Thursday, November 21, 2024

శ్రీసాయినాథుని మార్గనిర్దేశనం

సబ్‌కా మాలిక్‌ ఏక్‌… అంటే అందరి ప్రభువు ఒక్కరే అని గొప్ప సిద్ధాంతం ప్రబోధించారు షిరిడీ సాయిబాబా. ఆయన్ని పూజించడానికి…ఎలాంటి నియమాలు అవసరంలేదు. నిర్మలమైన మనస్సుతో పూజించినవారిని కరుణిస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. సాయిబాబాను గురువు, సాధువు, ఫకీరు అని ప్రియంగా పిలుచుకుంటారు భక్తులు. కుల, మతాలకతీతంగా అందరూ సమానులు అని ప్రబో ధించారు సాయినాథుడు. అందుకే ఆయన్ను ము స్లింలు, హిందువులు పూజిస్తారు. మసీదులో నివ సించిన సాయినాథుడు గుడిలో సమాధి అవడమే అందుకు నిదర్శనం.
సాయినాథుడు గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి పొలిమేరల్లో జల్లించి ఊరి నుంచి కలరా వ్యాధి ని తరిమివేసారు. నీటితో దీపాలు వెలిగించారు. భక్తు ల పాపకర్మలను తానే స్వయంగా కడిగేసేవారు. తన ను ఆశ్రయించిన భక్తులను ఎల్లవేళలా కాపాడే వారు. కోర్కెలు తీర్చేవారు. తన చెంతకు వచ్చినవారికి వారి కి ఇష్టమైన దేవుడి రూపంలో కనిపించేవారు. ఇలా ఎన్నో… ఎన్నెన్నో మహిమలను చూపేవారు. అయి నా కూడా సద్గురు సాయి తాను దైవం అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. తనను దైవంగా కొలిచే భక్తులతో ఆయన ఎప్పుడూ తాను దైవాన్ని కాదని, తనను కేవ లం గురువుగానే భావించాలని చెప్పేవారు. ఈ జగ త్తులో దైవానికి మించినది ఏదీ లేదని భక్తులకు బోధించేవారు సాయినాథులు. అయినా ఆయనతో కలిసి జీవించినవారు సాయిబాబా సాక్షాత్తు దైవ స్వరూపులని, ఆయన సద్గురువు మాత్రమేకాదని ఆయన లీలలు సాక్షాత్తు చూశామని విశ్వసించారు.
అంతేకాదు భగవంతుడిని ఏవిధంగా ఆరాధిం చాలి. భగవంతుడి పట్ల వినయ విధేయులుగా ఎలా ఉండాలో తానే స్వయంగా ఆచరించి భక్తులకు మార్గ నిర్దేశం చేశారు సాయిబాబా. సాయిబాబా తన భక్తుల కు రెండు నియమాలు తప్పకుండా పాటించాలని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అవి శ్రద్ధ- సబూరి. ఈ రెండు లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవరుచుకో వాలని సూచించా రు. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, దీక్ష అని, సబూరి అంటే ఓర్పు, సాధన అని సందేశమి చ్చారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా శ్రద్ధ, సబూ రి వుంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారని చెప్పే వారు. భగవంతుడు సృష్టించిన జీవరాశులన్నీ సమానమే అని చెప్పడానికి, ప్రతి దానిలో తాను ఉన్నానని చాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనా లు చూపించేవారు. ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష లే దా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొక రు రారు. కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువు లు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తరిమి వేయకండి. మన వద్దకు వచ్చినవారిని ప్రేమతో ఆద రించాలి. జంతువులు అయినా అంతే. తోటి వ్యక్తుల ను, జంతుజాలాన్ని ఆదరించడం వల్ల మన సంపద లు ఏమీ కరిగిపోవు. దాహార్తితో వచ్చినవారికి తాగ డానికి నీళ్లు ఇచ్చి దాహం తీర్చాలి. ఆకలితో ఉన్నవా రికి కడుపునిండా అన్నం పెట్టాలి. కట్టుకోడానికి బట్ట లు లేక బాధపడేవారికి దుస్తులు ఇచ్చి ఆదుకో. అవస రమైనవారికి నీ ఇంటి వసారాలో విశ్రాంతి తీసుకో మని చెప్పు. ఇలా మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే. భగవంతుడు సంతోషిస్తాడు. అప్పుడు ను వ్వు భగవంతుడికి దగ్గర అయినట్లే. ఇలా సాయినా థుని బోధనలు ఎంతో ప్రబోధాత్మకంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement