Sunday, November 17, 2024

పండుగల పరమార్ధం

ఏసారం లేకుండా, నిస్సారంగా బ్రతక డం మానవ జన్మ లక్ష్యం కాదు. కా రాదు. కాబట్టి ”జీవం” అన్ని విధాలా ఉట్టిపడేలా, ”క్రియాశీలకం”గా మనల్ని మనం తయారుచేసుకోవటమే ”జీవ తత్వంస‌స‌. ఇక జీవన తత్వం. జీవ తత్వాన్ని సఫలం చేసుకోవడానికి, ఏమి చేయాలో, ఏవిధంగా చేయాలో తెలిపేది జీవన తత్వం. ఆ విధానంలో అన్నింటినీ ఆచరిస్తూ, మన సా, వాచా, కర్మణా ఎలా జీవించాలో, జీవనం ఎలా కొనసాగించాలో తెలిపేది ”జీవన తత్వం.స‌స‌ ఇప్పుడు జీవిత తత్వం. జీవిత కారణా లను, కారకాలను, జీవిత సత్యాలను, ధర్మా లను, పధాన్ని, లక్ష్యాన్ని, గమనాన్ని, గమ్యా న్ని, మూల అర్ధాన్ని నిర్దేశించేది జీవిత తత్వం. ఆచార వ్యవహారాల రూపంలో, విధులు, నియమాల రూపంలో, పై మూడు తత్వాల మూలం కలగలిసేలా, మూ డూ సమన్వయం కావడానికి దోహదపడతాయి పండుగలు. సాంఘిక, సామాజిక, నైతిక, నియమాలు సూచిస్తూ, సమిష్టి తత్వాన్ని ప్రోది చేస్తాయి పండుగలు. కుటుంబ బం ధాలు, సామాజిక అనుబంధాలు అలవాటు అయ్యేలా చేస్తాయి. వైయక్తిక ధర్మాలు అలవడేలా, సంబంధాలు అనుబం ధాలు బలపడేలా పండుగలు పరోక్షంగా ఉపయోగపడతాయి.
భగవంతుని యందు రతి గలవారు భారతీయులు. భారతీ యులకు భౌతికం ఆధ్యాత్మికాలు భిన్నమైనవి కావు. భిన్నమైన వని భావించరు. అయినా భౌతిక, మానసిక తత్వాలను, ఆధ్యా త్మిక తత్వంతో అన్వయింప చేసుకోడానికి పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆచరణకు అవసరమైన సాధన చేసేందుకు సహా య పడతాయి. పరోక్షంగా మనం పూర్తి సంసిద్ధత పొందడానికి పండు గలు/ సహకారం అందిస్తాయి. సాంఘిక, సామాజిక, వైజ్ఞానిక, విజ్ఞానాత్మక, నైతిక, ధార్మిక, ఆధ్యా త్మిక గుణగణాలను విలువలను పోషించుకోడానికి అవకాశమిస్తాయి పండుగలు.
నిత్య నైమిత్తిక కర్మలు, విహత కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించేందుకు, ఏవిధంగా వీలవుతుందో తెలి యజేస్తాయి పండుగలు. దేహ, మనో, బుద్ధి, హృదయ, ఆత్మ వికాసానికి తోడ్పడేవి పండుగలు. చింతనా మార్గాన్ని అన్వేషింప చేయడానికి ఉపయుక్తమవుతాయి పండుగలు.
దైవ రుణం, ఋషి రుణం, పితృరుణం, భూత రుణం, మనుష్య రుణం తీర్చుకునేందుకు చేసే పనులే పంచ మహాయజ్ఞాలు. పంచ మహా యజ్ఞాలను నిర్వర్తించేందుకు పండుగలు అవకాశం కలిగిస్తాయి. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శింపచేసే సమోన్నత దృష్టిని అలవరింప చేస్తాయి. సత్కర్మలను ఆచరించాలని గుర్తు చేస్తాయి. హెచ్చరిస్తాయి. లౌకికమైన జ్ఞానాన్ని కొంచెం పక్కకు నెట్టి, ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని సాధించే సాధనా సంపత్తిని అలవాటు చేసేవి పండుగలు. అందుకు తగిన విధానాలను, పద్ధతులను సూచించేవి, నిర్దేశించేవి పండుగలు. మానవుల మనస్సులో గూడు కట్టుకుని ఉన్న తమస్సును తొలగించటానికి, అవసరమైన అభ్యాసాన్ని ఓ క్రమమైన పద్ధతిలో చేసేందుకు వీలు కలిగిస్తాయి పండుగలు. లౌకిక వాసనలను లోకేశ్వర వాసనలుగా, భవ బంధాలను భగవంతునితో అనుబంధంగా మార్చు కునే అవకాశం యిస్తాయి పండుగలు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రతి కర్మా భగవత్కర్మే. కర్మ లను భగవత్‌ ప్రీత్యర్థం చేసేందుకు పండుగలు తోడ్పడతాయి. దైవప్రీతి, పాపభీతి, సంఘనీతిని ఆచరణలో ప్రస్ఫుటింప చేయడానికి పండుగలు దోహదపడతాయి. మనం శ్రేయో మార్గంలో పురోగమిస్తున్నామో లేదో పరిశీలన చేసుకునేందుకు మార్గదర్శనం చేస్తాయి పండుగలు.
పండుగలు ఆరాధనకు, ఆత్మతత్వ అన్వేషణకు, ధర్మాచరణకు, దైవ విశ్వాసం ధృడపడేందుకు దారి చూపు తాయి. పండుగలలో చేసే సాధనలు మన లను స్వార్ధ రహితులుగా పరిణామం చెందేందుకు దోహదపడతాయి. పరోప కార ప్రవృత్తి పెరిగేలా చేస్తాయి. పదార్ధ భావనలు విడనాడేలా చేస్తాయి. పర అర్ధా లు తెలుసుకునే దశగా, పరార్ధ పరిశీలనా దిశలో, పరమార్ధాన్ని ఆలోచింపచేస్తా యి. జీవన చింతల నుంచి, దైవ చింతన వైపుకు మనసును మరలించే అవకాశం పండుగలు కలుగ చేస్తాయి పండుగలు.
పర్వదినాలలో ఒక్కో పండుగ/పర్వదినం ఒక్కో రకంగా ఉం టుంది. శ్రీరాముడు, శ్రీక్రిష్ణుడు లాంటి అవతార మూర్తుల, మహా పురు షుల జన్మదినాలు. శ్రీ రామనవమి, క్రిష్ణాష్టమి మొదలైనవి ఈ కోవకు చెందినవి.
రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు, దుష్టశక్తులు సంహరింపబడిన దినాలు. దసరా దీపావళి లాంటివి. ఉపవాసాలు, జాగరణలు, ఇత్యాది ఉపాసనకు సంబంధించినవి మరికొన్ని. శివరాత్రి, ముక్కోటి ఏకాదశి లాంటివి. ఇక సాధనా పరమమైనవి, ఆధ్యాత్మికతా అభ్యాసాన్ని ఉద్దీపన చేసేవి, ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలిపేవి, ధర్మాచరణకు సంబంధించినవి యింకొన్ని.
విషయపరంగా ఒక్కో పండగ/ పర్వదినం ఒక్కో అంశానికి సంబం ధించినదై ఉంటుంది.
పండుగ రోజులలో చేసే అర్చనలు, ఆరాధనలు, పూజలు, పవిత్ర కర్మలు, దానాలు, ధర్మాలు, యితరత్ర విధులు ఆది భౌతికంగా, ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని మనం సంసిద్ధతను తెచ్చుకునేందుకు దోహదం చేస్తాయి. ఆరోగ్యపరంగా, ఆనంద పరంగా, సామాజిక, ధార్మిక పరంగా ఎంతో ప్రయోజనకరమైనవి. ప్రయోజనాలను సమకూర్చేవి పండుగలు.
అయితే ప్రతి పండుగకు ఒక్కో సంప్రదాయం, నేపధ్యం ఉంటుంది. బాహ్యార్ధం ఉంటుంది. ఐహకమైన లాభం, ప్రభావం ఉంటుంది. నిగూఢమైన అంతరార్ధమూ దాగుంటుంది. ఆత్మ తత్వ పరమార్ధమూ నిబిడీకృతమై ఉంటుంది. అంతరార్ధాన్ని గ్రహించడం, తదనుగుణంగా సాధనతో ఆచరణా త్మకం చేసుకోవటం ఎంతైనా అవసరం. జీవితా లను ఫలవంతం చేసుకోవడం అత్యవసరం.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement