Monday, November 11, 2024

హనుమ వేదాంత తత్వం!

సాక్షాత్తు ఆ పరమశివుడే ఆంజనే యుడిగా అవతరించాడని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడి అం శతో జన్మించిన హనుమ త్రేతాయుగంలో రా ముడికి నమ్మిన బంటు. ఒకరోజు తనకు అత్యంత ప్రియుడైన అంజనీ సుతుని శ్రీరాముడు దగ్గరకు పిలిచి ”హనుమా! నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా! దేహ, జీవ, పరమాత్మలకు సమన్వయం చేస్తూ చెప్పు” అని కోరాడు. అదే శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖా మణి మారుతి ”శ్రీరామా! వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంతవరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరు వేరుగా భావించాలి. దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ, సేవిం చాలి. అన్ని భావాలను త్యజించి, శరణాగ తి పొందాలి. ఇతరులకు ఉపకారం చేస్తూ, వా రు కూడా భగవంతుని స్వరూపంగా భావించి, సేవించాలి. ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ, భగవంతుని పూజలు చేస్తూ, భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటా నికి ద్వైతం అంటారు. జీవుడు, పరమాత్మ ఒక్కరే. ఎందులోను భేదం అనేది లేదు అనే భావ నలో, ఆచరణలో చూపించ టం జ్ఞాన లేక, విజ్ఞాన లక్షణం అంటారు. ఇదే అద్వైత భావన. ”దేహ బుధ్యాతు దాసోహం, జీవ బుద్ధ్యాతు త్వదంశ:… ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతిమే నిశ్చితా మతిహ్‌.” రామా! దేహ దృష్టిలో నేను నీకు దాసుడిని. జీవ దృష్టిలో నీవు పరమాత్మ వు. నీ అంశచేత నేను జీవ స్వరూపుడను. పరమాత్మ దృష్టి లో నీవే నేను- నేనే నీవు ఈ మూడు లక్షణాలు నాలోనూ, నీలోనూ ఉన్నాయి. ఇంక భేదానికి అవకాశమే లేదు.” అని స్పష్టపరచాడు హనుమ. అంజనానందుడి స మాధానం విని పరమానంద భరితుడయ్యా డు దాశరథి. ”త్వమేవాహం, త్వమేవాహం ” అంటూ హనుమను అభినందిం చాడు శ్రీరాముడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement