నేటి నుంచి ఐదురోజుల వరకు అంజనాద్రి ఆకాశగంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఈ ఐదురోజుల పాటు ఆకాశగంగ శ్రీబాలాంజనేయస్వామి, శ్రీఅంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించబడడడంతో పాటు జపాలితీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. హనుమజ్జయంతిసందర్భంగాఆకాశగంగలోనిశ్రీఅంజనాదేవి, శ్రీబాలాంజనేయ స్వామివారి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి మల్లెపూలు, రెండవరోజు తమల పాకులు, మూడవరోజు ఎర్రగన్నేరు మరియు కనకాంబరం, నాల్గవ తేదీన చామంతి మరియు చివరిరోజైన ఐదవ తేదీన సింధూరంతో అభిషేకం చేస్తారు. వేదపండితులచే శ్రీఆంజనేయ సహస్రనామార్చన, మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఆకాశగంగ వద్ద శ్రీఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. శనివారం నుంచి ఐదురోజుల పాటు హరికథ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, పురందరదాస సంకీర్తనలు, హిందూధర్మప్రచార పరిషత్ వారిచే భజన, అన్నమాచార్య ప్రాజెక్ట్ కలాకారులచే హరికథ గానం నిర్వహి స్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వి సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా నాదనీరాజనం వేదిక పై ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శ్రీహను మాన్ జననం, హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాల పై ప్రముఖ వేదపండితులచే ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement