విపరీతమైన మానసిక బాధను క్లేశము అం టారు. ఏదైనా ఒక వస్తువు మీదో, వ్యక్తి మీదో, పదవి మీదో మానవునకు కోర్కె కలిగి, అది పెరిగి వ్యామోహంగా మారి పొందలేన పుడు విపరీతమైన మానసిక బాధ కలుగుతుంది. అదే క్లేశము. కోర్కెలే క్లేశములకు కారణము.అవే పంచ క్లేశములు. అంటే ప్రాపంచిక సంబంధమైన, బుద్ధిపరమైన ఐదు దోషాలు.
మొదటిది- అవిద్యాక్లేశము- విద్య అంటే కేవ లం ప్రాపంచిక విద్య కాదు. జ్ఞానమని అర్థం. తన నిజస్వరూపమును గుర్తించుకోకుండా తాను ఒక జీవుడు అని అనుకోవటం అవిద్య. సంకు చిత భావము చేత దేహమే నేను అని భ్రమించడం. జీవునకు, దేవునకూ సంబంధములేదని భావించి మనిషి బలహనుడవుతున్నాడు. దీని నుండి బయటపడటానికి ముందు తగిన జ్ఞానాన్ని పొందాలి. అర్జు నుడు తాను తన బంధువులనూ, గురువులనూ వధించే యుద్ధం చేయను అన్నప్పుడు, కృష్ణ పరమాత్మ అర్జునునకు జీవ, బ్ర#హ్మ తత్వమును బోధించి జీవునకూ, దేవునకూ ఉన్న సంబంధం వివరించి అర్జునుని క్లేశమును పోగొట్టి కర్తవ్య నిర్వ#హణవైపు మరలించాడు క్లేశము వదలాలంటే జ్ఞానము పొందాలి.
రెండవది అభినవక్లేశము: సంసారమును, దానిని పట్టుకు ని ఉండే మనస్సును అంటి పెట్టుకొనుట అభినవ క్లేశము. సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు, స్థానము మనస్సు. దీనివల్లనే మానవుడు సంసారమునకు బంధింపబడుతు న్నాడు. ఈ బంధములకు, కష్టములకు, అవిచారములకూ, అన్నింటి కీ మూలకారణం మనస్సే అని తెలిసినా ఈ మనస్సు మాయనుండి మానవుడు బయటికిరాలేక దు:ఖములను అనుభవిస్తున్నాడు.
ఒక పసిబిడ్డ మనస్సుతో మమేకం కాడు కనుక నిరంతరం నవ్వుతూ ఆనందంగా ఉంటాడు. బిడ్డకు మంచి దుస్తులు ధరించానా, నగలు ధరించా నా అని ఏమీ తెలీదు. కేవలం ఆకలైతే ఏడ్వటం, శరీర బాధ కలిగితే ఏడ్వటం మాత్రమే తెలుసు. అంటే మాయకు లోబడని వాడన్నమాట. మాయకు లోబ డని వయస్సు. ఇలా మనసుకు లోబడక జరిగేవి జరుగుతాయని వదిలేస్తే ఈ క్లేశం నుండి తప్పించుకోవచ్చు.
మూడవది అస్థిత క్లేశము: విషయములతో కూడి నదే అస్థితక్లేశము. ప్రపంచమంతా విషయమయమే కదా! ఆవిషnయాలే మానవులకు విషసర్పాలుగా హాని చేస్తున్నాయి. బాధపెడుతున్నాయి. భయపెడుతు న్నాయి. భ్రాంతికి గురిచేస్తున్నాయి. విషయములే లే కుండిన మానవునికి విషసంబంధమైన చింతలే ఉం డవు కదా! విషయములను అనుభవించగోరి, విషా న్ని ఆనందించగోరి, విషయలోలుడై వివేకాన్ని కోల్పో యి అనేక విధములైన క్లేశములకు లోనవుతున్నాడు మానవుడు. వాటిని పొందటానికి అనేకానేక దుష్కా ర్యములు చేయనైనా వెనుకాడడు. అందుకే దీన్ని అస్థిత క్లేశము అంటున్నారు. తన ఆస్థి, అందము, ఉద్యోగము, స్థాయి మొదలైన అస్థిరమైన విషయాల పట్ల ఆసక్తికలిగి అసలైన ఆత్మ తత్వాన్ని మరువడం. విషయములలో అత్యంత నిమ గ్నుడై గర్వించుట. దీనికి ఉదా#హరణగా అజామీళుని కథ చెప్పుకోవచ్చు.
నాల్గవది రాగక్లేశము: రాగము అంటే అనేక విషయముల పై ప్రేమ, బంధం, తనదిచేసుకోవాలనే కోరిక, ఆశ పెంచుకుని, భ్రమలు కల్పించుకుని, ధన కనక వస్తు వాహనముల పట్ల విపరీతమైన ఆశలను, ఆకాంక్షలను పెంచుకుంటూ, అవి అశాశ్వతమైనవని తెలిసినా కూడా అత్యాశవలన నిరంతరం వాటికోసం తపిస్తూ అనేకానేక దు:ఖ ములకు గురికావడం. అంటే ఆస్థి పాస్తుల అభివృద్ధి కొరకు పడరాని పాట్లు పడటం. దీనికి ఉదా#హరణగా మనం ధృతరాష్ట్రుని ఉదంతం చెప్పుకోవచ్చు. తనది కాని సంపదనుకోరి, కుమారులకు రాజ్యసంప దల పట్ల ఉన్న వ్యామోహాన్ని తొలగించలేక చివరకు అందరినీ కోల్పోవడం.
ఐదవది ద్వేషక్లేశము: కేవలం తన స్వార్థం కోసం, తన ప్రయోజనం కోసం, తన లాభంకోసం మానవుడు అనేక ఆశలను పెంచుకుని శ్రమిస్తాడు. అవి నెర వేరనపుడు ఎదుటివారిపై కోపము, పగ, తన లాభమునకు అడ్డు తగిలారని కొందరిపై ద్వేషం , చివరకు దైవం మీద కూడా ద్వేషం, క్రోధం పెరిగిపోతాయి. మానవుడు తన పనుల కోసం మరొకరిని ఆశ్రయించి వారి వలన సహాయం పొందినా , ఇంకా ఇంకా ఆశించి ద్వేషము పెంచుకోడం. ఇదే ద్వేష క్లేశం.
ఈ క్లేశములకు గురైతే అశాంతితో ఆత్మ తత్వమునే మరచిపోవడం జరు గుతుంది. ఆత్మతత్వం వేరనీ తాను వేరనే భ్రమవలన అనేక విధములైన క్లేశము లు కలుగుతున్నాయి. త్యాగం, ప్రేమ, సేవాభావన కలిగి ఆనందంగా జీవించ డం నేర్చుకుంటే ఉత్తమగతులను పొందవచ్చు.
క్లేశములు – హేతువులు!
Advertisement
తాజా వార్తలు
Advertisement