Friday, November 22, 2024

రామ నామ సాధనంహనుమ జీవనం

ఒకసారి హనుమంతుడు శ్రీరామచం ద్రునితో- ”దేమదృష్ట్యాతు దాసోహం
జీవదృష్ట్యాతు దంశక:
వస్తువస్తు త్వమేవాహ
మితి నిశ్చయతే మతి:!” – ”రామా!” దేహ దృష్ట్యా నేను దాసుడను, నేను జీవరూపంలో మీ అంశను. కానీ పరమార్థ దృష్టిలో చూడగా నేనూ. మీరూ ఒక్కటే” అని హనుమంతుడు శ్రీరా మునితో పలికాడు. కనుక ఆంజనేయుడు శ్రీరామునితో సమానము.
మన దేశంలో ఆంజనేయస్వామి విగ్రహాలు పలు రూపాలలో కనబడు తుంటాయి. ప్రతి పట్టణంలోనూ, గ్రామంలోనూ తప్పని సరిగా ఆంజనేయస్వా మి విగ్రహాలు పూజలందుకొంటూ కనబడ్తాయి. శనివారంనాడు ఆంజనేయ స్వామి పూజాదికంగా భావించి భక్తులు పూజలు చేస్తుంటారు. తమల పాకులతో ఆ కు పూజలు, అప్పాలు, జిల్లేడు. ఆకులతో అత్యంత నియమ నిష్టలతో భక్తులు పూజలు నిర్వహస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖమాసం బహుళ దశమి, పూర్వాభాద్రా నక్షత్రంలో ”శ్రీహనుమజ్జయంతి”ని ఘనంగా నిర్వహస్తారు.
”వైశాఖే మాసికృష్ణాయా: దశమీ మంద సంయుతా పూర్వ ప్రోష పదాయుక్తా అధవైదృత సంయుతా తస్యాం మధ్యాహ్న వేళాయా:
”జనయా మానవైసుతమ్‌’ వైశాఖ మాస, కృష్ణపక్ష, దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో నైదృతీనామ యోగం, గ్రహాలన్నీ శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యా హ్న సమయంలో కేసరి అంజనాదేవి గర్భయుక్త ఫల ఆంజనేయస్వామి జన్మించాడు. ఆ పరమ శివుడే ఆంజనాదేవి గర్భాన జన్మించాడని తెలిసి, ఆ రుద్రావతారుని చూడడానికి వెళ్లిన సప్తఋషులు వానర కుమారుని చూసి అంజనీగర్భాన ఉదయించిన ఈ బాలుడు ‘ఆంజనేయు’డని పిలువబడుతా డని సెలవిచ్చాడు. సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయుడు త్రేతా, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో నేటికి తన లీలలు చూపుతూ చిరంజీవిగా విలసిల్లుతున్నాడు.
శ్రీరాముని కరుణా సాగరంలో పునీతుడైనవాడు. హనుమంతుడు. శ్రీరామచంద్రుని మహమను లోకానికి చాటడానికి, రామసేవకు జన్మించిన కారణజన్ముడు. హనుమ శ్రీరామచంద్రుని సర్వోత్తమ దాసభక్తుడు. రామనామ సాధనం హనుమంతుని జీవనం. హనుమంతుడు వేదాధ్యయనశీలుడు, వ్యాకరణాధ్యయన సంపన్నుడు. శాస్త్రబద్ధ వాగు చ్చారణుడైన హనుమ నోట వెలువడిన వాక్కు వేద వాక్కువలే శ్రీరామునికి తోచింది.
శ్రీరాముని హనుమ ఒక వరమడిగాడు. ”రామా యణం. లోకంలో గానం చేయబడినంత కాలం నేను జీ వించాలి” అని, శ్రీరాముడు అంగీకరించగా.
”యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్‌
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతి సమత రాక్షసాంతకమ్‌”
అని హనుమతుండే స్వయంగా రామభక్తి పరాయణతను వ్యక్తం చేసాడు. తదాదిగా దేశంలో ఎక్కడ చూసినా ప్రతిచోట ప్రతి గ్రామంలో హనుమంతుని ఆలయాలు వెలసి, హనుమ స్మరణముచే సకల భూత, ప్రేత, పిశాచ, రాక్షస, బాధల నుండిరక్షిస్తున్నాడు.
”ఆంజనేయా: పూజితశ్చేతు పూజితా సర్వదేవతా” అంటే స్వామిని నిత్యం సేవింపలేనివారు కనీ సం ఒక్క హనుమజ్జయంతి నాడైనా స్వామిని సేవించిననూ సంవత్సరమంతయూ సేవించినట్లే. కను క స్వామివారి కృపకు పాత్రులయి సకల బాధల నుండి విముక్తి పొంది, సర్వ సంపదలను, సర్వకార్య సిద్ధి పొంది తరించెదరు అనుటకు ఎట్టి సందేహమూ లేదు. హనుమజ్జయంతి ద్వైత సంప్రదాయం వారికి ముఖ్యమైన పండుగ. రామనామాన్ని నిత్యం ధ్యానిస్తూ సర్వశక్తులకు ప్రతీక అయిన హనుమం తుడు శైవ, వైష్ణవ సంప్రదాయములు రెండింటికి మధ్యవర్తి. శివాతారునిగా శైవులకు రామ కార్య దురం ధరునిగా వైష్ణవులకు ఆరాధ్యుడు. శత్రుసంహారి అయిన ఆంజనేయుని ఈ శుభ తరుణంలో స్మరించి తరిద్దాం!

Advertisement

తాజా వార్తలు

Advertisement