Wednesday, November 20, 2024

హరిహరాదుల ఏకత్వ భావన!

కార్తీక మాసం హరిహరాదులకు ప్రీతికరమైన మాసంగా పురాణాలు వివరిస్తున్నా యి. సృష్టి కారకుడైన బ్రహ్మ, స్థితి కారకుడైన విష్ణువు, లయ కారకుడైన మహశ్వ రులను త్రిమూర్తులుగా ఆరాధిస్తున్నాం. అయితే శైవ ఆరాధకులు శివుడు గొప్పవాడని, వైష్ణవులు మహావిష్ణువు గొప్పవాడని వాదోపవాదాలు చేస్తూంటారు. కానీ ఈ ముగ్గురు మూ ర్తులు పరబ్రహ్మ స్వరూపమే. విశ్వం కాలానుగుణంగా నడవడానికి మూడు రూపాలను కల్పించబడ్డాయి.
భాగవతంలో ”వదన్తి తత్త్వ విదస్తత్వం- ఇతి శబ్ద్యతే! (12-11 మూల భాగవతంలో) అంటే బుద్ధిమంతులైన తపోధనులు, పరమ సత్యాన్ని తెలిసినవారు ఒకే పరమేశ్వర తత్త్వం అని చెప్పారు. అదే జగత్తులో మూడు రకాలుగా వ్యక్తమవుతోంది అని. దీనికి ఒక ఉదాహర ణ – నీరు, నీటి ఆవిరి, మంచుగడ్డ. మూడూ హడ్రోజన్‌ డైయాక్సైడ్‌ పదార్థపు అణువులు కలిగి ఉన్నాయి. దాహంతో ఉన్న వ్యక్తికి మంచుగడ్డగాని, నీటి ఆవిరి కాని ఇస్తే దాహం తీరదు కదా! నీటి యొక్క రూపాలను పరిస్థితులు బట్టి వాడుకొంటుంటాము. అలాగే పరబ్రహ్మ స్వరూ పం మూడు రూపాల్లో వ్యక్తమవుతోంది. అందుచే హరహరాదులు ఒక్కటే!
వామన పురాణం లోని అంశం ప్రకారం ”కైలాసంలోని శివగణాలు అన్నీ విష్ణువును నిం దిస్తూ, మా శివుడే గొప్ప అంటూ, విష్ణు బృందం వారితో ఘర్షణ పడుతున్న సమయంలో పరమేశ్వరుడుకు తెలిసి, ఆయన గణాలను అదుపు చేసి, తాను గరుడారూఢు విష్ణువుగాను, మరోసారి వృషభ ధ్వజుడుగాను, ఒకసారి సహస్రముఖాలతో శివుడు దర్శనమిచ్చి, క్రమేపీ సగభాగం విష్ణు రూపం, సగభాగం శివ రూపంతో దర్శనమిచ్చి, మేము ఇద్దరం ఒక్కటే అని చూపించాడు.
వాయు పురాణంలోని అంశం ప్రకారం బ్రహ్మ, విష్ణువుతో కలిసి కైలాసం వెళ్ళిన సంద ర్భంలో శివుడని స్తుతించారు. అపుడు శివుడు వారిరువురుతో, ”మీరు చేసిన స్తుతికి సంతోషిం చాను.” అని, ”ప్రజాపతి! మీకు ఏ వరం కావాలో కోరుకోమ”న్నాడు. వెంటనే బ్రహ్మ మీరే నాకు పుత్రుడుగా జన్మించాలని కోరాడు. అందుకు మహశ్వరుడు ”మీకు సృష్టి క్రమంలో ఒకే సారి క్రోధం వస్తుంది. ఆ సమయంలో నేను మీ నుదుటి నుండి ”రుద్రుడు” అనే నామంతో నీ పుత్రుడుగా వెలుగొందుతాను. అపుడు విష్ణువు తనకు మీపై (శివుడుపై) భక్తి ఉండేటట్లుగా వరం అడిగితే మహశ్వరుడు ”నువ్వు- నేను ఒక్కటే. నువ్వు వేరు కాదు. నేను వేరు కాదు. కేశవా! ఈ కనపడే స్థావర జంగామాత్మకమైన విశ్వం అంతా ”రుద్ర నారాయణాత్మికం! నేను అగ్నినైతే, నువ్వు సోముడువి, నేను రాత్రి అయితే నువ్వు ఉదయానివి. నిన్ను ధ్యానించే వారు, నీ నామాన్ని జపించేవారు నా అనుగ్రహంతో కైలాసం చేరుకొంటారు. ఓ! విష్ణు నీ హృద యంలో నేను, నా హృదయం లో నీవు ఉంటాం. అందుకే నువ్వు నేను ఒక్కటే. బేధమే లేదు. అని పరమేశ్వరుడు పలికారు.
”ప్రకాశం చాప్రా కాశం చ జంగమ స్థావరం త్మకమ్‌” అని (వాయు పురాణంలో 25 అధ్యాయంలో 20 నుంచి 26 శ్లోకములు ఏకత్వాన్ని వివరించారు. అందుకే హరిహరాదుల కు భేధం లేదు.
శ్రీకృష్ణ శతకంలో-
”విశ్వోత్పత్తికి బ్రహ్మ వై
విశ్వము రక్షింపదలచి విష్ణుడవనగా
విశ్వము జెరుపున హరుడవు,
విశ్వాత్మక నీవె యగుదు వెలయగ కృష్ణా!”
లోకాలను సృష్టించే బ్రహ్మగా, రక్షించే విష్ణువుగా, లయమును చేసే శివునిగా ఉన్నా, అన్నీ నీవే. నీవే కదా కృష్ణా! అని. పురాణాలు ప్రకారం పరబ్రహ్మ స్వరూపం నుంచే త్రిమూ ర్తులు సృష్టి కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహంచడానికి ఆవిర్భవించారు. అందుకే హరిహ రాదుల ఏకత్వాన్ని సూచిస్తోంది. విష్ణు సహస్రనామాలలో, శివ సహస్రనామాలలో చాలా నామాలు ఒకే భావాన్ని విశిదపరుస్తున్నాయి.
శ్వేతాశ్వతర ఉపనిషత్తులో—-
”ఏకో దేవ: సర్వభూతేషు గూఢ:
సర్వ వ్యాపీ సర్వ భూతాంతరాత్మ” (6-11)లో వివరించబడింది. అంటే ఒకే పరమాత్మ తత్త్వం విశ్వవ్యాప్తం అయ్యిందని పేర్కొన్నారు. అంటే శివకేశవులు ఒకే తత్త్వం. సంధ్యావందనంలో గాయత్రీ మంత్రం ఉపాసన తరువాత ఆఖర్లో ”హరిహర బేధ స్మర ణం” వస్తుంది కదా. ఆ మంత్రాలు ప్రకారం కూడా శివ- కేశవుల ఏకత్వాన్ని తెలియచేస్తోం ది. ఆఖరికి యోగి వేమన కూడా ఏకత్వం గురించి కొన్ని పద్యాలు చెప్పారు. అందులో ఒకటి -— ”శివుడు మూలకర్త, సృష్టియై విష్ణుండు
విష్ణువు నందు శివుడు వెలయుచుండు
శివుని యందు హరియు వెలగొందు చుండు
విశ్వదాభిరామ వినుర వేమ.”
అంటే ఆ కాలం నుంచి శివ కేశవుల ఏకత్వాన్ని పాటిస్తున్నట్లేనని తెలుస్తోంది.

#హరి#హరాదుల దేవాలయం—

క్రీ.శ 999 – 1012 మధ్య తూర్పు చాళుక్యుల వంశీయుడు మొదటి శక్తి వర్మ కన్నడ దేశంలో (కర్ణాటక) హసన్‌ జిల్లా శివమొగ్గ దగ్గరగా ”హరిహరా” అనేచోట హరిహరాదుల దేవాలయం నిర్మించబడింది. తరువాత 1220 సం.లో హోయల వీర రెండవ నరసింహ సేనాపతి పాలాశ్వదండనాథుడు పున: నిర్మాణం చేపట్టారు. ఆ దేవాలయంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు నిర్వహస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement