Monday, November 18, 2024

విషాద వీరుడుకర్ణుడు!

”యదిహాస్తి తదన్యుత్ర యన్నే హస్తి న తత్క్వచిత్‌”… అంటే ఇందు లో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉం ది. ”ఇందులో లేనిది మరెక్కడా లే దు” అని ప్రశస్తి పొందింది. ఇందులో కేవ లం కౌరవ పాండవుల కథ మాత్రమే కా దు, భగవద్గీత విష్ణు సహస్ర నామ స్తో త్రం కూడా మహాభారతంలోని భాగా లే! అందుకే మహాభారతం విశ్వవ్యాప్త కావ్యం అయింది.
మహాభారతాన్ని చెరుకుగడతో పోల్చుతారు. పర్వం అంటే చెరకు కణుపు. ఇది 18 కణుపులు (పర్వములు) కలి గిన పెద్ద చెరకు గడ. చెరకు నములుతున్న కొద్ది రసం నోటి లోకి వచ్చి, నోరంతా తీపి చేసినట్టు భారతం చదివే కొద్దీ ఇం కా చదవాలనే కోరిక కలగడమే గాక, చదివే కొద్దీ జ్ఞానం ద్వి గుణీకృతమవుతుందంటారు.
మహాభారతాన్ని ఆమూలాగ్రం చదివి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కర్ణున్ని విషాదవీరునిగా పేర్కొంటారు. ఆయన జననం నుండి మరణం వరకు మొక్కవోని పరాక్రమాన్ని ప్రద ర్శిస్తాడు. సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణున్ని తల్లి కుంతి, సమాజానికి వెరిసి పెట్టెలో పెట్టి గంగలో వదులు తుంది. సూతవంశుడు అతిరథునికి దొరికిన పెట్టెలో కనిపిం చిన తేజోవంతమైన బాలున్ని ఇంటికి తెచ్చి భార్య రాధకు ఇస్తాడు. సంతాన లేమితో బాధపడుతున్న ఆ దంపతులు బాలున్ని అల్లారు ముద్దుగా పెంచుతారు. అతడే కర్ణుడు.
అతిరథుడు కర్ణునికి ద్రోణాచార్యుని వద్ద అస్త్రశస్త్ర విద్య లు నేర్పిస్తాడు కాని ద్రోణాచార్యుడు మంత్రశక్తితో కూడిన ది వ్యాస్త్రా లను

నేర్ప నిరాకరిస్తాడు. బ్రాహ్మణ వేషంతో పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్న కర్ణుని దొంగ వేషం సంగతి తెలుసు కొని తను ఉపదేశించిన మహాస్త్రములు సమయం వచ్చిన ప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని శపిస్తాడు. అయినా ధై ర్యం కోల్పోక ముందుకు వెళ్తూ దుర్యోధనున్ని చేరతాడు. దు ర్యోధనుడు కర్ణుని ధైర్య సాహసాలను స్వయంగా చూసి అం గ రాజ్యానికి రాజును చేస్తాడు. అందుకు కర్ణుడు, దుర్యోధ నుని ప్రతిచర్యను సమర్థిస్తాడు.
దుర్యోధనుని మెప్పుకోసం కర్ణుడు అనేక అధర్మాలతో కూడిన అకృత్యాలు చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అయి ఆయన జీవితం కురుక్షేత్ర యుద్ధపు 17వ రోజున ము గుస్తుంది. జీవితంలో ఎంతటి గడ్డు పరిస్థితులనైన కర్ణుడు అధైర్యపడక సాహసంతో ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నె న్నో! ఆయన మరణ ఘట్టం చాలా విషాదకరం.
యుద్ధంలో కర్ణుడి రథం భూమిలోకి కుంగిపోతుంది. కర్ణుడు రథం దిగి ”అర్జునా ప్రస్తుతం నేను విరథుడను. భూ మిలో దిగిన రథ చక్రాన్ని నేను ఎత్తుకొనవలెను. ఈ సమ యంలో నా మీద బాణాలు వేయడం ధర్మం కాదు. కావున నేను రథచక్రాన్ని ఎత్తువరకు బాణాలు వేయడం ఆపాలి. నీకు యుద్ధ ధర్మం చెప్పడం కేవలం గుర్తు చేయడానికే కాని, నీకో, కృష్ణునికో భయపడి కాదు” అంటాడు. ఆ మాటలు విం టున్న కృష్ణుడు ”కర్ణా! యుద్ధ ధర్మం గురించి ఇప్పుడు గుర్తొ చ్చిందా? నీ రథం చక్రం భూ మిలో కుంగిపోయి నీకు కష్టం కలిగింది కాబట్టి నీ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తున్నా యి. నీ ప్రాణమిత్రుడు సుయోధనుడు పాండవుల పట్ల చేసే ప్రతి అధర్మ చర్యకు నీ సమర్థన ఉండబట్టే ఆయన విచక్షణా జ్ఞానం కోల్పోయి వ్యవహరించాడు. పాండవులను లక్క ఇం ట్లో పెట్టి నిప్పు పెట్టడానికి ప్రోత్సహించింది నువ్వు కాదా… అలా చేయడం నీకు అధర్మం అనిపించలేదా కర్ణా! ధర్మరాజు తో కపట జూదం, ద్రౌపదిని నిండు సభలో అవమానపరిచి నప్పుడు ధర్మం మరిచినట్టున్నావు కదా! అభిమన్యుణ్ని ఒం టరి చేసి పద్మవ్యూహంలో కౌరవ సేనలు చుట్టు ముట్టినప్ప డు ఈ ధర్మం మరిచిపోయినట్టున్నావు” అన్న శ్రీకృష్ణుని మాటలు ప్రతీకార చర్యకు ప్రోత్సహించినట్టయి అర్జునుడు కర్ణుని మీద గుక్క తిప్పుకునే సమయాన్ని ఇవ్వకుండా బా ణాలు వేస్తాడు. రథచక్రాన్ని లేప ప్రయత్నిస్తున్న కర్ణుడు అర్జునుని వైపు తిరిగి అస్త్రం సంధించలేకపోతాడు.
చివరకు కృష్ణుని సలహా మేరకు అర్జునుడు కర్ణునిపై మహాస్త్రాన్ని సంధిస్తాడు. నిప్పులు కురిపిస్తూ ఆ మహాస్త్రం కర్ణుని శిరస్సు ఖండిస్తుంది. అప్పటికి సూర్యుడు అస్తమిస్తా డు. కర్ణుని వధతో ఆ రోజు యుద్ధము ముగుస్తుంది. కర్ణుని జీవితమంతా పోరాటమయమే!ఆయన మరణం విపత్కర పరిస్థితిలో జరగ డంతో విషాద వీరు నిగా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement