సమస్త దేవతలకు నిలయమైన గోవును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని, గోమాత శరీరంలో ఏ దేవ త లుంటారోపరమశివుడు పార్వతీదేవికి ఇలా వివరిం చాడు. గోమాత నాలుగు పాదములు ఋణపితృ దేవత లు, గొలుసులు,తులసిదళములు, కాళ్ళలో సమస్త పర్వ తాలు, మారుతి కలరు. నోరు లోకేశ్వరం. నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి,కళ్ళ ల్లో సూర్యచంద్రులు, చెవుల్లో శంఖుచక్రాలు, కొమ్ముల్లో యమ,ఇంద్రులు, కంఠమున విష్ణువు, భుజమున సర స్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మ దేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉంటా యి. ఉదరమున పృధ్వీదేవి, వెన్నుభాగంలో భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు, ఉదరమున సనక, సనంద, సనత్‌కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్యకిరణములు, చర్మం ప్రజాపతి, రోమా వళి త్రిశం త్కోటి దేవతలు, పిరుదుల యందు పితరు లు, పొదుగు పుండరీకాక్షుడు, స్తనాలు, సప్తసముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదానది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమ లం,అమృతం కడుపులో, ధరణీ దేవత లు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు, గోమయంలో శ్రీమహాలక్ష్మి వున్నారు. గోపాద ధూళి సమస్త పుణ్యనదులు, తీర్థములుకన్న గొప్పది. కావున ఓ పార్వతీదేవీ! ఈ గోమ హాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతక ములు తొలగుతాయి. అమావాస్యరోజు పఠిస్తే మూడునెల ల మహాపాప ములు, నిత్యము సంధ్యవేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్ర హం కలుగుతాయి. గోవును మన స్ఫూర్తిగా పూజిం చే వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement