Saturday, November 23, 2024

హైందవ ధర్మ రథసారధి!

ప్రపంచంలో అశాంతి, అధర్మం ప్రబలినపుడు భగ వంతుడు తాను స్వయంగా గాని, మత ప్రవక్తలు గా, మత బోధకలుగా అవతరించటంగాని జరుగు తుంది. ఈ క్రమంలోనే శ్రీ ఆదిశంకరాచార్యులు భూలోకం లో అవతరించారు. వీరు తమ బోధనలతో ప్రజలలో చైత న్యం తీసుకొచ్చారు. హిందూ ధర్మానికి, హైందవేతర ధర్మా నికి మధ్య సంఘర్షణ కొనసాగుతూ వుండేది. ఇటువంటి స్థితిలో సృష్టి తత్వాన్ని, బ్రహ్మ తత్వాన్ని, జీవ రహస్యాన్ని తెలుసుకొని, నిత్యాను ష్ఠాన శక్తితో, భక్తితో, యోగ బలంతో వేద వాఙ్మయాన్ని ఆధారంగా చేసుకొని హైందవ ధర్మ రథ సారధిగా శంకరులు అవతరించారు. వీరు అద్వైత మత సంస్థాపనకు అవత రించిన పరమేశ్వరాంశ సంభూతులు.
శంకరులు తన తల్లి వృద్ధాప్యంతో పూర్ణానదికి వెళ్లలేని స్థితిలో, పూర్ణానదినే తన తపోబలంతో ఇంటి వద్దకు వచ్చే లా చేశారు. ఒకసారి నర్మదా నది పొంగి ఇబ్బంది కలిగించ గా, నదిని తన కమండంలో బంధించారు. వీరు శ్రీశంకరు లు అవసాన కాలంలో తప్పక వస్తానని తల్లికి మాట ఇచ్చి దేశాటనకి వెళతారు. తల్లి అంత్యదశలో తన కుమారుని స్మరించగా వారు ప్రత్యక్షమై, తల్లిని సంతోషపరుస్తారు. శ్రీ శంకరులు ప్రార్థన చేయగా విష్ణుమూర్తి తన దూతను పంపి ఆర్యాంబను వైకుంఠానికి తీసుకొని వెళతాడు.
గొప్ప మహిమాన్వితులైన శంకరాచార్యులు కేవలం 8 సంవత్సరాల ఆయుష్షుతో జన్మించారు. వారు, వారి తల్లి ఒక నాడు వారింటికి వచ్చిన సన్యాసులకు అతిధి మర్యాదు చేయగా సంతసించి, మరొక 8 సంవత్సరాల ఆయుష్షును ప్రసాదించారు. కాశీలో వేదవ్యాసునితో వాదించి వ్యాసాను గ్రహం పొంది, తద్వారా మరొక 16 సంవత్సరాలు, మొత్తం 32 సంవత్సరాలు జీవించారు. శ్రీ శంకరులు భూమిపై ధార్మిక కార్యములు పూర్తి చేసిన తరువాత దేవతాదులు విచ్చేసి వారిని కైలాసానికి తీసుకువెళతారు.

  • డా. దేవులపల్లి పద్మజ, 9849693414
Advertisement

తాజా వార్తలు

Advertisement