ఒకే వ్యక్తిలోని దైవీశక్తి అసురశక్తికి ప్రతీకలే హరణ్యకశిప, ప్రహ్లా దులు. ఇద్దరూ రాక్షస జాతివారే.. పైగా తండ్రీకొడు కులు. ఇద్దరూ భక్తులే. హరణ్యకశిపుడు విష్ణుద్వేషి కాని విష్ణు వు కుమారుడైన బ్రహ్మకు భక్తుడు. ప్రహ్లాదుడు చరాచర సృష్టిలోని సక లమూ బ్రహ్మముగా తెలిసినవాడు.
హరణ్యకశిపుడు తన సోదరుడైన హరణ్యాక్షుని సంహరించిన విష్ణువుపై క్రోధాన్ని పెంచుకొని విష్ణువును సాధించాలనే భావనతో బ్ర హ్మను గూర్చి తపస్సు చేసాడు. బ్రహ్మ ప్రత్యక్షమయి వరం కోరుకొ మ్మన్నాడు. హరణ్యకశిపుడు అమరత్వాన్ని కోరాడు. శరీరం పదార్ధ నిర్మితం. పదార్ధమేదైనా పరిమిత కాలమే ఉంటుంది. నిర్మితమైనది నశిస్తుంది కాబట్టి అమరత్వాన్ని కాక మరేదైనా కోరుకోమన్నాడు, బ్రహ్మ. హరణ్యకశిపుడు ఎన్నింటినో చెపుతూ వాటిద్వారా మరణంలే ని వరం కోరాడు. బ్రహ్మ అనుగ్రహంచాడు. ప్రహ్లాదుడు భక్తితో మర ణమే లేదని నిరూపించాడు. వర గర్వంచేత హరణ్యకశిపుడు సకల భూమండలాన్ని , జాత్యహంకారంతో అమర లోకాన్నీ జయించా డు. ప్రహ్లాదుడు అంతశ్శత్రువులైన అరిషడ్వర్గాలను జయించగలి గాడు. అంతర్గత శక్తిసామర్ధ్యాలను ఇరువురూ వెలికి తీసుకున్నవారే. కాని వారాశించిన ప్రయోజనాల మధ్య భేదం వారి జీవితాలను శా సించింది. దైవాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలని భావించాడు హర ణ్యకశిపుడు. దైవం అనుగ్రహంకావాలని తపించాడు ప్రహ్లాదుడు.
మానవ జన్మ ప్రయోజనం మరొకజన్మ లేకుండా సాధన చేయ డం. అయితే ఇంద్రియాలు ఆ సంకల్పంపై ముసుగులు వేసి సాంసా రిక బంధనాలలో బంధిస్తాయి. హరణ్యకశిపుడు ఆ బంధనాలలో చిక్కుకున్నవాడు. ప్రహ్లాదుడు సర్వసమర్పణా భావనతో ఆ బం ధనాలకు దూరమయినవాడు. ఇష్టాయిష్టాలే రాగద్వేషాలు. రాగ ద్వేషాలకు బందీలయిన నాడు, జీవన ప్ర యోజనం నెరవేరదు. దానికి హరణ్యకశిపుని జీవితమే ఉదాహ రణ.
రాగద్వేషాలతో విష్ణువును బంధించలేకపోయాడు. దానినే ప్రహ్లాదుడు భక్తితో సాధించాడు. ఈ తండ్రీ కు మారుల పట్ల ”దైవము శరణమే పురుషశక్తి నిరర్ధక మెన్ని భంగులన్” అన్న ఏనుగు లక్ష్మణ కవి మాటలు నిరూ పితమయ్యాయి. హరణ్యకశిపునిది భక్తే… ప్రహ్లాదునిదీ భక్తే! ఒకరిది రాజసా హంకారంతో కూడినది కాగా మరొకరిది సాత్విక భక్తి. నిజానికి సాత్విక భక్తి కూడా భగవంతుని చేరడంలో అడ్డంకియే. అయి నా అతని స్థిత ప్రజ్ఞత భగవత్ సాక్షాత్కారాన్ని కల్పించింది. కాలమే బ్ర హ్మము. ”కాలోహ దురతి క్రమ:” అన్నట్లుగా కాలప్రభావానికి లోనై న #హరణ్యకశిపుడు కాలాన్ని నియంత్రించే విష్ణువు చేత హతుడైనాడు. కాలప్రభావాన్ని అతిక్రమించి ప్రహ్లాదుడు కాలాతీతుడయ్యాడు.
