Friday, November 22, 2024

దేవుని లెక్క దివ్యం!

విజ్ఞాన శాస్త్రం ఎక్కడ అంతమైపోతుందో, అక్కడ ఆధ్యా త్మికం మొదలవుతుంది. విజ్ఞాన శాస్త్రపు లెక్కలకు, కొలతలకు, ఋజువులకు, సిద్ధాంతాలకు ఆధ్యాత్మికం అందదు.
ఆధ్యాత్మికం లెక్కల లోతులు చాలా గమ్మత్తుగా ఉంటా యి. లోతుకు వెళ్ళిన కొద్దీ లోతు ఎక్కువవుతుంది. అంతా తెలి సినట్టే ఉంటుంది. తెలుస్తున్న కొలదీ తెలుసుకోవాల్సింది చా లా ఉంది అనిపిస్తుంది. అందుకనే ”తెలిసేట్టు చెప్పేది సిద్ధాం తం. తెలియకపోతేనే అది వేదాంతం” అన్నారేమో ఆత్రేయ.
అవును. ఆధ్యాత్మికంలో ఎన్నో దారులు. ప్రతి దారికీ మరె న్నో మలుపులు. ఒక్కొక్క మలుపు మరో మార్గానికి దారి చూపె డుతుంది. పిల్లదారులు చిన్నదారులు ప్రతిచోట తారసపడు తుంటాయి. ఎటుపోతున్నామో తెలీదు. ఏమీ అర్ధంకాని స్థితి.
దేవుడూ అంతే! దేవుడి లెక్కలు మన లెక్కకి భిన్నంగా ఉంటాయి. దేవుడు దేనిని దేనికి కలుపుతాడో, దేనితో గుణి స్తాడో, ఎలా గణిస్తాడో, గణన చేస్తాడో ఓ పట్టాన అర్థంకాదు. దేవుని లెక్క దేవుని లెక్కే. అది దివ్యంగా ధర్మంగా ఉంటుంది.
ఇద్దరు బాటసారులు ఊరి చివరన ఉన్న చెట్టు కింద కూ ర్చున్నారు. కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చాడు. చీకటైంది. ముగ్గురుకీ బాగా ఆకలవుతోంది. మూడో వ్యక్తి తిన డానికి ఏమీ తెచ్చుకోలేదు. మొదటి వ్యక్తి దగ్గర ఐదు ఆపిల్‌ పళ్ళున్నాయి. రెండో వ్యక్తి దగ్గర మూడున్నాయి. ఇద్దరూ మూడో వ్యక్తితో ”మా దగ్గర ఎనిమిది పళ్ళున్నాయి. బాధపడకు. పళ్ళుని సమా నంగా కోసుకుని తిందాం” అన్నారు. హమ్మయ్య అనుకున్నా డు మూడో వ్యక్తి. ఒక్కొక్క పండునీ సమానంగా మూడు ముక్కలు కోసారు. మొత్తం ఇరవై నాలుగు ముక్కలయ్యాయి. ముగ్గురూ సమానంగా తిని పడుకున్నారు. తెల్లవారింది. రాత్రి తనని ఆదరించినందుకు తన దగ్గరున్న ఎనిమిది రూపాయి నాణాల్ని యిచ్చి యిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడే అసలు కథ మొదలైంది. ఆ ఎనిమిది రూపాయి ల్ని ఇద్దరు తీసుకోవాలి. ఎలా పంచుకోవాలి? ఎంతెంత తీసుకో వాలి? ఇద్దరి దగ్గర ఉన్న పళ్ళని సమానంగా ముక్కలు కోసుకు ని సమానంగా తిన్నాం కాబట్టి , అతడిచ్చిన ఎనిమిది రూపా యల్ని సమానంగా తీసుకుందాం అన్నాడు మూడు పళ్ళు యిచ్చిన వ్యక్తి. అదెలా? నేను ఐదు పళ్ళు యిచ్చాను కాబట్టి, ఇచ్చిన నిష్పత్తిలోనే రూపాయల్ని పంచుకోవాలి అన్నాడు ఐదు పళ్ళు యిచ్చిన వ్యక్తి. ససేమిరా వీల్లేదు. ఆకలిని సమానం గా పంచుకున్నాం. ఆదాయాన్ని కూడా సమంగానే పంచుకో వాలి. ఇద్దరం చెరో నాలుగు రూపాయలు తీసుకుందాం అన్నాడు మూడు పళ్ళు ఇచ్చిన వ్యక్తి. నేను ఎక్కువ పళ్ళు యిచ్చాను కాబట్టి నేను ఎక్కువ తీసుకోవాలి. నేను ఐదు, నువ్వు మూడు తీసుకోవటం న్యాయం. వ్యవహారం ముదిరి వివాదం గా మారింది. ఊరిపెద్ద దగ్గరకు వెళ్ళారు. అంతా చెప్పారు.
ఊరి పెద్ద ధర్మం ప్రకారం తీర్పు చెప్పే నైజం కలవాడు. ఎవరి వాదన వింటే వారి వాదనే సబబు అనిపిస్తోంది. తొంద రపడి తీర్పు చెప్పకూడదనుకొని, రేపు ఉదయం రండి ఆలో చించి చెబుతాను అని ఇద్దరినీ పంపివేసాడు. తీర్పు గురించి తీవ్రంగా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కలలో భగవంతుడు కనిపించాడు. ‘తీర్పు ఎలా చెప్పబోతున్నావు’ అని అడిగాడు. అప్పుడు ఊరి పెద్ద దేవుడితో యిలా చెప్పాడు. ఐదు పళ్ళు యిచ్చిన వ్యక్తిదే ధర్మం అనిపిస్తోంది. ఐదు పళ్ళు యిచ్చిన వ్యక్తి ఐదు రూపాయిలు, మూడుపళ్ళు యిచ్చిన వ్యక్తి మూడు రూపాయిలు తీసుకోవడమే ధర్మం. కాబట్టి ఒకరు ఐదు, మరొకరు మూడు రూపాయిలు తీసుకోమని తీర్పు చెబు తానని చెప్పాడు. ఆ మాటలు విన్న దేవుడు గొల్లున నవ్వాడు. ఊరిపెద్ద, తీర్పులో తప్పు ఉంటే చెప్పమని దేవుడిని అడిగా డు. దేవుడు చెప్పటం మొదలుపెట్టాడు.
”అదేం తీర్పయ్యా? వాళ్ళిద్దరి వాదనా తప్పే. నీ తీర్పూ తప్పే. తప్పెలాగో చెబుతా విను. ఎనిమిది పళ్ళనూ సమానం గా కోసి, ముగ్గురూ సమానంగా తిన్నారు. అంటే ఒక్కొక్కరూ ఎనిమిదేసి ముక్కలు తిన్నారు. నిజానికి ఐదు పళ్ళు తెచ్చిన వ్యక్తివి పది##హను ముక్కలు. అలాగే రెండో వ్యక్తివి తొమ్మిది ముక్కలు. అంటే తను తెచ్చిన వాటిలో ఏడు ముక్కలు త్యాగం చేసాడు మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఎనిమిది ముక్కలు తాను తినేసి ఒక ముక్కనే త్యాగం చేసాడు. ఇచ్చిన నిష్పత్తిలోనే వచ్చి నవీ తీసుకోవాలి కదా! కాబట్టి మొదటి వ్యక్తి ఏడు రూపాయ లు, రెండో వ్యక్తి ఒక్క రూపాయి తీసుకోవాలి. అదీ ధర్మ బద్ధం అని చెప్పి అంతర్ధానమయ్యాడు దేవుడు. ఊరి పెద్దకు దేవుడి చెప్పిన తీర్పు విలక్షణమైన దివ్యమైన తీర్పు అనిపించింది. దేవుడు చెప్పినట్టే మర్నాడు తీర్పు చెప్పాడు. అదీ దేవుడి లెక్క. అలా ఉంటుంది దేవుడి లెక్క. అదే దేవుని ప్రత్యేకత.

Advertisement

తాజా వార్తలు

Advertisement