Sunday, November 10, 2024

హనుమంతుడి పుత్రుడు మకరధ్వజుడు!

వాయుదేవుడి వరంతో అంజనాదేవి, కేసరిలకు జన్మించిన ఆంజనేయస్వామి సాక్షాత్తు పరమశివుని అవతారుడు. ప్రధానంగా రామా యణంలో శ్రీరాముని భక్తుడిగా పేరుగాంచాడు. ఇతర కొన్ని పురాణాలు, ఉపనిషత్తుల ప్రకారం ఆంజనేయస్వామికి భార్య సువర్చలాదేవి వున్న ట్టే ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. కానీ ఈ విష యం చాలామందికి తెలియదు. ఆంజనేయస్వా మి కొడుకు ఎవరు? అతని జన్మ రహస్యం… ఆం జనేయస్వామి ఆయన కొడుకును గుర్తించిన వి ధానం అన్నీ అద్భుతంగా జరిగిన సంఘటనలే.
రామాయణ కథ ప్రకారం సీతాదేవిని వెతక డానికి ఆంజనేయస్వామి లంకకు వెళతాడు. సీతాదేవిని అప్పగించమని ఆంజనేయస్వామి చేసిన హితబోధ రావణాసురుడికి నచ్చదు. అత ను సైన్యాన్ని పిలిచి ఆంజనేయుడి తోకకు నిప్పం టించమంటాడు. ఆంజనేయస్వామి నిప్పంటిం చిన తోకతో లంకంతా అంటించాడు. చివరకు లంక నుంచి తిరిగి రాములవారి చెంతకు వెళు తూ సముద్రంలో మునిగి తోకకున్న మంటను ఆర్పుకుని సేదతీరాడు. ఆంజనేయస్వామి సము ద్రంలో మునిగినప్పుడు ఆయన శరీరం నుంచి వెలువడిన ఒక స్వేదబిందువు జలకన్య నోటిలోకి ప్రవేశించడంతో ఆమె గర్భం దాలుస్తుంది. ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్ళిపోతాడు.
కొన్నిరోజుల తరువాత పాతాళరాజు మైరా వణుడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను భటులు రాజుదగ్గరకు తీసుకువెళతారు. ఈ క్రమంలోనే జలకన్య పొట్టకోసినప్పుడు ఆమె గర్భంలో ఓ వింత శిశువు కనిపిస్తాడు. ఆ శిశువు శరీరం సగ భాగం కోతిని సగభాగం చేపను పోలి ఉంటుంది. ఈవిధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువం టి ఆ జీవికి మకరధ్వజుడు అని నామకరణం చేశారు. మైరావణుడు అతన్ని ద్వారపాలకుడిగా నియమించాడు. మకరధ్వజుడు సాహసోపేత మైన యుద్ధవీరుడు.
రావణాసురుడు రాముడితో యుద్ధంచేసే సమయంలో రామలక్ష్మణులను బంధించి మైరా వణుడి కోటలో బంధించాడు. ఈ విషయం తెలు సుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను విడి పించడానికి మైరావణపురానికి వెళతాడు. అక్క డ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సి న పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలోనే మకర ధ్వజుని బలపరాక్రమాలను చూసి ఆంజనేయ స్వామి విస్మయానికి లోనై నీవు ఎవరి పుత్రుడవు ? అని అడుగుతాడు. మకరధ్వజుడు తాను హను మంతుడు పుత్రుడినని చెప్పగా ఆశ్చర్యపోయిన ఆంజనేయస్వామి తాను బ్రహ్మచారని చెప్తాడు. జరిగిన సంఘటనలన్నిటినీ కళ్లు మూసుకుని తన మనోనేత్రంతో హనుమంతుడు గుర్తుచేసుకు న్నాడు. అప్పుడే అతడికి తన స్వేద బిందువు జల కన్య నోటిలోకి పోవడం ద్వారా మకరధ్వజుడు జన్మించాడని భావించి, అతనిని ఆలింగనం చేసు కొని పరవశించిపోతాడు. మైరావణుని సంహ రించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. మకరధ్వ జుడుని పాతాళానికి అధిపతిని చేసి రామలక్ష్మణు లను తీసుకుని వెళ్ళిపోతా డు ఆంజనే యస్వామి.

Advertisement

తాజా వార్తలు

Advertisement