Wednesday, September 18, 2024

శుభకర శ్రావణ పూర్ణిమ!

శ్రావణ పౌ ర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. గాయత్రీ మంత్రో చ్ఛారణ, జ్ఞానప్రదాత #హయగ్రీవ జయంతి, అన్నాచెల్లెళ్ళ పండుగ మొదలైన విశే షములను ఒకే రోజున నిర్వహంచుకునే ముఖ్యమైన రోజు. ”జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికా కృతిం!
ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ ముపాస్మహ!!”
అనే మంత్రానుష్టానముతో హయగ్రీవుని ఆరాధన, విద్య, జ్ఞాన సం పదలను అనుగ్రహంచే హయగ్రీయ కవచ పారాయణ కూడా అత్యంత ఫలప్ర దము. ఇది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే మొదటి ప్రత్యేకత.
ద్వితీయ విశేషం గాయత్రీ ఆరాధన. విధివిధానాలతో చేసే గా యత్రీ మంత్ర అనుష్టానము సకల విద్యలకు నెలవు. ఈరోజు మంత్ర ప్ర క్రియలతో నూతన యజ్ఞోపవీతమును పురుషులు ధారణచేసి, పాత యజ్ఞోపవీతముతో దానిని అను సంధానము చేయాలి. తదుపరి పాత యజ్ఞోపవీత మును విసర్జన చేయాలి. గాయత్రీ మంత్రము అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్టమైనది. ‘గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రి’, శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. పరబ్ర#హ్మ, పరమాత్మల క్రి యా భాగం గాయత్రి. పరమ శివుడు బ్రహ్మానం దంలో తన ఢమరుకంలో చేసిన 24 ధ్వనులే గా యత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఇవి 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు.
”ఓం భూర్భువ స్వ: తత్సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్యథీ మహ, థియో యోన: ప్రచోదయాత్‌”
ఈ విశేష మంత్ర రాజాన్ని అనుష్టానం చేసే పరమ పవిత్రమైన దినం ఈ శ్రావణ పౌర్ణిమ.
తృతీయ విశేషం రాఖీ పౌర్ణమి. ఈ రోజు రక్షాబంధ నం జరుపుకుం టారు అన్నాచెల్లెళ్ళు. రక్షాబంధనం ఆవిర్భావం శ్రీకృష్ణుడికి, ద్రౌపది ప్రప్రథమంగా కట్టినట్టు తెలుస్తోంది. శ్రీకృ ష్ణుడు, శిశుపాలుని వ ధించు సమయంలో బొటనవేలికి గాయమై రక్తం స్రవిస్తున్నప్పుడు ద్రౌపది తన పట్టుచీర, చీరకొంగు చింపి శ్రీకృష్ణుని చేతికి కట్టింది. ఆ సందర్భంలో శ్రీ కృష్ణుడు ద్రౌపదికి సోదరుడిగా నీకు రక్షగా ఉంటానని మాట ఇచ్చాడు.
ద్రౌపదిని నిండు సభలో కౌరవులు అవమానిస్తున్నప్పుడు ఆపద సమయాల్లో శ్రీ#హరిని స్మరించమని బాల్యంలో వసిష్టుల వారు చేసిన ఉపదేశం ఆమె స్మృతిలో మెదిలింది.
”మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్‌ హరి:”
కృష్ణా! గోవిందా! గోపాలా! అని పదేపదే స్మరిస్తూ ఉంది.
ఆపత్స్యభయదం కృష్ణ లోకానాం ప్రపితామహం

గోవింద ద్వారకా వాసిన్‌ కృష్ణ గోపీ జనప్రియ!!
కౌరవై: పరిభూతానాం మాంస కింద జానాసి కేశవ!
##హ నామ ##హ రమానాథ వ్రజనాథ ఆర్తినాశనా!
కౌరవార్ణవ మన్నెం మాముద్ధరస్వ జనార్థన!!
కృష్ణా! ఘోరమైన ఆపదలో ఉన్నాను. నాకు అభయాన్ని ప్రసాదిం చు. విశ్వభావనా! గోవిందా! కౌరవుల పాల్పడి మునిగిపోతున్న నన్ను రక్షించు. కౌరవులు చేత అవమానింపబడు తు న్న స్త్రీ మర్యాదను కాపా డు. నన్ను దు:ఖం నుం చి కాపాడు. అంటూ ఆర్తిగా వేడుకున్నపుడు, ద్రౌపది భక్తి కృష్ణుని హృదయం కదిలించి వేసిం ది. శ్రీకృష్ణుడు అవ్యక్తంగా శోభిస్తూ, ద్రౌపదికి అక్షయంగా వస్త్రదానం చేసాడు. ఇదంతా ఓ సోదరుడికి కట్టిన రక్షకి ఫలితంగా ఇచ్చిన మాట కు కట్టుబడి కృష్ణుడు చెల్లెలికి రక్షణగా ఉన్నాడు. ఆ కారణంగా ఆనాటి నుంచి రక్షాబంధన వేడుక అన్నచెల్లెళ్ళు జరుపుకుంటున్నారు.
వివాహానంతరం మెట్టినింటికి వెళ్ళిపోయే ఆడపడుచులు ఏడాదికి ఒకసారి ఈ రక్షాబం ధనం జరపడానికి పుట్టింటికి వచ్చి తన వారితో కలసి వేడుక జరుపుకుంటారు. మన భారతీయ సంప్రదాయంలో రక్ష, రక్షణ కోరుతూ సోదరి తన సోదరుని నుదుటికి తిలకం దిద్ది, చేతికి రక్షాబంధనము చేసి, తీపి మిఠాయి తినిపిస్తారు. సోదరుడు తనకన్నా పెద్దవాడు అయితే ఆశీర్వచనం తీసుకుంటారు. చిన్నవాడైతే దీవెనలిస్తా రు. సోదరుడు తన సోదరికి బ#హుమతులు అందచేస్తారు. సోదరికి రక్ష గా ఉంటానని ప్రమాణం చేస్తాడు.
మరొక విశేషం ఏమంటే ఈ రోజు కోజారి పూర్ణిమగా మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజు కోసం 24 రోజుల ముందుగా ఒక చెట్టు చుట్టూ ఉన్న మట్టిని తీసుకుని, కుండ చేసి అందులో నీరు, బార్లీ నింపి పౌర్ణమి వరకు రోజూ నీరు నింపి, పౌర్ణమి నాడు నదుల వద్ద వదులుతారు. ఒక విధమైన దోస విత్తనాలను లేక చిన్న మొక్కను నాటుతారు. దోసపాదులాగ వారి అనుబంధాలు అల్లుకోవాల ని ఆకాంక్షిస్తారు. పౌర్ణమినాడు చంద్రుని, గోమాతను పూజించి, దానా లు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలు గుతాయని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement