Thursday, July 4, 2024

ప్రదక్షిణ ప్రియుడు హనుమ

హనుమంతున కు ప్రదక్షిణములు ఇష్టం. స్వా మియ ప్రదక్షిణముల వల న త్వరగా ప్రీతి పొందు తారని శ్రీ పరాశర సంహితలో చెప్పారు. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షి ణాలు చేస్తాం. కాని #హనుమంతుని ఆలయానికి వెళ్లిన ప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి.
”ప్రదక్షిణ నమస్కారాన్‌ సాష్టాంగాన్‌ పంచ సంఖ్యాయా” అని ఆర్ష వాక్యం.
మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది బాధ లు తొలగుటకు, అభీష్టసిద్ధికి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ఆంజనే యస్వామికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందినవారెందరో ఉన్నారు. వివాహం ఆలస్యమైన యువతులు ఆంజనేయస్వామికి రోజూ 108 ప్రదక్షిణలు చొప్పున 40 రోజులు కానీ, లక్ష ప్రదక్షిణలు కానీ చేయాలి. ఆంజనేయస్వామి ఆలయంలో కానీ, ఇంట్లో తుల సికోటలో తులసిమొక్క మొదట్లో ఆంజనేయస్వామి చిత్రపటం పెట్టుకుని రోజూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ గుణాలుకల వ్య క్తి భర్తగా లభిస్తాడని భక్తుల విశ్వాసం. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణా లకు ప్రోత్సహంచండి. నియ మాలు పాటించటం ము ఖ్యం. రోజూ ఒకేమారు 108 లేదా 54 అదీ చేయలే నివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు,

పసుపుకొమ్మలు, రు ద్రాక్షమాల, తులసిమాలలను ప్రదక్షిణల సంఖ్యను లెక్కించడానికి వాడటం మం చిది. హనుమాన్‌ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితో మా ట్లాడకూడదు. గబగబా నడవటం, పరుగులు తీయటం చేయరాదు.
ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన శ్లోకం.
శ్లో|| ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం|
తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం||
అని చదువుకొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణలు చేసి చివరిలో స్వామి కి విశేషార్చన జరిపించి, వడమాల, తమలపాకుల మాల, అప్పా ల మాల వేయాలి.
”యాకృత్తె రేభి: ప్రదక్షిణౖ శ్రీ సువర్చలా సమేత హనుమాన్‌ సుప్రితస్సుప్రసన్నో వరదో భూత్వా మనోభీష్ట సిద్ధం దదాతు” అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి.
ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్నానం, నేలపడ క, సాత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పి వా రు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహంచి వారి బాధ లు స్వామి ద్వారా తొలగునట్లు చేయాలి. హనుమ త్ప్రదక్షిణ, ధ్యానం శిలాఫలకంపై చెక్కించి ఆల యాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెల పడం పెద్దల కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement