Wednesday, November 20, 2024

అందరికి నెక్కుడైన హనుమంతుడు!

అందరికంటే ఘనుడీ
సుందర పవనాత్మజుండె, సూర్యుఁ ఫలముగా
నందుకొనె బాల్యముననే!
కందువెఱుగువాడితండె కార్యఫలదుడున్‌!

అందరికి నెక్కుడైన హనుమంతుఁడు
అందుకొనె సూర్యుఫలమని హనుమంతుఁడు

||చ1|| బల్లిదుఁడై లంక చొచ్చి బలురాకాసులఁ గొట్టి
#హల్ల కల్లోలముచేసె హనుమంతుఁడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీతకిచ్చె
అల్లదె నిలుచున్నాఁడు హనుమంతుఁడు

చ2|| దాకొని యాకె ముందర తన గుఱుతెరుఁగించి
ఆకారమటు చూపె హనుమంతుఁడు
చేకొని శిరోమణి చేతఁబట్టి జలనిధి
ఆకసాన దాఁటివచ్చె హనుమంతుఁడు

చ3|| కొంకకిట్టె సంజీవికొండ దెచ్చి రిపులకు
నంకకాఁడై నిలిచెను హనుమంతుఁడు
తెంకినే శ్రీవేంకటాద్రి దేవుని మెప్పించినాఁడు
అంకెఁగలశాపుర హనుమంతుఁడు
అన్నమయ్య కీర్తన

- Advertisement -

తాత్పర్యం: ఈ పవనాత్ముడైన #హనుమంతుడే అందరికంటే గొప్పనై నవాడు! తన చిన్ననాడే సూర్యుడిని ఫలమని అనుకొని అందుకున్నాడు!
సమయము సందర్భమును బట్టి చతురత ప్రదర్శించగలిగే ఈ హను మంతుడే కార్య సాధకుడు, మనము చేపట్టు సత్కార్యములకు ఫలము ను ప్రసాదించగలిగిన వాడునూ!
అన్నమాచార్యుల వారు హనుమంతుని వైభవమును పొగడుచూ వ్రాసిన అసంఖ్యాకమైన సంకీర్తనలలో ఇదికూడా ఒకటి. అందరికంటే గొప్పవాడు ఇతడే అని పొగుడుచున్న ఈ కీర్తన అర్థం తెలుసుకుందాం.
అందరికంటే మేటియైన వాడు ఈ హనుమంతుడు. ఎంత గొప్ప వాడంటే, తన చిన్నతనములోనే ఉదయించిన సూర్యుడిని చూచి, పం డు అనుకొని, దానిని అందిపుచ్చుకొనుటకు సూర్యమండలానికే ఎగిరి నవాడు ఈ హనుమంతుడు!
ఎంతో బలముగలవాడై, లంకలోకి చొరబడి, రాక్షసులనందరి నీ గుద్ది, లంకను కకావికలము చేసి గందరగోళమును సృష్టించినాడు ఈ హనుమంతుడు!
శ్రీరాముడు ఇచ్చిన ఉంగరమును తిన్నగా పోయి సీతాదేవికి ఇచ్చినవాడు, అదిగో చక్కగా నిలుచుని ఉన్నాడు ఈ హనుమంతు డు! అశోక వనములో చెట్టుపై దాక్కొని, తొలుత సీతాదేవికి తనపై నమ్మకము కలుగునట్లుగా తన పరిచయము తెలిపెను. ఆ పిదప సీతాసాధ్వికి తన రూపమును చూపి ఆమెకు ఎదుటపడెను ఈ హనుమంతుడు!
ఆమె ఇచ్చిన శిరోమణిని చేత పదిలముగా పట్టుకుని, ఆకాశ ములోకి ఎగిరి, సముద్రమును దాటివచ్చి, రామునికి అందజేసి నాడు ఈ హనుమంతుడు!
ఏమాత్రమూ సంకోచించకుండా, సంజీవినీ కొండను పెక లించి చేతితో ఎత్తి పట్టుకువచ్చెను ఈ హనుమంతుడు! దుష్టులైన శత్రువుల మూకతో కలహప్రియుడై వారితో వల్ల మాలిన అల్లరి చేసినాడు ఈ #హనుమంతుడు! ఇదిగో ఈ ప్రదే శముననే ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటూ శ్రీ వేంకటేశ్వరుని మెప్పులను పొందుచున్నాడు ఈ #హనుమంతుడు! ప్రసిద్ధికె క్కినవాడై నిలిచియున్నాడు కలశాపురక్షేత్రమందున ఈ హనుమంతుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement