Saturday, November 23, 2024

హరివాసరం వైకుంఠ ఏకాదశి

హైందవుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరిం చే పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి. దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా, దక్షిణాయనం రాత్రివేళగా పేర్కొంటారు. ఉత్త ర దక్షిణాయనాలకు సంధిలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మ సమయంగా అభివర్ణిస్తారు. ఈ బ్రాహ్మ ముహూ ర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఆ రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ నాథుడిని దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీమహా విష్ణువు అనుగ్రహాన్ని పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో ఉత్తర దిక్కుగా స్వామిని దర్శించి తరిస్తారు.
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనం తరం మకర సంక్రమణం వరకు జరిగే ”మా ర్గం” మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తుల కు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకా దశి అనే పేరు వచ్చిందంటారు. దీన్నే హరివాస రమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటా రు. కాల స్వరూపంలో ఉత్తరం పగలయితే, రాత్రి దక్షిణం అవుతుంది. ఉత్తర దక్షిణాల్లో ఉత్త రం వైపుకు నడవటం శుభప్రదమైంది, మంగళ ప్రదమైందని పురాణవచనం. ఈ క్షణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ మవుతుంది.
ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెం డూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.
పూర్వము కుంభ అనే రాక్షసుని కుమారుడైన మృదమ న్యుడు తపస్సుచే శివుని మెప్పించి అమోఘ వరాలను పొంది అన్ని లోకాల్ని బాధించుచుండెను. అతనికి భయపడి దేవత లు అమలక వృక్షం తొర్రలో దాగిరి. వారి వెంటబడి వచ్చిన ఆ దానవుని ఆ వృక్షకోటరము నుండి జనించిన అయోనిజ అయిన స్త్రీ సంహరించింది. ఆమెయే ఏకాదశి. ఆమెకు కృత జ్ఞతా రూపంగా ప్రతిపక్షంలో 11వ రోజు ఉపవసించుట సంప్రదాయమైంది.
కృతయుగంలో తాళజంఘుడను రాక్షసుని కుమారు డైన ‘ముర’ అనే దానవుడు దేవతల్ని నానా బాధలకు గురి చేస్తూ ఉండేవాడు. వారు విష్ణువుని ప్రార్థించగా, విష్ణుసంక ల్పం వల్ల అతని దేహము నుండి జన్మించిన మహాబలం కలిగిన కన్య ఆ దానవుని సంహరించింది. ఆమె పక్షం (15 రోజులు)లో 11వ రోజు జన్మించుటచే ఏకాదశి అయ్యింది. ఆమె చేసిన పనికి సంతసించి ఆమెను వరమడుగుమని విష్ణువు అన్నాడు. ఈ నా తిధికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రాము ఖ్యం, పవిత్రత ఏర్పడునట్లుగా అనుగ్రహంపుము అని వారిని ప్రార్ధించింది అని భవిష్యోత్తర పురాణంలో చెప్ప బడింది. నాటి నుండి ఏకాదశి వ్రతమారంభమైంది. ఏకా దశిలో అంతర్లీనంగా నున్న భాష్యం ఏమిటంటే ఏకాదశి అంటే పక్షం లో 11వ రోజు. ఆ పదకొండు ఏమిటంటే 5 కర్మేంద్రియాలు (ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానమని) 5 జ్ఞానేంద్రియాలు (చెవి, చర్మము, నోరు, కన్ను, ముక్కు) తర్వాత మనస్సుతో కలిపి పదకొండు. ఈ ఏకాదశాంశాల ఏకత్వమే పరిపూర్ణ స్థితి.
పద్మ పురాణం ప్రకారం, ‘ముర’ అనే రాక్షసుడి దురాగ తాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహంచి బదరికాశ్రమంలోని హమావతి గుహ లోకి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి తనలో నుంచి ఉద్భవించిన శక్తి కి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఈ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. దాంతో విష్ణువు ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని వరమిస్తాడు.
వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటా డని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈరోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబు తోంది. ‘ముర’ అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరి షడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్ప డుతుంది. వరి అన్నం లో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి, జాగురూకతను దెబ్బతీస్తాడని అంత రార్థం. అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీతను కూడా దానం చేస్తారు.
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం.
”లంఖణం పరమౌష ధ”మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం దైవానికి దగ్గరవా లనేదే ఉపవాసంలోని ఆశయం.
ఏకాదశి వ్రతం నియమాలు

  1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉం డాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.
    అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించి, పూజా మందిర మును అలంకరించుకొని, విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరిం చుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళములు ఉప యోగించాలి. ఈ రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లౖైెతే సర్వపా పాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నా యి. కనుక జాజిమాల ను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీ#హరిని స్తుతించడం శుభ ప్రదమని పండితులు చెబుతున్నారు. ఈనాడు చేసే విష్ణు పూజ, పారాయణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ”ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజ యంగా పూర్తవుతాయి.
    మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహత సంబంధం ఉంది. ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం. జ్యోతిష్యం ప్రకారం చంద్ర గమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరం, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని ఆయుర్వే ద నిపుణులు చెబుతారు.
    ఒక్కమాటలో చెప్పాలంటే ఉపవాసం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే.
    వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమ పదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుం చీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. ఇంతటి ఘన త వహంచిన వైకుంఠ హరివాసరాన్ని ఉపవాస నియమంతో సాకారం చేసుకోవాలి. కోటి పుణ్యాలకు సాటి.. ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దలు చెప్తుంటారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement