మేషం: ఏ పని చేపట్టినా ముందుకు సాగది. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం: సన్నిహితులతో వైరం. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ముఖ్యమైన పనులు వాయిదా. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: శుభవార్తలు. వాహనయోగం. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు చకచకా పూర్తి. సంఘంలో ఆదరణ. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం: ఉద్యోగాన్వేషణలో విజయం. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. వాహనయోగం. చర్చలు సఫలం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న విధంగా ఉంటాయి.
మీనం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి