Wednesday, November 20, 2024

గోదా రంగనాథ కళ్యాణం

మధురకు యాభై మైళ్ళ దూరాన శ్రీవిల్లిపుత్తరు అనే చిన్న ఆవాసం, నిత్యం రంగానాథుడిని సేవించే విష్ణు చిత్తుడనే పరమ భక్తుడుండేవాడు. విష్ణుచిత్తుడు లేదా పెరి యళ్వార్‌ (9వ శతాబ్దం) హందూ మతంలో వైష్ణవ సంప్ర దాయానికి అనుబంధంగా పేరుగాంచిన దక్షిణ భార తదేశంలోని పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడు. పెరి యళ్వార్‌ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. విష్ణు చిత్తుడు అంటే ”విష్ణువును మనస్సులో నిలుపు కున్న వాడు”. ఆ జన్మ బ్రహ్మచారిగా జీవించిన ఆయనకు గోదా దేవి తులసివనంలో లభించింది. ఆమెకు ”కోదై” (పూల మాల) అనే పేరు పెట్టాడు. లక్ష్మీస్వరూపమైన గోదాదేవి, తన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రభావ కారణాన శ్రీరంగనా థుడినే ఆమె భర్తగా పొందాలనుకుంది. స్వామికి సమ ర్పించే మాలలన్నీ ముందుగా తాను ధరించి, దేవ దేవునికి సమర్పింపచేస్తూ, ”ఆముక్త మాల్యద” అయింది. విషయా న్ని గమనించిన విష్ణుచిత్తుడు వేరే మాలలు సమర్పిస్తే, ఆ స్వామి గోదాదేవి ధరించి విడిచిన మాలలే కావాలన్నాడు. రంగనాథుని భర్తగా పొందేందుకు ఆమె ధనుర్మాసవ్రతం ఆచరించింది. ”ఆండాళ్‌ అని ఆమెను విష్ణుచిత్తుడు సంబో ధించాడు. అంటే ”రక్షకురాలు” అని అర్థం. సర్వం త్యజిం చి స్వామిపైనే మనసు లగ్నం చేయడానికి గోదాదేవి కాత్యాయనీ వ్రతం చేసింది.
వటపత్ర శాయి అయిన శ్రీ మహావిష్ణువును గూర్చి రోజు కొక్క పాశురం గానం చేసి, శ్రీనివాసునికై కాత్యాయనీ వ్రత మాచరించి, శ్రీరంగనాథుడిని పరిణయ మాడిన ఆండాళ్‌ కోదై, ఆముక్త మాల్యద, చోడిక్కొడుత్త నాచ్చి యార్‌ అనే పేర్లతో ప్రసిద్ధ నొందినది గోదాదేవి. ఆమె అయోనిజ. జనకునికి సీతాదేవి భూమినుండి లభించినట్లు విష్ణుచిత్తునకు గోదాదేవి దైవదత్తంగా దరిచేరింది.
కలియుగాన శ్రీ విల్లిపుత్తూరు నందు గోదాదేవి, వట పత్ర శాయిని సాక్షాత్‌ శ్రీకృష్ణునిగా ఎంచి, అక్కడి ఆల యాన్ని గోప భవనంగా భావించి తనతోపాటు తోటి చెలికత్తెలంద రినీ గోపికలుగా విశ్వసించి, ధనుర్మాసవ్రత మాచరించిం పూర్వజన్మలో సత్యభామనని తెలిసికొని, లీలామానస విగ్రహుని తలచుకుని వియోగ వ్యథతో తపించింది. ద్రవి డ భాషలో తాను రాసిన పాశురాలను గానం చేస్తూ స్వామికి ఆర్పించింది. గోదాదేవి వరాహావతారాన సముద్రంలో నుండి కోరలతో ఎత్తబడి బయటపడిన భూదేవి. పూర్వ జన్మ స్మృతితో స్వామి దివ్య లీలలను గానం చేస్తూ స్వామిని చూడాలనే తహతహతో తపించింది. రంగనాథుని ఆదేశా నుసారం విష్ణుచిత్తుడు పల్లకిలో గోదాదేవిని గైకొని, శ్రీ రంగం వెళ్ళాడు. కావేరీ స్నానమాచరించి, దేవాలయా నికి వెళ్ళి విశ్వక్సేనుడిని, గరుడాళ్వారుని దర్శించాడు. శ్రీరంగనాథుని భక్తితో స్తుతించాడు. గోదాదేవిని తనకిచ్చి వివాహం చేయాలని రంగనాథుడు… బ్ర#హ్మ శివుడు, సరస్వతి, రుద్రాణి, విష్వక్సేనుడు ఆదిగా విష్ణుచిత్తుని వద్దకు పంపారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమై పోయింది.
లక్ష్మీదేవి తొలుత భగు నందన, పాల సముద్రుని తనయ, తర్వాత వైకుంఠనాథుని దేవేరి అయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ధనుర్మాసం చివరి రోజైన భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణోత్సవాలను ప్రతీ వైష్ణవ క్షేత్రంలోను వైభవోపేతం గా నిర్వహస్తారు. తాను ఆచరించిన దాన్ని ఏటా తప్ప కుండా ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించిన కారణ జన్మురాలు గోదాదేవి. విగ్రహాన్ని, దైవమని విశ్వసించి, మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదల గలుగుతుంది. పలక గలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్‌ తల్లి నిరూపించి చూపించింది. శాశ్వతము కాని మానవజన్మ ఎత్తినా, సహజమైన ప్రాపంచిక ప్రలోభాలకు లోనుకాకుండా, జగద్రక్షకుడైన జగన్నాథుని తన హృద య పీఠంలో నిలుపుకొని ఆయన దివ్య చరితాన్ని, మహత్తు ను తన పాశురాల ద్వారా లోకానికి అందించి, తాను కోరు కున్న రంగనాథుని అంకితమై, ఆయనలో లీనమైన పుణ్య మూర్తి గోదాదేవి.
రంగనాథుడి ఆజ్ఞ మేరకే వివిధాలంకార విభూషితుడైన శ్రీరంగనాథునికి, సర్వా లంకార శోభితయైన గోదాదేవికి జరిగిన వివాహం నిర్మల భక్తితో సాధించ లేనిది ఏదీ ఉండదని నిరూపణ గావిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement