తిరుమల, : రామభక్త హనుమాన్ పుట్టింది.. సూర్యబింబాన్ని పండుగా భ్రమించి పట్టు కునేందుకు బాల హనుమ లంఘించినదీ తిరుమల సప్తగిరులలో ఒకటైన అంజ నాద్రినుంచేనని టీటీడీ పండిత కమిటీ నిర్ధారించింది. పౌరా ణిక, వాజ్ఞ ్మయ, శాసన, భౌగోళిక ప్రమా ణాలతో ఈ విష యాన్ని నిరూ పించామని పేర్కొంటూ పండిత కమిటీ తయా రు చేసిన నివేదికను శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్క రించుకుని బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ మాట్లాడుతూ శ్రీరాముని జన్మస్థానం అయోధ్య అని, ఇకముందు రామభక్తుడైన హనుమంతుని జన్మస్థానం తిరుమలగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. టీటీడీ ఈ విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించిందని, తాను హనుమంతుడి భక్తుడినని, ఈ విషయం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. హను మంతుని జన్మస్థలాన్ని నిర్ధారించేందుకు పండితుల కమిటీ లోతుగా పరిశోధించిందని, ఇలాంటి విష యాల్లో ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళ నాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా తనకు బాగా తెలుస న్నారు. నాలుగు నెలల పాటు అవిశ్రాం తంగా శ్రమించిన పండితుల కమిటీని ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు.
ఇది భగవత్ సంకల్పమే:టీటీడీ ఈవో
భగవత్ సంకల్పంతోనే శ్రీరామనవమి నాడు హను మంతుని జన్మస్థానం తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. పండితులతో కూడిన కమిటి, పౌరాణిక, వాజ్ఞ ్మయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి నిర్ధారించిందని వెల్లడించారు. ఆధారాలతో కూడిన నివేదికను మీడియాకు విడుదల చేశామని, టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచా మని వివరించారు. త్వరలో పుస్తక రూపంలోకి తీసుకు వస్తామని తెలిపారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని హనుమంతుని జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని కూడా శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండవచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్ళి సుగ్రీవునికి సహాయం చేసినట్టు భావించవచ్చని తెలియజేశారు. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో హనుమంతుడు జన్మించినట్లుగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు.
చర్చించాక ఆలయ నిర్మాణం
ప్రస్తుత నివేదిక పై టీటీడీ బోర్డులో చర్చిస్తామని, ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో, దేవాదాయ శాఖ అధికా రులతో చర్చించి హనుమంతుడు జన్మించిన స్థానంలో ఆలయం నిర్మించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవి ద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర్‌శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామ కృష్ణ, ఆచార్య శంకరనా రాయణ, ఇస్రో శాస్త్రవేత్త రెెమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డిప్యూటి డైరెక్టర్ విజయ్‌కుమార్, కన్వీనర్ టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ళ విభీషణశర్మను ఈవో అభినందించారు.
నాలుగు నెలల పరిశోధన : అదనపు ఈవో ధర్మారెడ్డి
పండితుల కమిటీ నాలుగు నెలల పాటు విస్తృతంగా పరిశోధించి, బలమైన ఆధారాలు సేకరించిందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారిని అంతమెందించాలని శ్రీవారిని ప్రార్ధిస్తూ ఏడాది క్రితం యోగవాశిష్టం, సుందరకాండ పారా యణం ప్రారంభించామని చెప్పారు. సుందరకాండ పారాయణం జరుగుతుండగానే హనుమంతుని జన్మస్థానం తిరుమలగా ఆధారాలతో సహా నిరూపణ కావడం భగవంతుని కృప అన్నారు.
ఎన్నో ఆధారాలతో నిరూపణ: ఆచార్య మురళీధరశర్మ
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర్‌శర్మ మాట్లాడుతూ, శ్రీమద్రామాయణంలోని సుందరకాండలో, అనేక పురాణాల్లో, వేంకటాచల మహత్మ్యంలో ఎన్నో కావ్యా ల్లో హనుమంతుని జన్మవృత్తాంతం చాలా చక్కగా వర్ణించారన్నారు. సుందరకాండలో తన జన్మ వృత్తాంతాన్ని హనుమంతుడే స్వయంగా సీతాదేవికి తెెలిపారని చెప్పారు. అంజనాదేవికి వాయుదేవుని వలన తాను జన్మించినట్లు హనుమంతుడు తెలిపారన్నారు. మాతంగ మహర్షి చెప్పిన విధంగా అంజనాదేవి వేంక టాచలానికి విచ్చేయడం, అక్కడ తపస్సు చేసుకోవడం, ఆంజనేస్వామికి జన్మనివ్వడం, తదనుగుణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరురావడం, బాలాం జనేయస్వామి సూర్యదేవుని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మరల చూడడం, వానర వీరులు వైెకుంఠ గుహలో ప్రవేశించడం …. ఇలా అనేక విష యాలు వేంకటాచల మహత్మ్యం వలన తెలుస్తున్నా యన్నారు. వాజ్మయ, శాసన ఆదారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబరా మాయణం, శ్రీవేదాంత దేశికులు, శ్రీతాళ్ళపాక అన్న మాచార్యుల వారు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజ నాద్రిగా అభివర్ణించారని చెప్పారు. స్టాటన్ అనే అధికారి క్రీ||శ 1800 సంవత్సరంలో తిరుమలగుడి గురించిన విషయాలను సంకలనం చేసి – సవాల్-ఎ జవాబ్ అనే పుస్తకాన్ని రాశారని, ఆ పుస్తకంలో అంజనాద్రి అని పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు కావడం వల్ల అంజనాద్రి అన్నారని రాసినట్లు తెలిపారు. వేంకటాచల అనే మహత్మ్యం అనే గ్రంధం ప్రమాణమే అని చెప్పటానికి రెండు శిలా శాసనాలు తిరుమల గుడిలో దొరుకుతున్నాయని, ముెెదటి శాశనం 1491 జూన్ 27 వ తేదీకి చెందినదని, రెండవ శాసనం 1545 మార్చి 6 వ తేదీకి చెందినదని చెప్పారు. అలాగే శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం దీన్ని తెలియ జేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సిీఈవో సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణా మూర్తి, ఎస్విీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ళ విభీషణశర్మ పాల్గొన్నారు.
హనుమ పుట్టింది అంజనాద్రి పైనే……
Advertisement
తాజా వార్తలు
Advertisement