Tuesday, November 26, 2024

బాధల నుంచి బయటకు రావడం ఎలా

ప్రశ్న: నేను ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ఎక్కువ దూరం ముందుకు వెళుతుంటే, అంత ఎక్కువగా అయోమయానికి లోన వుతున్నాను. కానీ అదే సమయంలో ఒక రకమైన స్పష్టత వస్తున్నట్లు అనిపిస్తుంది- ఒక అయోమయ స్పష్టత. అసలు ఎటువంటి అయో మయం లేనటువంటి స్పష్టత వచ్చే సమయం ఏదైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే దాన్ని నేను ఎలా సృష్టించాలి?
సద్గురు: మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత దూరం వెళితే, అంత ఎక్కువగా అయోమయానికి లోనవుతున్నారు. అది మంచి సంకే తమే. ఎందుకంటే మూర్ఖమైన నిర్ధారణలతో జీవించడం కంటే అయోమయంలో ఉండడం ఎప్పుడూ మెరుగైన స్థితే. కానీ ఒకసారి మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టాక, ప్రతిదీ గందరగోళంగా ఉంటుంది. మీకు ఇప్పటివరకూ ఎంతో సౌ కర్యంగా ఉన్నవన్నీ ఇప్పుడు మూర్ఖంగా కనిపిస్తాయి. మీరు ఎంతో విలువైనవిగా, ఉన్నతమైనవిగా చూసినవి, ఇప్పుడు ఏమీ విలువ లేనివిగా, ప్రాముఖ్యత లేనివిగా కనిపిస్తాయి. ప్రతిదీ తలకిందులు అయిపోతుంది. ఒక అందమైన జెన్‌ నానుడి ఉంది. ”మీరు అజ్ఞానం లో ఉన్నప్పుడు, పర్వతాలు పర్వతాలే, నదులు నదులే, మేఘాలు మేఘాలే, చెట్లు చెట్లే. ఒకసారి మీరు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాక, పర్వతాలు కేవలం పర్వతాలు మాత్రమే కాదు, నదులు కేవ లం నదులు మాత్రమే కాదు, మేఘాలు కేవలం మేఘాలే కాదు, చెట్లు కేవలం చెట్లే కాదు. కానీ ఒకసారి మీరు చేరుకున్నాక, ఒకసారి మీకు జ్ఞానోదయం కలిగాక, మళ్లిd పర్వతాలు పర్వతాలే, నదులు నదులే, మేఘాలు మేఘాలే, చెట్లు చెట్లే.” అజ్ఞానం నుండి జ్ఞానోద యానికి, అది ఒక సంపూర్ణ వృత్తం, మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారో, తిరిగి మళ్లిd అదే స్థానానికి చేరుకుంటారు, కానీ ఎంతో తేడా ఉంటుంది, వర్ణించలేనటు వంటి తేడా ఉంటుంది.
ఒకసారి మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టాక, ప్రతిదీ గందరగోళంగా ఉంటుంది, ప్రతిదీ ప్రశ్నార్థకంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలీదు- మీకు ఏమీ తెలీదు. ఆధ్యాత్మికత గురించి ఏమీ తెలియక ముందు మీరు కనీసం సౌకర్యవంతంగా ఉన్నారు, మీలో మీరు తృప్తిగా ఉన్నారు. మీరు ఉదయాన్నే టిఫిన్‌ చేసి, కాఫీ తాగి, అదే అంతా అనుకున్నారు. ఇప్పుడు ఏదీ ముఖ్యం కాదు. మీకు తినబుద్ధి కాదు, నిద్రపో బుద్ధి కాదు, ఏమీ చేయ బుద్ది కాదు. ఎందుకంటే, ఇక ఏదీ నిజంగా విలువైనది కాదు అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా అది విలువైనది కాదు. కేవలం అది విలువైన దని నమ్మేలా మిమ్మల్ని మీరు వంచన చేసుకున్నారు, అంతే. దానికి నిజంగా విలువ ఉంటే అది ఎలా పోతుంది? ఏది ఏంటో మీకు నిజంగా తెలిసి ఉంటే, మీరు ఎలా అయోమయానికి లోనవుతారు? మీరు అయోమయానికి లోనవుతున్నారు అంటేనే, మీకు తెలీదు అని అర్థం. కేవలం సౌకర్యవంతంగా ఉండడం కోసం, భద్రతా భావం కోసం, మీరు తప్పుడు నిర్ధారణలు చేసుకున్నారు. మీరు కోరుకుంటున్నది కేవలం సౌకర్యమే అయితే, మీరు పరి పూర్ణంగా ఏ లోటూ లేకుండా ఉన్నారని మీ జీవితంతో అంతా సరిగ్గా ఉందని మిమ్మల్ని మీరు నమ్మబుచ్చుకుంటే సరిపోతుంది. ”నా ఇల్లు బాగుంది, నా భర్త అద్భుతమైన వాడు, నా జీవితం గొప్పగా ఉం ది, నా పిల్లలు అద్భుతంగా ఉన్నారు, ఆఖరికి నా కుక్క కూడా భలే ఉంది. ఇదే, ఇదే జీవితం అంటే.” ప్రతి రోజు మీకు మీరిది చెప్పుకుం టూ ఈ నమ్మకంతో కొనసాగాలి. అది మంచిదే, అందులో తప్పేమీ లేదు. కాకపోతే అది పరిమితమైనది, అలాగే, మీ ఉనికి ఏదైతే ఉందో, అది పరిమితమైన దేనితోనూ సంతృప్తి పడదు. మిమ్మల్ని మీరు నమ్మబుచ్చుకోవటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే, ఎక్క డో తపన ఉంటుంది. జీవితంలో మీకు తెలిసిన సంతోషాలన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. పైపైన సంతోషం ఉంది, కానీ లోపల ఎక్క డో, ప్రతిదానిలోనూ ఒక విధమైన దు:ఖం ఉంది. ఈ బాధ ఎందువ ల్లంటే, అణిచివేయబడిన ఈ ఉనికి ఎప్పుడూ కోరుకుంటూనే ఉంది. ఈ బాధ గురించి స్పృ#హలోకి రావడానికే కొన్ని జన్మలు పడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అంటే మీరు మీ దు:ఖం గురించి స్పృ#హలోకి వచ్చారు అని. ఇప్పటివరకూ మీరు తెలియ కుండానే దు:ఖపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు దాని గురించి స్పృ#హలోకి వచ్చారు. తెలియకుండా బాధపడటంకంటే తెలిసి బాధ పడటం అనేది మరింత గాఢంగా ఉంటుంది, కానీ అది మంచిదే, కనీసం మీకు ఆ విషయం తెలుస్తుంది. మీరు స్పృహలోకి రానంత వరకూ ఆ బాధ అలానే ఉంటుంది. ఒకసారి మీకు ఆ స్పృ#హ వచ్చాక, అది ఎప్పటికీ ఉండాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం, గురువుతో ఉండటం అనేది సంభావ్యత. ఆ సంభావ్యత ఒక వాస్తవికతగా అవ్వాలీ అంటే మొట్ట మొదటిగా మీరు ప్రతి దాన్నీ ఉన్నది ఉన్నట్టుగా చూసేందుకు సు ముఖంగా ఉండాలి. కనీసం మీ పరిమితులను గుర్తించేందుకు మీరు సుముఖంగా ఉండాలి. మీ పరిమితులను దాచి పెట్టాలనుకుంటే, ఇక ముక్తి అన్న ప్రశ్న ఎక్కడ ఉంటుంది? మీరు ఆ సంభావ్యతని పూర్తి గా నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మీరు కట్టివేయబడి ఉంటే, ఒకా నొక రోజున స్వేచ్ఛ రావాలి అంటే, మొట్టమొదటిగా చేయవలసింది, మీరు కట్టివేయబడి ఉన్నారు అని చూడగలగడం. అసలు మీరు కట్టి వేయబడి ఉన్నారు అని చూడటానికి నిరాకరిస్తే, ఇక స్వేచ్ఛ అన్న ప్రశ్న మీలో ఎప్పటికీ తలెత్తదు. మీరు కట్టివేయబడి ఉన్నారని తెలుసుకున్నప్పుడు, నొప్పి ఇం కా బాధ ఉంటాయి, పాత జ్ఞాపకాలు ”గతంలోనే నేను బాగున్నాను” అంటాయి. ఇదే మీ మనస్సు యొక్క విధానం. మీరు హస్కూల్‌లో ఉన్నప్పుడు మీ మనస్సు, ”ఓహ్‌ చిన్నప్పటి బడి ఎంతో బాగుంది.” అని చెప్పింది. మీరు బాగా చిన్నప్పుడు బడికి ఎలా వెళ్లారో మీకు తెలుసు. మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు, ”ఓహ్‌, నా స్కూల్‌ రోజులు ఎంతో బాగుండేవి” అనుకుంటారు. కానీ మనకు తెలుసు, మీరు #హస్కూల్‌కి ఏవిధంగా వెళ్లారో. మీ విద్య పూర్తయ్యాక మీరు, ”యూనివర్సిటీ రోజులు అత్యంత ఆనందకరమైన రోజులు” అను కుంటారు. మీరు ఆ ఎస్సైన్మెంట్‌లు రాయడానికి ఎంత ఇబ్బందిపడ్డా రో, క్లాసులూ ఇంకా ప్రొఫెసర్లతో ఎంత ఇబ్బందిపడ్డారో మనకు తెలుసు; కానీ ఇప్పుడు అది అయిపో యాక, అది ఎంతో అద్భుతంగా ఉంది అంటారు. మన ఉనికి ప్రక్రియలో భాగంగా, ఆహ్లాదకరం కాని విష యాలను చెరిపేసి, గతాన్ని ప్రస్తు తం ఉన్న దానికన్నా ఆహ్లాదంగా చూ పించే విధానం జ్ఞాపకానికి ఉంటుంది. ఇది మనుగడ కోసం ఒక ట్రిక్కు. లేదంటే మానసికంగా మీరు ముక్కలైపోతారు. మీకు ఎప్పుడూ కూడా వెనక్కి చూసి, ”ఓ, అది అద్భుతమైనది” అని అనేందుకు ఏదో ఒక ఆసరా కావాలి.
అయోమయంతో కూడిన స్పష్టత ఉంది. అది మంచిదేనా? అయోమయంలో ఉన్నారు అయినా స్పష్టతతో ఉన్నారు. ఒక రోజు ఒక రైతు, పశువులతో నిండిన ఒక ట్రక్కులో వేలం పాటకు వెళుతూ #హవే మీద ఉన్నాడు. ఎవరో లిప్ట్‌n అడిగితే అతనికి లిప్ట్‌n ఇచ్చాడు. పట్ట ణానికి వెళ్లే మార్గంలో ఈ రైతు కొంచెం నాటుసారా తాగి అదుపు తప్పి, ట్రక్కుని ఒక పెద్ద గోతిలో పడేస్తాడు. లిప్ట్‌n అడిగిన అతను వెళ్లి ఆ గోతిలో పడిపోతాడు. విరిగిన పక్కటె ముకలతో, ఇరిగిన కాళ్ళూ చేతులతో, అతను బాగా గాయపడతాడు. ఆ పెంపుడు జంతువులు పూర్తిగా గాయపడతాయి. ఈ రైతు ఒక్కడే చిన్నపాటి గీరుకుపోవ డంతో బయటపడతాడు. అతను ట్రక్కు దిగి, జంతువులను పరిశీలి స్తాడు. కోళ్ళు కాళ్ళు, రెక్కలు విర గడంతో, అసలు కదలలేకపోతు న్నాయి. ”ఈ కోళ్ళతో ఉపయోగం లేదు. వీటిని ఎవరూ కొనరు” అంటూ ట్రక్కులో నుంచి తన తుపాకీ తీసుకుని వాటిని కాల్చేస్తాడు. తర్వాత అతను పందులన్నీ గాయపడి రక్తం కారుతూ ఉండటం చూస్తాడు. ”ఈ పందులు కూడా ఎందుకూ పనికిరావు!” కాబట్టి వా టిని కాల్చేస్తాడు. ఆ రైతు గొర్రెలు కూడా, కోళ్ళు, పందులలానే ఉం డటాన్ని చూసి ”పనికిరాని గొర్రెలు!” అని అంటూ వాటిని కాల్చే స్తాడు. గాయపడి ఉన్న లిప్ట్‌n అడిగిన వ్యక్తి, ఈ మారణ హోమాన్ని ఎంతో భయంతో చూస్తాడు. ఆ రైతు అప్పుడు గొయ్యి వైపుకి తిరిగి లోపలకు చూసి, ”మీరు అక్కడ బాగానే ఉన్నారా?” అని అరు స్తాడు. వెంటనే లిప్ట్‌ అడిగిన వ్యక్తి త్వరత్వర గా పైకి పాకు తూ, ”ఆ ఇంత బాగా జీవి తంలో నేనెప్పుడూలేను” అన్నాడు.
దాని అర్థం ఏంటంటే, మేము మిమ్మ ల్ని నరకంలోకి పడేసినా సరే, మీరు స్పష్టం గానే ఉంటారు. నాకు జనాన్ని స్వర్గానికి పం పించడం పైన ఆసక్తి లేదు. నా ఆసక్తి ఏంటం టే జనాన్ని ఏవిధంగా చేయాలనంటే, వాళ్ళు నరకానికి వెళ్ళినా సరే, ఎవరూ వాళ్ళని బాధ పెట్టలేనివిధంగా చేయాలని. మీనుంచి తీసుకొని వెళ్ళలేనిది- మీ ఆనందం, గౌతమ బుద్ధుడు ఇది మళ్లిd మళ్లిd చెప్పాడు, ”నేను స్వర్గానికి వెళ్ళాలనుకోవడం లేదు, నేను నరకానికి వెళ్లాలనుకుంటున్నాను.” జనాలు అతన్ని వెర్రివాడను కున్నారు. కానీ స్వేచ్ఛని పొందిన వ్యక్తి అలానే ఉంటాడు. కాబట్టి మీరు అయోమయ స్పష్టతతో ఉంటే, అది మంచిదే. ”నా అయో మయం ఎప్పుడు పోతుంది? పూర్తి స్పష్టత ఎప్పుడు వస్తుంది?” పలానా తారీకని నేను నిర్దేశించాలనుకోవటం లేదు. కానీ అది ఈ రోజే అవ్వాలని మిమ్మల్ని దీవిస్తున్నాను. రేపటి దాకా ఎందుకు? ఈ రోజే ఎంతో సమయం మిగిలి ఉంది. అది ఈ రోజే అవ్వనివ్వండి.
ప్రేమాశీస్సులతో….సద్గురు

Advertisement

తాజా వార్తలు

Advertisement