ప్రతి వ్యక్తిలో దైవీశక్తులు ఆనురీశక్తులు ఉంటాయి. ఏవి జాగృత మయి మనలను నడిపిస్తాయో వాటి ఆధిపత్యం ప్రకటితమౌతుంది. హరణ్యకశిపుడు అజ్ఞాని కాడు. తన సోదరుడైన #హరణ్యాక్షుని వరాహ రూపంలో విష్ణువు వధించిన వేళ దు:ఖిస్తున్న తల్లిని మరదండ్రను ఓదారుస్తూ చెప్పిన మాటలు అతని ఆధ్యాత్మిక పరిణతికి, వేదాంత శాస్త్ర అవగా#హనకు అద్దంపడతాయి. తపస్సు చేసి బ్రహ్మ చేత వరాలు పొంది వచ్చాక రాక్షసులను హంసామార్గంలో నడిచేందుకు ప్రేరణని స్తూ ఆదేశాలు ఇచ్చిన క్రమంలో కూడా ఆయన మాటలు ఆయనకు విష్ణుతత్త్వంపై ఉన్న అవగాహనను తెలుపుతున్నాయి. కాని కాలక్ర మంలో మాయామోహతుడై భగవత్తత్త్వాన్ని గుర్తించడంలో పొరప డి విష్ణుద్వేషాన్ని పెంచుకోవడం వల్ల అంతరంగం అ#హంకార తప్తమై పెడమార్గాన్ని పట్టింది.బుద్ధి విచక్షణకోల్పోయి పతనావస్థకు చేరాడు.
విషయం తెలియడం వేరు. తెలిసినదానిని ఆచరణలో చూపడం వేరు. సత్వరజస్ తమోగుణాలకు బందీలయినవాడు జీవుడని.. దాని కి అతీతమయినదే పరమాత్మయని అతనికి తెలియదా అంటే తెలుసు. కాని అహంకారం దానిని గుర్తించనీయదు. ప్రహ్లాదుడు తన ఆర్తితో భగవంతుని భూతలానికి దింపాడు. అది సాత్వికమైన ఆర్తి. హరణ్య కశిపుడు అహంభావి కావడంవల్ల తాను ఆర్తిని ప్రకటించలేదు. ఆర్తిని ప్రహ్లాదునిలో సృష్టించాడు. తాను ప్రహ్లాదుని కారణంగా పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందాలనే ఆవేదన అతనిది. అహంకారానికి ఆధార మైన శరీరం కూలడం ద్వారా అతని దైవికానుభవం నెరవేరింది. విశ్వ నాథవారన్నట్లు, జీవుని వేదనయే అతని ముక్తికి సాధనమనే సత్యం #హరణ్యకశిపుని ద్వారా నిరూపితమైంది. నరసింహుని చేతిలో మర ణం #హరణ్యకశిపునికి ఒక విధంగా శిక్ష కాగా మరొకవిధంగా వరమ యింది. వైరభక్తి మార్గంలో భగవంతు ని చేరే ప్రవృత్తికి ప్రతీకగా చెప్పవచ్చు.
దైవాసుర శక్తులే హిరణ్యకశిప- ప్రహ్లాదులు!
Advertisement
తాజా వార్తలు
Advertisement