Tuesday, November 26, 2024

పిలిస్తే పలికే దైవం… పాండురంగడు

పాండురంగడు అని తలుచుకున్న తక్షణం మన మదిలో మహారాష్ట్రలోని చంద్ర భాగ నదీ తీరాన ఉన్న పండరీపురమే గుర్తుకు వస్తుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాండురంగడు స్వయంగా వెలిశాడు. అదికూడా ఒక భక్తుడి కోరిక మేరకు. ఇక ఆ భక్తుడు చనిపోయినప్పుడు అతని ఆత్మను తనలోకి ఐక్యం చేసుకున్నాడు. ఈ విష యాన్ని స్థానికులు ప్రత్యక్షంగా చూశారు. భక్తులను అనుగ్రహంచి వారికోసం ప్రత్యక్ష మైన దేవుళ్ళ గురించి పురాణాల్లో చదివాముగానీ, కలియుగంలో భక్తుని కోసం భగవంతుడు సాక్షా త్కరించాడంటే నమ్మగలమా. చిలకలపూడిలోని కీర పండరీపురం చరిత్ర చదివాక నమ్మక తప్పదు. కృష్ణాజిల్లా, మచిలీపట్నంనకు సుమారు 2 కిమీ దూరాన చిలకలపూడి అనే చిన్న పట్టణం వుంది. అక్కడ ”కీరపండరీపురం” అనే పుణ్య స్థలంలో శ్రీ పాండు రంగస్వామి ఆలయం వుంది. ఈ క్షేత్రానికి కీర పండరీపురం అనే పేరు ఎందు కు వచ్చిందో తెలియదు. పూర్వం ఇక్కడ దోస వ్రతం చేసేవారుట. అంటే దోస విత్తులు నాటి, అవి పెరిగి కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి, భగ వంతునికి సమర్పించటం. అందుకనే కీర పండరీ పురం అనే పేరు వచ్చి వుండవచ్చునని కొందరి అభిప్రాయం. (ఉత్తర భారతదేశంలో కీరా అంటే దోసకాయలు) ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన.. వృత్తి రీత్యా స్వర్ణకారి అయిన భక్త నరసిం#హమే అంతకుముందు కాకి బంగారంతో నగలు చెయ్య టం కూడా కనిపెట్టారని అంటారు.
1889 ఏప్రిల్‌ 4వ తేదీన విశాఖపట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులకు శివుని అనుగ్రహం వల్ల జన్మించారు టేకి నరసింహం. ఈయనకి చిన్నతనం నుంచే దైవ భక్తి . పాండురంగని సేవిస్తూ ఉండేవారు.
18వ ఏట మహారాష్ట్రలోనే పండరిపురం వెళ్లి అక్కడ శ్రీ మ#హపతి గుండామహారాజ్‌ అనే గురువు వద్ద శిష్యరికం చేసాడు. నరసింహం భక్తికి ఆకర్షితుడైన మహారాజ్‌ అతనికి పాండురంగోపా సన విధానాన్ని తెలియ జేయడమే కాకుండా ఒక తులసిమాలను, శ్రీ విఠల మహామంత్రాన్ని ఉపదే శించి భక్త నరసిం#హం అనే పేరు పెట్టారు.
అటుపై భక్త నరసింహం తన స్వగ్రామాన్ని చేరు కొని నిత్యం పాండురంగ నామస్మరణ చేసేవాడు. చిలకలపూడిలో తుకారం మఠాన్ని స్థాపించి పాం డురంగనికి భజనలు, అన్న సమారాధనలు చేస్తుండేవారు. ఒకరోజు పాండురంగస్వామి భక్త నరశింహంకు కలలో కనపడి గుడి కట్టిస్తే స్వయం భువుగా అవతరిస్తారని చెప్పాడు. స్వామి ఆదేశాల మేరకు భక్త నరశిం#హం ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో గర్భగుడిని నిర్మించారు.


స్వామివారు స్వయంభూవుగా ఉద్భవిస్తారన్న వార్త జిల్లా అంతటా వ్యాపించింది. వేలాదిమంది ప్రజలు ఆలయం చుట్టూ గుమిగూడారు. దీంతో బ్రిటీష్‌ అధికారులు గర్భాలయంకు సీలు వేశారు. భక్త నరశింహం విఠల నామం జపిస్తున్నాడు. స్వామివారు ఆవిర్భవించకుంటే స్వామివారిలో లీనమైపోతానని ప్రతిజ్ఞ పూనాడు. వేలాదిమంది భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఆలయంలో పెద్ద శబ్దం వినపడింది. దీంతో అందరూ ఆత్రంగా ఆ దేవాలయం ద్వారాలు తెరిచి చూడగా …
కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన పాండురంగ డు భక్తుల సమక్షంలో ఇక్కడ వెలిశారు. గర్భ గుడిలో 3 అడుగుల ఎతైన పాండురంగడి విగ్ర #హం ఉంది. ఈ విగ్రహం అచ్చు పండరీపురంలోని విగ్రహం వలే ఉంది. ఇక అప్పటినుండి ప్రతి సం వ త్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వర కు ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు. ఈ స్వామి వారికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టం. ఇంకా భజ నలు అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఈ ఆల యానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వచి స్వామివారి అపార కృపకు పాత్రులవుతారు.
ఆలయ ప్రాంగంలోని రావిచెట్టు కింద సిద్ధేశ్వ రాస్వామి ఆలయం ఉంది. భక్తులు కోరిన కోర్కెలు అక్కడ సిద్ధిస్తాయని నమ్ముతారు. దీంతో అక్కడ ఉన్న పరమశివునికి సిద్దేశ్వరుడు అని పేరు వచ్చిం ది. పాండురంగుడి పరమ భక్తుడైన నరసింహం 16.1.1974లో స్వర్గస్తులయ్యారు. ఆ సమయం లో ఆయన నుంచి ఒక కాంతి వెలువడి ఆలయం లో ఉన్న పాండురంగడిలో ఐక్యమయ్యింది. సహ స్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకార నాదం తో మోగటం అనేకమంది చూశారంటారు.
– దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement