Sunday, November 17, 2024

గౌరి ఇంటి ఆకు గోరింటాకు

గోరింటాకుకు మన సంప్రదాయంలో విశి ష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా స్త్రీల జీవన విధానంలో గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గృహంలో ఏ వేడుక జరిగినా మహళలు చేతులకు కాళ్ళకు గోరింటాకు పెట్టు కోవడం ఆనవాయితీ.
శుక్రవారం పూట లక్ష్మిదేవిని ధ్యానించి, పం డేంత వరకు చేతులకు గోరింటాకు పెట్టుకుంటే మహాలక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని, అఖం డ శుభాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు.
ఇంతటి ప్రాశస్త్యం గోరింటాకుకు ఎలా వచ్చింది? అంటే సీతమ్మ వారి వలనే వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి.
రావణుణ్ణి సంహరించిన తర్వా త, శ్రీరాముడు సీతమ్మ దగ్గరకు వస్తాడు. అప్పుడు సీతమ్మ అశోక వనంలో నేను ఉన్నపుడు, ప్రతి రోజూ నా కష్టాలను గోరింట చెట్టు కే చెప్పకునే దానిని. కాబట్టి గోరిం ట చెట్టుకు ఏదైనా చేయాలంది శ్రీ రామునితో.
ఏదైనా వరం గోరింట చెట్టును కోరుకోమంది సీతమ్మ. నాకెలాంటి వరాలు అక్కర లేదంది గోరింట చెట్టు. అయితే ఇప్పుడు నీ (సీతమ్మ) మోము, ఆనందంతో ఎలా కళకళ లాడిపోతోం దో, అలాగే యీలోకంలోని మహళలందరూ, సంతోష సౌభాగ్యాలతో ఉంటూ, కళకళలాడు తూ ఆనందంతో ఉండాలని ఆకాంక్షించింది గోరింట చెట్టు. గోరింట చెట్టు నిస్వార్థానికి సంత సించిన సీతమ్మ, గోరింటాకు కోరిక తీర్చింది. పర్యవసానంగా గోరింట చెట్టుకు ప్రార్ధించి, ఎవ రు గోరింటాకు పెట్టుకుంటారో, వారికి సకల శుభాలు, సర్వ సంపదలు, సుఖసంతోషాలు కలి గి వారి జీవితం హాయిగా సాగిపోతుందని సీత మ్మ గోరింట చెట్టును అనుగ్ర#హంచింది.
ఫలితంగా గోరింటాకుకు యింతటి గొప్ప దనం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
మరో కథ కూడా చెబుతారు. గౌరీదేవి (పార్వ తీదేవి) బాల్యంలో స్నేహతులతో, వనంలో ఆట లాడుకునే సమయంలో రజస్వల అయిందిట. ఆ రక్తపుచుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుట్టిందట. అదే గోరింట మొక్క.
ఈ వార్త గౌరీదేవి తండ్రి పర్వతరాజుకు తెలిసి ఆ వింతను చూసేందుకు సతీసమేతంగా, గోరిం ట మొక్క దగ్గరకు వెళ్తాడు.
అంతలోనే ఆ మొక్క పెద్ద చె్టటన గోరింట చెట్టు యిలా అంది. ”నేను సాక్షాత్‌ పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను. కాబట్టి నా వలన లోకానికి ఏవిధమైన ఉపయోగం ఉంటుందో చెప్పమ”ని పర్వతరాజుని అడిగింది.
అపుడు గౌరీదేవి సహజమైన బాల్య చాపల్యం తో గోరింట చెట్టు ఆకును కోస్తుంది. ఫలితంగా గౌరీదేవి చేతివేళ్లు ఎర్రబారిపోతాయి.
అది చూసిన పర్వతరాజు కూతురి చేయి కంది పోయి ఉంటుందని బాధపడతాడు.
తనకేవిధమైన బాధా లేదని, పైగా చాలా అందం గా ఉండి అలంకారంగా అగుపిస్తోందని గౌరీదేవి తండ్రికి చెబుతుంది. సం తోషించిన పర్వతరాజు యిలా చెబుతాడు.
”స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు, యిక నుండి భూలోకంలో ప్రసిద్ధమవుతుంది. తన రంగు వలన గోరిం టాకు పెట్టుకున్న చేతులకు కాళ్ళకు అందాన్ని స్తుంది. అందరూ పెట్టుకునే అలంకార వస్తువుగా గోరింటాకు గౌరవం పొందుతుంది. ఇదే గోరిం ట చెట్టు జన్మకు సార్థకత” అని పర్వతరాజు చెబు తాడు. అప్పుడు గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకు పసరుతో చేతులు కాళ్ళు అందంగా అలంకరించుకుంటారు.
అప్పుడు కుంకుమకు ఓ సందేహం కలిగింది. ఈ ఆకుతో నుదుటన కూడా బొట్టు దిద్దుకుంటే, అప్పుడు తన ప్రాధాన్యత తగ్గిపోతుందని కుంకు మ బాధపడింది. కుంకుమ గౌరీదేవికి తన బాధ చెప్పుకోగా, ‘ఈ ఆకు నుదుట దగ్గర పండదు’ అని గౌరీదేవి చెబుతుంది.
గౌరీదేవి కుంకుమకు యిచ్చిన మాట కార ణంగానే, గోరింటాకు నుదురున పండదని పెద్దలు చెబుతారు. గౌరి ఇంటి ఆకు కాబట్టి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గోరింటా కు కూడా సంవత్సరానికి ఓమారు ఆషాఢ మాసంలో పుట్టింటికి (పార్వతీదేవి దగ్గరకు) వెళ్తుందిట. ఆషాఢ మాసంలో తను పుట్టింట ఉన్నపుడు కూడా తనను తప్పక అందరూ పెట్టుకోవాలని గోరింటాకు కోరుకుందట.
ఆషాఢ మాసంలో చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు ఉండవని, సీతమ్మ గోరిం టాకు యిచ్చిన వరమే యిందుకు కారణమని పురాణాలు చెబుతున్నాయి.

– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement