Friday, November 22, 2024

పురాణాలలో హయగ్రీవం!

మన సంస్కృతిలో ప్రతి జీవికి ప్రాముఖ్యత ఉంది. ఆ సర్వేశ్వ రుడు సకల జీవులలో ఉండటమే కాక, సమయం, సందర్భం వచ్చినపుడు ఆయా జీవుల రూపాలను ధరించి మనలను అనే క దుష్టశక్తుల బారినుండి కాపాడాడు. ఇతిహాసాలను పరికిం చినపుడు ప్రతిజీవి నేపథ్యం మనకు అవగతమవుతుంటుంది. అటువంటి పురాణ ప్రాముఖ్యం గల జీవులలో ‘గుర్రం’ ఒకటి.
సాగరమథన సమయంలో ఉచ్చైశ్రవమనే గుర్రం పుట్టిం దనీ, సామవేదం నాలుక నుంచి, బ్రహ్మ దేవుడు హోమం చేస్తు న్నప్పుడు ఆయన కన్నుల నుంచి, అగ్నినుంచి, అష్టదిక్పాలకు లయందు గుర్రం ఉద్భవించిందని చెబుతుంటారు. ఒకానొక ప్పుడు లక్ష్మీదేవి శాపానికి గురైన బ్రహ్మదేవుడు విచిత్ర రూపా న్ని సంతరించుకుని, ఆ రూపం ఒక అండంగా (గుడ్డు) మారి, ఆ గుడ్డు నుంచి ఎనిమిది గుర్రాలు పుట్టాయట.
శ్రీమహావిష్ణువు ధరించిన అనేక అవతారాలలో హయగ్రీ వ అవతారం కూడ ఒకటి. పూర్వం హయశీర్షుడనే రాక్షసుడు దేవిని ప్రార్థించి తనకు మనిషిదేహం, గుర్రంతల రూపం గల వాని చేతుల్లోనే మరణం సంభవించాలని కోరుకుంటాడు. దాంతో నారాయణుడు హయగ్రీవుడై హయశీర్షుని సంహరిం చి వేదాలను ఉద్దరించాడని దేవీభాగవత కథ.
వేరొక కథ ప్రకారం, మధుకైటభులనే రాక్షసులు వేదాల ను ఆపహరించి పాతాళంలో దాక్కుంటారు. వారిని సంహ రించేందుకై పాతాళానికెళ్ళిన శ్రీహరి, అక్కడ గుర్రపు తల, మనుష్య శరీరం గల రూపును ధరించి గుర్రంలా పెద్దగా సకిలి స్తాడు. ఆ ధ్వనికి భయపడిన రాక్షస సోదరులు, తాము దాక్కు న్న చోటు నుంచి బయటకు వస్తారు. సరిగ్గా అదే సమయం లో శ్రీహరి వారు దాచిన వేదాలను తిరిగి సంగ్రహం చి, బ్రహ్మదేవునికి అందజేసి, మధుకైటభులు న్న ప్రాంతానికొచ్చి వారిని సంహరిస్తాడు.
శ్రీహరి సకిలింపును గురించి తల చుకున్నప్పుడు మనకు అశ్వత్థామ గుర్తుకొస్తాడు. కృపి, ద్రోణుల పు త్రుడైన అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్రవంలా (గుర్రం) సకి లించాడట. అందుకే అత ని ‘అశ్వత్థామ’ అని పేరు.
అలాగే గరుత్మం తుని కథ కూడా ఆ ఉచ్చై శ్రవమనే గుర్రంతో ము డిపడిందే. ఒకసారి విన త, కద్రువలు సాగర తీరాన వి#హరిస్తూఉచ్చైశ్ర వాన్ని చూసి, దాని తోక నలుపా తెలుపా అన్న విష యంలో పోటీ పెట్టుకుంటారు. పోటీలో ఓడిపోయినవారు, గెలి చినవారికి దాస్యం చేయాలి. ఆ పం దెంలో గరుత్మంతుడు తల్లిని దాస్య విముక్తురాలిని చేస్తాడు.
మహాభారత యుద్ధంలో రథాలకు అత్యంత ప్రాముఖ్యత కనిపిస్తుంది. అలాగే రథాలను లాగే గుర్రాల కు కూడా రథాన్ని బట్టి సైన్యంలోని శ్రేణులు ఏర్పడుతుండే వి. ఈ శ్రేణులు అర్థరథ, సమరథ, మహారథ, అతిరథులం టూ పిలువబడేవి. రథి, సారథుల మధ్య అన్యోన్యత ఉండేది. ద్రోణాచార్యుని గుర్రాలు ఎరుపు రంగుతో మెరిసిపోతుండగా, ధర్మరాజు, అర్జునుడుల రథాలకు తెల్లటి గుర్రాలు ఉండేవట. పాండవుల అశ్వికదళానికి నకుల సహదేవులు, కౌరవుల అశ్విక సైన్యానికి శకుని అధిపతిగా ఉండేవారు. ఈవిధంగా మహా భారత యుద్ధంలో అశ్విక సైన్యానికి ఎనలేని ప్రాముఖ్యత ఉం డేది. వేగంగావెళ్ళే అశ్విక సైన్యం శత్రువుల మీదకు అలలు అల లుగా మీదపడుతుండేదట. శత్రు సైన్యాన్ని వెనుకనుంచి ముట్టడించటానికి అశ్వ దళాన్ని ఉపయోగించేవారట. అశ్వ హృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీకృష్ణునికి ఆ విద్య తెలుసునని, సైంధవ వధలో ప్రదర్శించాడనీ, నకులు నికి అశ్వశిక్షణ తెలుసునని మహాభారతం వల్ల తెలుస్తోంది.
ఇక రామాయణంలో శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి వదిలిన గుర్రాన్ని శ్రీరాముని కుమారులు కట్టివేయడం, వారి తో లక్ష్మణాదులు తలపడటం తదితర కథ మనకు తెలిసిందే!
సూర్యభగవానుడు తన ఏడుగుర్రాల రథంపై వస్తుండ టాన్ని చిత్రపటాల్లో చూస్తుంటాం. ఒకానొకప్పుడు సూర్యు డు, సూర్యుని భార్య సంజ్ఞాదేవి గుర్రాల రూపాలను ధరిస్తారు. ఆ సమయంలో వారికి నాసత్యుడు, దవుడు అనే కుమారులు కలుగుతారు. వారే అశ్వినీదేవతలు. ఇలా గుర్రానికి సంబంధిం చిన ఎన్నో విషయాలు మన పురాణాలలో కనబడుతుంటాయి.
అంతేకాదు, గుర్రానికి ప్రాముఖ్యతగల తీర్థం కన్యాకుబ్జం సమీపంలో ఉంది. విశ్వామిత్రుని తండ్రి గాధి. ఆయన కూతు రు సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని గాధిని ఋచీక మహర్షి కోరతాడు. గాధి ఒక చెవి నలుపుగా, శరీరమంతా తెలుపుగా ఉండే వెయ్యి గుర్రాలను ఇస్తే పిల్లనిచ్చి పెళ్ళి చేస్తానంటాడు. ఋచీకుడు వరుణదేవుని ప్రార్థించగా, వరుణుడు ”తలచిన చోట గుర్రాలు లభిస్తాయని” అంటాడు. ఋచీకుడు తనకు గంగానది ఉత్తరాన వెయ్యి గుర్రాలు కావాలని కోరగా అక్కడ ప్రత్యక్షమవుతాయి. ఆ ప్రదేశం ఆశ్వతీర్థంగా పేరుగాంచింది.
అగ్ని పురాణంలో గుర్రానికి సంబంధించిన విషయాల ను ధన్వంతరి వివరించాడు. గుర్రం మనసులో బ్రహ్మ, బలం లో విష్ణువు, పరాక్రమంలో గరుత్మంతుడు, రెండు పక్కలా రుద్రగణాలు, బుద్ధిలో బృహస్పతి, మర్మస్థానంలో విశ్వదేవు లు, నేత్రాలలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీ కుమారు లు, జఠరాగ్నిలో స్వధ, నాలుకపై సరస్వతీ, వేగంలో వాయుదే వుడు, వెనుకభాగంలో స్వర్గం, కాలిగిట్టల్లో పర్వతాలు, రోమ కూపాలలో నక్షత్రగణాలు, హృదయంలో చంద్రకళ, తేజస్సు లోఅగ్ని, లలాటంలో జగత్పతి, వక్షస్థలంలో వాసుకి ఉంటా రట. అందుకే గుర్రాన్ని ఉపయోగించడానికి కొన్ని నియమా లను మన పూర్వులు ఏర్పరిచారు. గుర్రంలో దేవతలంతా ఉంటారని భావిస్తూ, గుర్రం కుడి చెవిలో మంత్రరూపంలో చెప్పి గుర్రాన్ని ఎక్కడం మంచిదట.

Advertisement

తాజా వార్తలు

Advertisement