Thursday, November 21, 2024

గోవత్స న్యాయము

గోవు అంటే ఏమిటో అందరికీ తెలుసు ఆవు అని. వత్సం అంటే దూ డ. గోవత్సం అంటే ఆవు దూడ.
సంతల్లో కానీ మామూలుగా కానీ పశువులను అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. అలా అమ్మే వాటిల్లో ఒకోసారి పెద్ద వాటి తో పాటు అంటే తల్లులతో పాటు చిన్న దూడలు, పాలు మరువని కూనలు కూడా ఉం టూ ఉంటాయి. అలా ఆవును లేదా గేదెను కానీ అమ్మేటప్పుడు ఆవు లేదా గేదెకు మాత్ర మే ఖరీదు కడ తారు. అంతేకానీ వాటి వెంట ఉండే దూడల కు మాత్రం ఖరీదు కట్టరు.
దూడ తల్లి అయిన ఆవు/ గేదె అమ్మకం లోనే వాటి దూడ ధర కలిసిపోయి వుంటుం ది. ప్రత్యేకంగా ఇంత అని దూడకు ధర ఉం డదు. ఇలా తనకంటూ ఎలాంటి ప్రత్యేక వ్యకి ్తత్వం లేకుండా పెద్ద వాళ్ళతో, వారి కనుసన్న ల్లో కలిసి తిరిగే వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఈ గోవత్స న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మామూలుగా ఇలాంటి వారిని అమ్మ కూచి అనో, తండ్రి చాటు కొడుకనో, తల్లి చా టు పిల్ల అనో అంటుంటారు.
బొమ్మరిల్లు సినిమా ఇలాంటిదే. హరో తండ్రి చాటు కొడుకుగా చెలామణి అవుతుం టాడు. సొంతం వ్యక్తిత్వం మరుగున పడి వుం టుంది. హరోయిన్‌ వల్ల అతనికి జ్ఞానోదయం అవడం, తండ్రికి తన పరిస్థితి ఎలాంటిదో చెప్పి మార్చడం చూశాం. అది సినిమాలో కా బట్టి ముగింపులో శుభం కార్డు పడుతుంది.
నేటికాలంలో కొంతమంది అమ్మాయి లు, అబ్బాయిలు కనిపిస్తుంటారు. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా స్వంత వ్యక్తిత్వం లేకుండా తల్లి లేదా తండ్రి చాటు బిడ్డల్లా వాళ్ళు చెప్పి నట్లు నడుచుకోవడం చూస్తుంటాం. అయితే అది మంచికి దారితీస్తే ఫరవాలేదు కానీ వా ళ్ళు చెప్పే స్వార్థపూరిత మాటలు విని అత్త మామలతో కలిసి ఉండకపోవడం. పెళ్ళి కాగానే వేరు కాపురం పెట్టి వాళ్ళకు దూరంగా ఉండ టం చూస్తున్నాం.
సొంతంగా ఆలోచించకుండా, స్వయం నిర్ణయాధికారం లేకుండా ఇతరుల మాటలు వినే అస్వతంత్రులకు ఈ గోవత్స న్యాయము సరిగ్గా సరిపోతుంది. డా. బూదరాజు రాధా కృష్ణ ”తెలుగు జాతీయాలలో ఇదే విషయా న్ని రాశారు. ”సొంత అభిప్రాయం గాని, అభి మతం గాని లేనట్లు ప్రవర్తించే మనిషే గోవ త్సం” అంటారనీ, దీనిని అచ్చ తెలుగులో ‘పెయ్య నాకుడు గాడు’ అంటారనీ, ఈవిధమై న అర్థంలో ప్రయోగిస్తుం టారని రాశారు.
ఈ న్యాయానికి ఉదాహరణగా వారు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాసి న ఒక చాటువును ఉదహరించడం విశేషం.
ఆ చాటువులో నిందా స్తుతిగా ‘అయ్య దేవర వాడు పెయ్యనాకుడు గాడు’ అని కాళే శ్వరరావుగారిని వెక్కిరించారని చెబుతారు.
ఇలా పెద్ద నాయకుల కనుసన్నల్లో తిరు గుతూ, వాళ్ళ జెండాలు మోస్తూ వాళ్ళు చెప్పి నట్లు వినడం, ఆచరించడమే కానీ, తాము చేసేది మంచా చెడా! తప్పా! ఒప్పా! ఎంత వరకు సమంజసం అనే వివేచన దృష్టి ఉండ దు. సొంతంగా ఆలోచిం చి నిర్ణయాలు తీసుకోలే ని, వివేచనా జ్ఞానం లేని వ్య క్తులను ఈ న్యాయం తో పో లుస్తారు. అలా పోల్చడం సబ బే కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement