Friday, November 22, 2024

దుర్గాతత్వం మార్గదర్శకం

దుర్గం అంటే శరీరం. ఈ శరీరంలో ఉండే శక్తే దుర్గ. అదే ప్రాణశక్తి. ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం వలన మాత్రమే విశ్వమంతా నిలచి ఉంది. దుర్గాదేవి దశ భుజాలు, పంచప్రాణ, పంచోపప్రాణాలు దశ ప్రాణాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం. దాన్ని లొంగదీసు కోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టి కార్యమే భంగపడు తుంది. అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక. క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం. ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకు చేసే పూజ ప్రాణాహుతులను సమర్పిం చడమే. మనలో అట్టి దుర్గాతత్వాన్ని పొందించుకోవటమే ప్రాణాయామం. ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం. ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆ శక్తి ఉండాలి కానీ దివాంధం గుడ్ల గూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు. దాని సూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూ బను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరోపక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక. అది అత్యవసరం. అసత్‌ జ్ఞానం వీడి సత్‌ జ్ఞానంతో ఉండాలనే దానికి సంకేతం. ఆవిడ వాహనం హంస. ఇది నీటిని వీడి పాల ను మాత్రమే స్వీకరిస్తుంది. ఇంకోపక్క నుండే కుమారస్వామి దేవ సేనాని, ఆయన వీరత్వానికి ప్రతీక. వీరత్వంతో ఆత్మ రాజ్యస్థాపన చేయాలి. నెమలి లైంగిక సం బంధంలేని బ్ర#హ్మచర్యానికి గుర్తు. అట్టి బ్రహ్మ చర్య మందుం డుటచే నెమలికన్ను వంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ధి గణపతి స్థానం. అకా రణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది. సిద్ధికి భంగం కలుగకుండా ఉండా లంటే ఆ ఎలుకను అదుపులో ఉంచు కోవాలి. ఆన్నింటికీ అధిష్టాతగా ఉన్న శివుడు త్యాగ మునకు, అద్వైత స్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణ వనాదం . త్రిశూలం సత్వ రజ స్తమో గుణాలకు గుర్తు, వృష ము అంటే ధర్మం. అదే ఆయన వాహనమైన నంది. అది నాలుగు కాళ్లపై ఉంటుంది. ఇలా పరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవిత గమ్యాన్ని సూచిస్తుంది.

సేకరణ దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement