Monday, November 25, 2024

భగవంతుని…కృపాకారకాలు!


వేటగాడు ధర్మకి –
దైవ భక్తి ఎలా వచ్చింది?
ధ్రువుడు పరిపక్వత స్థితికి ఎలా చేరాడు?
గజేంద్రుడికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది?
కుబ్జకు అంత బా#హ్య సౌందర్యం ఎలా వచ్చింది?
సుదాముడు అంత ధనవంతుడు ఎలా అయ్యాడు?
విదురుడికి గొప్ప వంశం ఎక్కడిది?
ఉగ్రసేన మహారాజుకి గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
ఇలా ధర్మపరులు, కారణజన్ములు నడయాడి తరించిన భూమి మనది. వీరందరు సర్వకాల సర్వావస్థల యందు ఆ భగవం తుడినే నమ్ముకుని జీవించారు. ఆ మాధవుడు కృపా కటాక్షాలను పొందగలిగారు. మాధవుడు బాహ్య ఆర్భాటాలకు పొంగిపోడు. నిజమైన భక్తికి సేవకు మాత్రమే సంతోషిస్తాడు. కానీ మన భౌతిక విషయాలు, అర్హతలను చూసి కాదు కదా!
భగవంతుడు ఎప్పుడూ కూడా ఎటువంటి తారతమ్యములను చూపించడు. వర్ణం, కులం, మతం, జాతి, శరీ రం, ధనం, పేదరికం… ఇవేవీ కూడా భగవంతుని కృపకు కారణము కాదు. కేవలం ధర్మాచరణ, భక్తితో చేసే సేవ మాత్రమే మనకి భగవంతుని కృపను అందించగల వు. ఈ ప్రపంచంలో ఎంతోమంది మనల్ని ఈ సత్యం నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తు న్నారు. మనం వాళ్ల మాయలో పడకుండా… పైన ఉదహరించుకున్న ఆదర్శమూర్తుల్లాంటి వారి జీవనాలను శ్రద్ధగా అవలోకించి… వా రు చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.
భగవంతున్ని ఆశ్రయిద్దాం. ఆయన కృపను పొందుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement