Thursday, November 21, 2024

హనుమదుపాసన సర్వ సంపత్కరం

మన సనాతన ధర్మాలలో అనేక మంది ఉపాస్య దేవతలున్నారు. స్మార్తోపాసనలో పంచ దేవోపాసన ప్రసిద్ధమైంది. కానీ ఉపాస్య దేవతలందరిలోనూ సాకార బ్రహ్మచర్య రూపాన్ని ధరించిన వాడు హనుమంతుడు. బ్రహ్మచర్య పాలన, శత్రు నిగ్రహం, కామ విజయం, కార్య సిద్ధి తదితర విషయాల దృష్ట్యా హనుమంతుడు ప్రసిద్ధి. దాస్య భక్తికి చక్కని నిదర్శనంగా నిలిచిన హను మంతుడ్ని అంజనీ పుత్రుడు, పవనసుతుడు, రుద్రావ తార మూర్తి, కేసరీ నందనుడు, సాధు శిరోమణి, కపి శిరో మణి, భక్త శిరోమణి, పాప నాశకరుడు తదితర పేర్లతో మనం స్మరిస్తాం. రుద్రావతా రుడు కావడం చేత శంకర నందనుడయ్యాడు. కేసరికి ఔరస పుత్రుడు కావడం వల్ల కేసరి నందనుడయ్యాడు.
హనుమంతునికి పవన సుత, అంజీపుత్రుడు అనే పేర్ల రావడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది.
పుంజిక స్థల అనే అప్సరస శాపగ్రస్తురాలై కామ రూపం గల్ల దివ్యాతి దివ్యమైన వస్త్రాలను ధరించి సంచరి స్తుందట. ఆమెను వీక్షించిన వాయుదేవుడు ఆమె వైపు పురోగమించాడు. ఈ హఠత్పరిణామానికి విస్తుపోయిన పుంజికస్థల పతివ్రత అయిన తనను స్పృశించినవారె వరని గద్ధించిందట. అంతట వాయుదేవుడు దేవీ.. అలాంటిదేమీ లేదు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, అనాధ నాధుడు, కరుణామయుడైన భగవానుడు భూ భార హరణార్ధం మానవ రూపాన అవతరించనున్నా డు. ఆ పరమాత్ముని సేవ కోసం నీ పుత్రునిగా మారుతి పుట్టి విఖ్యాతుడవుతాడని చెప్పాడట. అలా హనుమంతు నికి పవన సుత, అంజనీ పుత్ర అనే పేర్లు వచ్చాయి.
అంతటి మహమాన్వితుడైన హనుమంతుడు మహా తత్వవేత్త. సనక, సనందన, సనత్కుమార, సనాతన సోదరులు నలుగులు హనుమంతుని ద్వారా రామ మంత్ర రహస్యాన్ని గ్రహంచారు. హను మదుపాసన అన్ని విధాల శ్రేయస్కరంగా పురా ణాలు చెబుతున్నాయి. ఏకాగ్రతకు, స్వచ్చతకు మారుపేరు హనుమంతుడు కావడం వల్ల ఆ స్వామి దర్శనం, పూజల వల్ల ఏకాగ్ర చిత్తం ఏర్పడి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. భూత, పిశాచ పీడా నివారణకు హనుమంతుని నామస్మరణమే పరమా వధిగా చెబుతారు. బుద్ధి, వీర, బలాదులను హనుమంతుడు తన భక్తులకు ప్రసాది స్తూంటాడు. భూత, ప్రేత, రాక్షసాదులు ఆ మహాత్ముని నామోచ్చ రణ మాత్రం చేతనే పారిపోతాయి. స్మరణం మాత్రం చేతనే సమస్త రోగాలు శాంతి స్తాయి. హనుమంతుని ఆరాధించడం వల్ల ఆయనలోని సద్గుణాలన్నీ సాధకులు, భక్తులకు లభిస్తాయి.
హనుమదోపాసన పరమోత్కృష్టమైనది. హనుమ దుపాసనకు ఏ నియమం లేదు. వయసు, కులం, మతం తేడాలు అంతకన్నా లేవు. నిష్కలమైన భక్తి విశ్వాసాలుం టే ఆ స్వామి కరుణిస్తాడు. అనుగ్రహంచి కోరినవన్నీ సమకూరుస్తాడు. అపారమైన విశ్వాసం, నిష్కల్మషమైన సేవా గుణాలే హనుమంతుని అనుగ్రహానికి కారణమవు తాయి. జీవితంలో వెంటాడే భయాలకు దూరంగా ఉం డి, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే హనమదుపా సనే మార్గం. అయితే హనుమంతుని పూజలకు మంగళ, శనివారాలు శ్రేష్టమైనవిగా పెద్దలు చెబుతారు. స్వామి మంగళప్రదుడు కావడంవల్ల మంగళవారం పూజిస్తా రు. అలాగే శని దోషాలను నివృత్తి చేసేవాడు కనుక శని వారం కొలుస్తారు. ఆయా రోజులలో స్వామిని తమల పాకులతో సేవించడం విశేషమైన ఫలితాలనిస్తుందం టారు. సింధూర వర్ణ శోభితంగా దర్శనమిచ్చే #హనుమం తుని దర్శనం, స్మరణం, కీర్తనం వల్ల సమస్త దారిద్య్రాలు పోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.
– దాసరి దుర్గా ప్రసాద్‌, 7794096169

Advertisement

తాజా వార్తలు

Advertisement