Thursday, November 21, 2024

హిందూత్వం ఓ జీవనది!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శ్రీరామానుజాచార్యుల సందేశం ప్రపంచానికే స్ఫూర్తి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మనుషులంతా ఒక్కటే అన్న రామానుజాచార్యుల సందేశం అందరికీ ఆదర్శమన్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లోని సమతాకేంద్రాన్ని అమిత్‌షా మంగళవారం సందర్శించారు. సమానత్వ విగ్రహంను సందర్శించడం, ఈ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని ఆయన స్పష్టం చేశారు. రామానుజాచార్యులు రాబోయే తరాలకి స్ఫూర్తి మంత్రమని పేర్కొన్నారు. వెయ్యేళ్ల క్రితమే అందరూ సమానమేనని రామాను జాచార్యులు చెప్పారని..అందుకే ప్రస్తుతం
కూడా ఆయన బోధనలు మనకు వినిపి స్తున్నాయన్నారు. ప్రతి జీవిని ఆయన సమానంగా చూశారన్నారు. శ్రీరామ నగరం పర్యటన తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సనాతన ధర్మం నిలబడిందని ఆయన చెప్పారు. ఆనాడే రామానుజాచార్య సమానత్వ సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారని తెలిపా రు. దేశాన్ని ఆయన సమానత్వంతో అను సంధానించారన్నారు. రామానుజాచార్యు లు కూడా కుల వివక్షను అంతం చేసేందుకు కృషి చేశారని అమిత్‌షా చెప్పారు. సమాతా కేంద్రం ఏర్పాటులో చినజీయర్‌ స్వామి కృషిని దేశం మొత్తం గుర్తుంచుకుం టుందని తెలిపారు. భాషా సమానత్వం కోసం కూడా రామానుజాచార్యులు సమా నత్వాన్ని చాటారని అన్నారు. హిందూత్వం జీవనది లాంటిదని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రవాహం నిలిచిపోదని అమిత్‌షా తెలిపారు. సనాతన ధర్మంలో అహంకారం, జడత్వం లేదని చెెప్పారు. చినజీయర్‌ స్వామికి దేశం తరు పున ధన్యవాదాలు తెలుపుతున్నానని హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రామానుజాచార్యులు 120 ఏళ్లు జీవించా రని, మనిషి 60 ఏళ్లు జీవిస్తే సంపూర్ణంగా భావించే రోజుల్లో 120 ఏళ్లు ఆయన జీవిం చారని గుర్తు చేశారు. వేదాల్లో చెప్పినట్లే రామానుజాచార్యులు జీవించి చూపార న్నారు. వెయ్యేళ్ల క్రితమే జాతి, భాషా బేధా లను రూపుమాపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. రామానుజచార్యులు రాసిన శ్రీభాష్యం, వేదాంత సంగ్రహం సహ తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందా యన్నారు. అవి తన నియోజకవర్గంలోని గ్రంథాలయంలో ఉన్నాయన్నారు.

అమిత్‌ షాకు ఘనస్వాగతం
లక్నో నుంచి ప్రత్యేక విమా నంలో మంగళవారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటెల రాజేందర్‌తో పాటు మరికొంత మంది ఆయనకి స్వాగతం పలి కారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమానికి చేరుకున్నారు. సమతామూర్తి కేంద్రంలో ఉన్న 108 దివ్య క్షేత్రాలను షా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చినజయర్‌ సేవలు గొప్పవి
చినజీయర్‌స్వామి దేశానికి చేసే సేవలు గొప్పవని కొనియాడారు. 2003లోనే చినజీయర్‌ స్వామితో తనకు పరిచయం ఏర్పడిందన్నా రు. గుజరాత్‌ భూకంప బాధితులకు చినజీయర్‌ స్వామి సాయం చేశార న్నారు. అక్కడ ఓ గ్రామాన్ని పునర్ని ర్మించారని గుర్తు చేశారు. చినజీ యర్‌ స్వామి చిన్న వాళ్లనైనా ఎంతో గౌరవిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement