Monday, September 16, 2024

సంతోషానికి అధిష్ఠాన దేవత సంతోషిమాత!

సంతోషమే సగం బలమన్నారు పెద్దలు. ఎటువంటి కార్యాన్నయినా సంతోషంగా ప్రా రంభిస్తే సగం విజయం చేకూరినట్టేనని కూడా చెప్పారు. సంతోషం సమస్త సమస్యలకు విరుగు డుగా పనిచేస్తుంది. అది ఆరోగ్యంగా ఉంచుతుం ది.. ఆయుష్షు పెంచుతుంది. కష్ట నష్టాల్లో కొట్టు మిట్టాడుతున్నప్పుడు సంతోషం ఒక వరం గా కనిపిస్తుంది. పన్నీటి జల్లై పలకరిస్తుంది. అలాం టి సంతోషాన్ని అందించడం కోసం అధి ష్ఠాన దేవతగా అవతరించిన అమ్మవారే సంతోషిమాత.
సంతోషిమాత సాక్షాత్తు వినాయకుడి మాన స పుత్రిక. ఒక రోజున శివుడి మానస పుత్రిక అయిన నాగదేవత, వినాయకుడికి రక్షాబంధనం కడుతూ ఉంటే, ఆయన ఇద్దరు కుమారులైన లాభ, క్షేమాలు తమ చేతికి కూడా రక్షాకంకణం కట్టమని నాగదేవతను కోరారు. రక్షాబంధనాన్ని సోదరితో మాత్రమే కట్టించుకోవాలని ఆమె చెప్పడంతో, తమకి సోదరి కావాలంటూ వాళ్లు వినాయకుడి దగ్గర మారాం చేయడం మొదలుపెట్టారు. దాంతో వినాయకుడు తన నేత్రముల నుంచి ఓ బాలికను ఆవిర్భవింప జేశాడు.
చతుర్భుజాలతో… దివ్యాభరణాలతో చిరునవ్వులు చిం దిస్తూ ఆ బాలిక వినాయకుడికి నమస్కరించింది. సంతోషాన్ని ప్రసాదించడానికి అవతరించినది కావున ‘సంతోషి’ అని దేవ తలంతా కలిసి నామకరణం చేశారు. లాభ క్షేమాలనే కాకుండా, కోరిన వారికి కొంగు బంగారమై, ప్రతి ఇంటా సంతోష సిరులు కురిపించమని దేవతలంతా కోరగా ఆమె అంగీకరించింది. సంతోషిమాతను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారి దరికి కష్ట నష్టాలు చేరవని నారదమ#హర్షి చెప్పినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
రాక్షసులు, దేవతల సంగ్రామంలో పరాజయం పాలవ కుండా- ఇంద్రుడికి శచీదేవితో రక్షధారణను దేవగురువు బృ#హస్పతి చేయించాడని పురాణాలు చెప్తున్నాయి. తమకు విజయం లభించేలా, కృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు తన సోదరులతో కలిసి రక్షాబంధన ఉత్సవం నిర్వ#హంచాడని మహాభారతం చెబుతుంది.
సంతోషాన్ని పంచే మాత మన సంతోషిమాత. అన్నివేళల సంతోషంగా వుండటానికి ఈ మాతకి ముతైదువులు వ్రతం చేయడం ఒక ఆచారం. ఒక కుటుంబంలో భార్యభర్తలు మాన సికంగా, శారీరకంగా బాధపడుతున్న సమయంలో సంతోషి మాత వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితం చూసి భక్తులు నిశ్చే ష్టులైనారు. సంతోషిమాతకి భక్తులకు సంతోషాన్ని పంచటమే తెలుసు. ప్రతి శుక్రవారం సంతోషి మాతని పూజించడం మనం చేసే పనే కదా! 3, 5, 9, 11 శుక్రవారాలు కానీ ఉపవాసం ఉండి, మాత కథ చదువుకుని, సాయంత్రం ముతైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, రవిక ఇచ్చిన పుణ్యం- పురుషార్ధం. సంతోషిమాత పూజ ముఖ్యంగా ముత్తై దువతనానికి పవిత్రమైన పూజ. జగమేలు జగజ్జనని. భక్తులకు కష్టాలు దరిచేరకుండా కాపాడే అమృతవల్లి.
సంతోషిమాతకు కనకాంబరాలు, చేమంతులు, గన్నేరు పువ్వులంటే అత్యంత ప్రీతికరం. ముతైదువులు ఉపవాసం ఉం డి తన కథను చెప్పుకుంటే ఆ తల్లి ఎంతో సంతోషించి వరాలను ప్రసాదిస్తుంది. సంతోషిమాతకు పులుపు అనివార్యం. కొబ్బరి, పులుపు లేని పండ్లు, శనగపిండి, నెయ్యి, పంచదారతో చేసిన లడ్డులను నైవేద్యంగా సమర్పిస్తే సంతోషిమాత ముదమొంది అనుగ్రహిస్తుంది.
శ్రావణ పూర్ణిమ రోజు సంతోషిమాత జయంతిగా జరుపు కుంటారు. ఈ రోజున సంతోషిమాత వ్రతం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. సంతోషిమాత వ్రతా న్ని ఆచరించడం ద్వారా అన్ని శుభాలు కలుగుతాయని, ధన, కనక, వస్తు, వా#హన యోగంతోపాటు నిండు ముతైదుతనం లభిస్తుందని మ#హళలు భావిస్తారు.
మరొక కథ ప్రకారం వినాయకునికి లాభం, క్షేమం అనే ఇద్దరు కుమారులు. వీరు శ్రావణ పూర్ణిమ నాడు శంకరుని పుత్రికగా పిలువబడే నాగదేవత వద్దకు రాఖీ కట్టడానికి వెళ్ళా రు. దీంతో ఆమె రాఖీ కేవలం సోదరులకు కట్టడానికే, తనకు ధరింపజేయడం ఉచితంకాదని సున్నితంగా తిరస్కరించిం ది. దీంతో ఇరువురు సోదరులు తమకు తోడబుట్టిన ఒక చెల్లెలు కావాలని తండ్రిని కోరారు. నారదుని సలహాను పాటించి వినా యకుడు తన ఇరువురు భార్యలు రిద్ధి (బుద్ధి), సిద్ధిలను ఆదేశిం చాడు. దీంతో వారి శరీరాల నుంచి ఒక మహోజ్వల దివ్యశక్తి ఆకాశమంత ఎత్తుతో వెలువడింది. త్రిశక్తి మాతల దివ్యరూపా లు, వారి శక్తి, మ#హమాన్వితాల సమ్మేళనంతో… మహాశక్తి స్వరూపిణిగా…విజయ వరప్రదాయినిగా, మహోజ్వల మహోన్నత ప్రకాశిత దివ్య తేజస్సు నుండి శ్రీ సంతోషి మాత సర్వ జగత్తులోని అంధకారాన్ని బాపడానికి ఆవిర్భవించింది. అప్పుడు ఆమెను తమ తోడబుట్టిన చెల్లెలిగా స్వీకరించి లాభం, క్షేమం సోదరులు ఇరువురు ఆప్యాయతానురాగాలతో ఆమెచే రాఖీలు కట్టించుకున్నారు. ఇలా రాఖీ పుణ్యమా అని సంతోషిమాత జనించి సకల లోకాలకు ఆరాధ్యదేవత అయిం ది. అందరికీ అమ్మవారైంది. కోరిన వారికి కొంగు బంగారమైం ది. తన భక్తుడు అమ్మా అని పిలువగానే బిడ్డా అని చంకనెత్తుకు నే చల్లని తల్లి అయి అందరికీ సంతోషాన్ని పంచుతున్నది.
సంతోషిమాత, లక్ష్మీదేవి అవతారమని కొందరంటే… దుర్గామాతకి ప్రసన్న రూపమే సంతోషిమాత అని మరికొం దరు విశ్వసిస్తారు. ఎవరేమనుకున్నా, ఎలా కొలుచుకున్నా సం తోషిమాత సకల సంతోషాలనూ ఒసగుతూనే ఉంది. ఎందు కంటే ఆమె భక్తులందరికీ తల్లి కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement