Tuesday, November 26, 2024

సృష్టిలో పరమాత్మ ఔదార్యం!

భగవంతుని దొంగ తను చేసే పని అంటే దొంగతనము విజయవం తం కావాలని ప్రార్థిస్తాడు. దొర తన సంపదను కాపాడమని ప్రార్థిస్తా డు. భగవంతుడు ఇద్దరి కోరిక తీరుస్తాడు. దొంగతనం విజయవం తం చేస్తాడు. దొంగతనానికి శిక్ష వేస్తాడు. దొర సంపద కాపాడతాడు. ఆ సంపదతో దానధర్మాలు చేయిస్తాడు. అంటే మన కోరిక తీర్చటం ఔదార్యమే. దొంగ తప్పు కోరినందుకు, అది తప్పు అని తెలియటా నికి శిక్ష వేయడం ఔదార్యమే. ఇది సృష్టిలో పరమాత్మ చూపించే ఔదార్యము. పరమాత్మ నామము, పరమాత్మ రూపము, పరమాత్మ వాహనములు, ఆయుధములు, అనంత కళ్యాణ గుణము లు, అవతారములు ఇట్లు పరమాత్మకు సంబంధించిన వాటిని వేటిని స్మరించినా అశుభములు తొలగి శుభాలు కలుగుతాయి. ఇలా ‘నామ రూపయాన ఆయుధానిన:’ అం టుంది శ్రీమ ద్భాగవతం. అసలు జీవులకు ఈ అవకాశం కలిగించినది పరమాత్మే కదా! ఇలా నాకు సంబంధించినవాటిని వేటిని స్మరించినా, దర్శించినా, కీర్తించినా అన్ని అశుభములు తొలగి శుభములు కలుగుతా యి అని పరమాత్మ జీవులకు అవకాశము కల్పించటం పరమాత్మ ఔదార్యము కదా. ఆయన నామరూపయాన అనగా వా #హనములను, ఆయుధముల ను, కథలను చెప్పుకుంటే ఆయనకేమి లాభ మో ఆలోచించండి. జీవులకైతే కీర్తి కలుగుతుంది. కీర్తితోటి ఐశ్వర్యము అనగా అధికారము, సంపదలు, పరి చారకులు, ఇతర వనరులు కలుగు తాయి. కానీ సంసారములో పడి అధికారముల కొరకు అర్రులు చా స్తూ అంతా మేమే, అంతా మాదే, మేము అనుకున్నదానిని దేనినై నా సాధించగలం అన్న అ#హంతో ఆయననే మరిచిపోతున్నాము. మన ప్రయత్నం విఫలం అయి ఆపదలు ఎదురైతే ‘అయ్యో దేవు డా!’ అని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించగానే తొలగిస్తున్నాడు. అయినా మనకు జ్ఞానము కలుగుట లేదు. తలవగానే తొలగిస్తున్నాడు కదా! ఆపదలు కలిగిన తరువాత స్మరించుటకన్నా ఆపదలు కలుగక ముం దే అంటే ప్రతిదినం అవకాశాన్ని కల్పించుకొని ఆయన ను, ఆయన కథలను స్మరిస్తే అస లు ఆపదలు రానేరావు కదా! కాని మనం ఆపదలు కలిగితేనే స్మరిస్తు న్నాము. అయినా సరే నేను ఉన్నా ను అంటూ రక్షిస్తు న్నాడు. ఇంతకంటే ఔదార్యమేమిటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement