Tuesday, November 26, 2024

ఆతిథ్యమంటే…!

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహ చ పార్వతి

మధ్యాహ్నం వేళలో ఇంటికి ఎవరైనా రావ చ్చు. వారిని సాదరంగా ఆహ్వానించి… వారికి మంచి నీళ్ళు ఇవ్వడం మర్యాదలు చేయడం పరిపాటి. ఆ తర్వాత అతిథిని ”భోజనం చేసారా! భోజనానికి రం డి!” అని పిలవాలి. అతి గృహస్తు ధర్మం.
ఇక ఆతిథ్య ప్రస్తావన వస్తే కాశీ పట్టణం పేరెత్త కుండా మాట్లాడటం కుదరదు. కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది. మధ్యా#హ్నం 12 గంటలవేళ ఎవరు అన్నం పెట్టినా అది అన్నపూర్ణమ్మ హస్తమే. అందుకే ఆడవాళ్లు కాశీయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ ”వడ్డన సేవ” చేయాలని కోరుకుంటారు. అటువంటి కాశీ పట్టణంలో అన్నం దొరకలేదని వ్యాసుల వారికి ఎక్క డలేని కోపం వచ్చేసింది. శపించబోయారు. చేతిలో కి నీళ్ళు తీసుకున్నాడు.
”ధనము లేకుండెదరు గాక మూడు తరములందు
మూడు తరములు చెడుగాక మోక్ష లక్ష్మి
విద్యయును మూడు తరములు లేకుండుగాక
పంచజనులకు కాశీ పట్టణమందు.” అన్నాడు.
ఇంతలో ఎదురుగుండా ఇంటిలోంచి పట్టుచీర కట్టుకుని వచ్చింది ఓ తల్లి. అప్పటికే లోపలి నుంచి శివుడు… ”ధూర్తుడు, కాశీని శపిస్తాడట.. కాల్చేస్తా…!” అంటున్నాడు. వెంటనే పార్వతీదేవి అన్నది కదా… ”ఆగం డాగండి. ఆకలి మీదున్న వాడిని కాల్చకూడదు. తప్పు. అతను అతిథి” అంది. కోపంతో నీళ్ళు పట్టుకుని ఊగిపోతున్న వ్యాసుడిని పిలిచింది ..”వ్యాసా! ఇలారా! భిక్షలేదని కాశీ పట్టణం మీద కోపించడమా.
నీ చిత్తశుద్ధి తెలుసుకుందామని పరమశివుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికా పట్టణంలో అన్నం దొరకకపోవడమా? భూమండలంలో ఎక్కడ యినా అన్నం దొరకదేమో కానీ కాశీ పట్టణంలో అన్న ము దొరకకపోవడం అంటూ ఉండదు. ఎందుకంత తొందరప డుతున్నావు? వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చుకుని రా”- అని వ్యాసుడిని, శిష్యులను పిలిచి కూర్చోబెట్టి మధురమైన వంటకాలను వడ్డించింది.
వ్యాసుడుకు కడుపునిండా అన్నం పెట్టింది. అప్పుడొచ్చాడు పరమశివుడు. ”ఎంత తప్పు చేసావు, కాశీని శపించడమా! వైరాగ్యం కొద్దీ కాశీకి రావాలే గానీ, భోగం కోరేవారు రాకూడదు. కాశీని వదిలి పెట్టి వెళ్ళిపో..” అన్నాడు.
ఆడవారి సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడయినా ఎవరికి అన్నం పెడతాడు? అన్న పూర్ణమ్మ తల్లి పాయసం పాత్ర ఎడమచేతిలో పట్టుకు ని బంగారు తెడ్డు కుడి చేత్తో పట్టుకుని ఎవడొస్తాడా వడ్డిద్దామని ఎదురు చూస్తుంటుంది కాశీలో.
ఆతిథ్యమంటే అంత తప్పు చేసిన అతిథిని కూడా కాశీ పట్టణం నుంచి పంపేముందు మధ్యాహ్నం అ న్నం పెట్టి మరీ పంపించింది అన్నపూర్ణ. అదీ ఈ దేశం గొప్పతనం. ఇంటి కి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించ డం గృ#హస్థు ధర్మం. ఒక అతిథి ఇంటికొస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలన్నది మనకు మన పెద్దలు నేర్పారు.
సనాతన ధర్మం కేవలం మనం ఎలా బతకాలో నేర్పలేదు. నలుగురి కోసం ఎంత ఉత్తమంగా బతికి, ఎంత ఉన్నతంగా ఎదగాలో నేర్పింది. మా తృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని మ నం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ముందుగా మనం పూర్తిగా జీర్ణిం చుకుని, మనసా వాచా కర్మణా అనుసరిస్తూ, మన పిల్లలకు ఆదర్శంగా నిలి స్తే- ఈ ధర్మాన్ని వారు మరో పదికాలాలపాటు పరిరక్షించగలుగుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement