Tuesday, November 19, 2024

HYD | బొల్లినేని, కొర్రపాటి గ్రంధాలకు భారీ పవిత్ర స్పందన..

హైదరాబాద్ : ‘తల పొగరుతో విర్రవీగుతూ చులకన చేసేవాణ్ణి చేస్తూనే ఉండనీ ! నువ్వు మాత్రం నీ ధర్మాన్ని నిర్వర్తించు ….. కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు ‘ …. సూటిగా స్పష్టంగా ఉన్న ఈ వాక్యాలు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఇటీవల తాను అద్భుతంగా, అపురూపంగా రచనా సంకలనాలుగా అందించిన పరమాత్మ తత్వాల పరమాద్భుత గ్రంధాలు నాలుగింటిలో కవర్ వెనుకకు ముందు పేజీలో పరమ శివభగవానుడూ కాలభైరవుడూ కలసి నడచి వస్తున్న అమోఘ చిత్రం క్రింద రచించి ప్రచురించడంతో హైదరాబాద్, ఉభయగోదావరి కృష్ణా జిల్లాలాలలో ఒక చర్చనీయాంశంగా కొందరు పండితులు, సాహిత్య వేత్తలు , అర్చకులు చర్చించుకోవడం బాహాటంగా దర్శనమిస్తోంది.

గత రెండువారాల్లో తిరుమల , ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ , నెల్లూరు వంటి అనేక ప్రాంతాల్లో కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య , వారాహి చలన చిత్రం అధినేత , ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన నాలుగైదు గ్రంధాలకు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలన కర్తగా వ్యవహరించడమే కాకుండా అనుకూలమైన మనస్స్థితి కోసం ఎదురుచూసే ఎందరికో అనన్యమైన భక్తితో కూడిన అగ్రగణ్యమైన అనేక అపూర్వ అంశాలను ఈ గ్రంథ సంపదలో శ్రీనిధులుగా తన విలక్షణ కలంనుండి వర్షించడం పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేకతగా పేర్కొంటున్నారు.

తిరుమల మహా క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించిన బొల్లినేని కృష్ణయ్య సమర్పణలోని శ్రీవైష్ణవ మహాగ్రంధం ‘ హరే హరే ‘ గ్రంధంలో పురాణపండ శ్రీనివాస్ రాజవిద్యలాంటి ఆధ్యాత్మిక విద్యల అంశాల్ని ఒక్క నృసింహావిర్భావ ఘట్టంలోనే వొళ్ళు గగుర్పొడిచేలా రచనలో ఆవిష్కరించడంతో ఈ హరే హరే గ్రంధానికి భారీ డిమాండ్ ఏర్పడటం శ్రీనివాస్ ప్రతిభగానే చెప్పాలి.

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కె .ఎస్. రామారావు ఆవిష్కరించిన ‘ దుర్గే ప్రసీద’ మంగళకర దివ్య గ్రంధంలో తపస్సంపన్నులకంటే , జ్ఞాన యోగులకంటే , కర్మయోగులకంటే ఆత్మసంయమయోగి ఉత్తముడని … అలాంటి ఉత్తములకే దుర్గమ్మ సాక్షాత్కరిస్తుందని కథలతో వివరించిన తీరు ఈ ‘ దుర్గే ప్రసీద ‘ బుక్స్ కి డిమాండ్ భారీగా పెంచిందని సాక్షాత్తూ ఆలయవర్గాలే పేర్కొంటున్నాయి.

అలాగే,… హైదరాబాద్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు కె.వి. రమణాచారి ఆవిష్కరించిన పురాణపండ మరొక అసాధారణ గ్రంధం ‘ దేవీం స్మరామి’ … రాజమహేంద్రవరంలో అనేక ఆలయాల్లో పవిత్ర సందడి చేసిన ‘ సౌభాగ్య ‘ అమ్మవార్ల స్తోత్ర సౌందర్యాల గ్రంధం , శ్రీ దేవీనవరాత్రోత్సవాల్లో విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వేల వేల భక్తులకు దేవస్థాన సిబ్బంది అందజేసిన ‘ శ్రీనిధి ‘ శ్రీమంతమైన శ్రీ దుర్గాదేవి గ్రంధం కూడా విశేషంగా ఆకట్టుకోవడం ఈరోజుల్లో ఆకర్షణీయమేమరి.

- Advertisement -

ఈ గ్రంథ సంపదలో మరీ ముఖ్యంగా ‘ హరే హరే ‘ , దుర్గే ప్రసీద ‘ గ్రంధాలలో వెనుక నిశ్చలమైన భక్తి , ఒక అనంత తేజోరాశి పాఠకులకు దర్శనమిస్తుందని పాకువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ దివ్య గ్రంధాల ముఖ పత్రాల తళ తళలు , లోపల లావణ్య భరితమైన ముద్రణ , భక్త పాఠకులచే ప్రశంసలు వర్షింపచేస్తుండటం హైదరాబాద్ త్యాగరాయగానసభ , బెజవాడ దుర్గమ్మ సన్నిధి, రాజమహేంద్రవరంలో అనేక ఆలయాల్లో చర్చలు శ్రీనివాస్ రేయింబవళ్ళ కృషిని ఆనందంగా అభినందిస్తాడటమ్ దర్శనమిస్తోంది.

పుస్తకాలకు డిమాండ్ తగ్గిన ఈ రోజుల్లో నానాటికీ పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకు విశేష స్పందన లభించడానికి తిరుమల శ్రీనివాసుని కారుణ్యమేనని , శ్రీనివాస్ నిస్వార్ధ సేవ మనకి ఎన్నో ఆలయాల్లో, కొందరు ధార్మిక వేత్తల్లో, కొందరు పీఠాధిపతుల్లో , కొందరు మఠాధిపతుల్లో కనిపించదని … ఈరోజుల్లో ఇది మామూలు విషయంకాదని … కనులముందు కనిపిస్తున్న ఈ సత్యాన్ని పరమ సత్యమే అనాలని మేధో సమాజం పేర్కొంటోంది.

చాలామందిలో మనకు కనిపించే ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, సొంత డబ్బాలు పురాణపండ శ్రీనివాస్ లో కనిపించవు కాబట్టే తెలుగు రాష్ట్రాల్లో దైవీయ గ్రంధాలతో లక్షలమంది మనస్సులోకి అమ్మవారి అనుగ్రహంతో దూసుకుపోతున్నారనేది జయ జయధ్వానంగా బిగ్గరగా చెప్పాల్సిందే.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా అంతర్జాతీయంగా పేరుపొందిన కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేనికృష్ణయ్య జీవన యాత్రలో తన సౌజన్యంతో వేలమందికి ఇంత అందంగా , ఇంత కంటెంట్ తో అందిస్తున్న బుక్స్ వలన బొల్లినేని కృష్ణయ్య చరిత్రలో మిగుల్తారని హాస్పిటల్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి .

‘ ఈగ ‘ వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో తీసి అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన వారాహి చలనచిత్రం నిర్మాత సాయి కొర్రపాటి సౌజన్యంతో అందజేసిన పవిత్ర గ్రంధాలకు కూడా సినీ పరిశ్రమలో సైతం పురాణపండ శ్రీనివాస్ రచనా విశేషాలకు ఎప్పటికప్పుడు భారీస్పందన లభించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement