Friday, November 22, 2024

బాసర అమ్మవారి సన్నిధిలో గవర్నర్‌ దత్తాత్రేయ

బాసర, ప్రభ న్యూస్‌ : చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారిని గురువారం హర్యానా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు పోలీసు గౌరవ వందనం స్వీకరిం చారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిద్ధిలో గవర్నర్‌చే ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమార్చ పూజలు చేయించి ఆశీర్వదించారు. ఆలయ చైర్మన్‌ శరత్‌ పాఠక్‌ గవర్నర్‌కు శాలువతో సత్కరించి అమ్మవారి ఫొటోను, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
బాసరకు హర్యానా గవర్నర్‌
చదువుల తల్లి సరస్వతీ దేవిని దర్శించుకున్న అనంతరం హర్యానా గవర్నర్‌ బాసరలోని ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ పరిపాలన అధికారి రాజేశ్వర్‌రావు గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీలో గవర్నర్‌కు యూనివర్సిటీ పరిపాలన అధికారి రాజేశ్వర్‌రావు, విద్యార్థుల తరగతి గదులు, ల్యాబ్‌లను చూపించారు. విద్యార్థులకు ఐఐఐటీలో అందిస్తున్న విద్యాబోధన గురించి గవర్నర్‌కు వివరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ నుండి ఎంతో మంది విద్యార్థులు పలు ఐటీ సంస్థల్లో కొలువులు సాధించారని తెలిపారు. వీరి వెంట ఎంపీ సోయం బాపురావు, నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, పోలీసులు, రెవెన్యూ అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement