Thursday, January 23, 2025

హరేకృష్ణ మహామంత్ర

‘బ్రహ్మాండ పురాణం’ ప్రకారం హరేకృష్ణ మహామంత్రం యొక్క శక్తి అపరిమితమైనదిగా వివరించబడింది.
”హరేకృష్ణ హరేకృష్ణ
కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ
రామరామ హరేహరే!”
కేవలం ఒకసారి ”రామ” నామాన్ని జపిస్తే 1000 సార్లు ”విష్ణు” నామాన్ని జపించినప్పుడు వచ్చే ఫలితం వస్తుంది. ఒకసారి ”కృష్ణ” నామాన్ని జపిస్తే 3 సార్లు ”రామ” నామాన్ని జపించినప్పుడు కలిగే ఫలితం వస్తుంది. ”#హరేకృష్ణ” మహామంత్రంలో నాలుగు సార్లు ”కృష్ణ” నామం, నాలుగు సార్లు ”రామ” నామం ఉన్నాయి. అంటే ”హరేకృష్ణ” మహామంత్రంలో నాలుగు సార్లు ”కృష్ణ” నామాన్ని జపిస్తాము, అందువల్ల 12 సార్లు ”రామ” నామాన్ని జపించిన ఫలితం వస్తుంది.
ఆ విధంగా మహామంత్రంలో 4 ”కృష్ణ” నామాలు (అంటే 12 ”రామ” నామాలతో సమానం), మరో 4 ”రామ” నామాలు ఉన్నాయి. అంటే మొత్తం కలిసి 16 ”రామ” నామాలు ఉన్నట్లు.
1”రామ” నామం 1000 ”విష్ణు” నామాలు
16 ”రామ” నామాలు 16000 ”విష్ణు” నామాలు.
ఒక్క మహామంత్రంలో 16 ”రామ” నామాలు 16000 ”విష్ణు” నామాలు ఉన్నట్లు. అంటే ఒక్కసారి ”హరేకృష్ణ” మహామంత్రం జపము చేసినట్లయితే 16,000 సార్లు ”విష్ణు” నామాలు జపించడంతో సమానం అవుతుంది.
ఒక మాల జపము అనగా 108 సార్లు జపించడం. ఒక మాల ”హరేకృష్ణ” మహామంత్రం జపము చేసినట్లయితే 108* 16000=17,28,000 సార్లు విష్ణునామాలు జపించడంతో సమానం అవుతుంది.
16 మాలలు హరేకృష్ణ మహామంత్రం జపము చేసినట్లయితే 2,76,48,000 సార్లు ”విష్ణు” నామాలు జపించడంతో సమానం అవుతుంది.
మన ఆయుష్షు చాలా తక్కువ. అందుకే మనం తక్కువ సమయంలో ఎక్కువ భక్తి, పుణ్యం కలుగాలంటే అపరిమితమైన శక్తి కలిగిన హరేకృష్ణ మహామంత్రం జపము, సంకీర్తన చేద్దాం. భగవద్ధామం చేరుకుందాం, శాశ్వతమైన ఆనందం పొందుదాం.
ఇప్పుడు ఒక్కసారి అందరం హరేకృష్ణ మహామంత్రం స్మరిద్దాం
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

  • దండంరాజు రాంచందర్‌ రావు
Advertisement

తాజా వార్తలు

Advertisement