుల భూత, భవిష్యత్‌, వర్తమానాల ను గ్రహించేవారు. అవన్నీ బాబాకు కరతలామలకం. ప్రతి జీవిలోనూ బాబా దైవాన్ని చూసేవారు. శత్రువులు, స్నేహి తుల పట్ల సమభావంతోనే ఉండేవారు. నిరభిమానం, సమానత్వం, బాబాలో మూర్తీభవించి కనిపించేవి. బాబాకు కలిమిలేములు సమానం. బాబా మానవ దేహం ధరించినా ఇల్లు, వాకిలి పట్ల అభిమానం, వ్యామోహం ఉండేవి కావు. శరీర ధారిగా కనిపించే సాయిబాబా నిజానికి నిశ్శరీరులు. జీవన్ముక్తులు.
శ్రీ సాయి జీవితం అత్యంత పావనమయినది. వారి నిత్యకృత్యాలు ధన్యం. వారి పద్ధతులు, చర్యలు వర్ణింపడానికి వీలులేదు. కొన్ని సమయాలలో వారు బ్రహ్మానందంతో మైమరిచిపోయేవారు. మరికొన్ని సమయాలలో ఆత్మజ్ఞానం తో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేరుస్తూ ఎలాంటి సంబం ధంలేనట్లు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్టు కనిపించినప్ప టికీ వారు సోమరిగాగాని, నిద్రితులుగాగాని, కనిపించెడివారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు.సముద్రంలా శాంతంగా తొణకక ఉండేట్లు కనిపిం చి నా వారి గాంభీర్యం. లోతు కనుగొనలేనివి. వర్ణనాతీతమైన వారి నైజం వర్ణింప గలవారు ఎవ్వరు? పురుషులను అన్నదమ్ములవలే, స్త్రీలను అక్కచెల్లెళ్ళు గా, తల్లులుగా చూసుకునేవారు. వారి సాంగత్యంలో మనకు కలిగిన జ్ఞానం మనం మర ణించేవరకు నిలుస్తుంది. ఎల్లప్పుడు హృదయపూర్వకమైన భక్తితో సాయి పాదాలకు సేవ చేద్దాం. ఎల్లప్పుడూ సాయి నామం స్మరించుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement